శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎస్ఈఆర్బీ మద్దతుగల ప్రాజెక్టులకు ఎస్టీఐ ఇన్ఫరేషన్ కలిగిన సమగ్ర గేట్‌వే
Posted On:
11 MAR 2021 9:58AM by PIB Hyderabad
రియల్ టైమ్ ఎస్టీఐ సమాచారం మరియు సాంకేతికత కలిగిన సమగ్ర గేట్‌వే ఇప్పుడు బలమైన శాస్త్రవేత్త సృష్టించగలదు, అలాగే సైన్స్ సమాజం అనుసంధానం అవుతుంది.
అభివృద్ధి చెందుతున్న విభాగాలలో అంతర్జాతీయ పోటీ పరిశోధనలకు ప్రణాళిక, ప్రచారం మరియు నిధుల కోసం పనిచేస్తున్న ప్రధాన ఏజెన్సీ అయిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) అందించిన పరిశోధనల గురించి సమాచారాన్ని పొందడంలో సహాయపడే ఒక పోర్టల్ అభివృద్ధి చేయబడింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టీ) యొక్క స్టాట్యుటరీ బాడీ అయిన ఎస్ఈఆర్బీ అభివృద్ధి చేసిన 'ఎస్ఈఆర్బీ- ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ & మేనేజ్మెంట్ (ఎస్ఈఆర్బీ- ప్రిస్మ్)' అనే పోర్టల్ ను ఎస్ఈఆర్బీ చైర్మన్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఈ-ప్లాట్‌ఫాం ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ శర్మ ఈ పోర్టల్‌ను నీరు, విద్యుత్తు, మరియు వాతావరణం వంటి ముఖ్యమైన రంగాలతో పాటు సైంటిఫిక్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (ఎస్‌ఎస్‌ఆర్) తో అనుసంధానించాలని సూచించారు.
పరిశోధనా ధోరణులను పరిశీలించడానికి, అత్యాధునిక విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవడానికి, వారి పరిసరాల్లో క్లిష్టమైన పరికరాలను గుర్తించడానికి మరియు సహాయపడటానికి పరిశోధకులను అనుమతించేటప్పుడు ఎస్ఈఆర్బీ- ప్రిస్మ్ ప్రాజెక్ట్ వివరాలు, పరిశోధన ఫలితాలు, సృష్టించిన సౌకర్యాలు మరియు ఎస్ఈఆర్బీ నిధుల నుండి ఉద్భవించిన విజయాలను, వివిధ విభాగాల సహకారాన్ని వివరిస్తుంది.
ఎస్ఈఆర్బీ ప్రారంభమైన నాటి నుండి ఆర్ అండ్ డి నిధుల పోకడలను, ఎస్ఈఆర్బీ- ప్రిస్మ్ యొక్క ముఖ్య లక్షణాలను మరియు దాని ప్రయోజనాన్ని ఎస్ఈఆర్బీ కార్యదర్శి ప్రొఫెసర్ సందీప్ వర్మ వివరించారు.
ఈ పోర్టల్ 2011 నుండి ఎస్ఈఆర్బీ మంజూరు చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి రూపొందించబడింది. వీటిలో నిధుల వివరాలు, వాటి పరిస్థితి, పరిశోధన సారాంశం మరియు ప్రచురణలు మరియు పేటెంట్లు వంటి ప్రాజెక్ట్ అవుట్ పుట్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. పిఐ పేరు, సంస్థ, రాష్ట్రం, కీలకపదాలు, అలాగే సంవత్సర వారీగా జాబితా మరియు ఈ ప్రాజెక్టులలో ఎస్ఈఆర్బీ మంజూరు చేసిన పరికరాల ద్వారా ప్రాజెక్టుల గురించి సమాచారాన్ని తిరిగి పొందటానికి శోధన వీలు కల్పిస్తుంది.
***
(Release ID: 1704085)
Visitor Counter : 140