ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టెక్ భారత్ 2021 ప్రారంభ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్‌హర్షవర్ధన్
హెల్త్‌టెక్, ఎడ్యుటెక్ రంగాలకు చెందిన వారిని సంయుక్తంగా ఒకే వేదికపైకి తెచ్చిన ఈ సదస్సు ఆరోగ్య రంగానికి నిధులను భారీగా పెంచాల్సి ఉంది. అంతేకాదు, ఆరోగ్యసంరక్షణ రంగంలో సమత్వం ఉండాలిః డాక్టర్ హర్షవర్ధన్
ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున 137 శాతం బడ్జెట్ కేటాయింపుల పెంపు మన ఆరోగ్య రంగ మౌలికసదుపాయాలను బలోపేతం చేయడానికి మాత్రమే కాక ముందస్తు ఆరోగ్య సంరక్షణ, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టడానికి ఉపకరిస్తుంది
Posted On:
06 MAR 2021 4:24PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్‌హర్షవర్ధన్ ఈరోజు 2021 టెక్ భారత్ సెషన్ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లఘు ఉద్యోగ్ భారతి , ఐఎంఎస్ ఫౌండేష|న్ ఈ రెండో ఎడిషన్‌ను ఏర్పాటు చేశాయి.ఈ సదస్సు, హెల్త్ టెక్ , ఎడ్యుటెక్ రంగాలకు చెందిన స్టేక్ హోల్డర్లను సంయుక్తంగా వర్చువల్ వేదికపైకి తీసుకు వచ్చింది. దేశీయ అంతర్జాతీయ స్థాయి నుంచి పాల్గొంటున్న వేలాది మంది మధ్య సంప్రదింపులు చర్చలకు టెక్ భారత్ వీలు కల్పించింది. విధాన నిర్ణేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ సభ్యులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌ల ప్రతినిధులు వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడేలా అర్థవంతమైన భాగస్వామ్యానికి ఇందులో వీలుకల్పిస్తున్నారు.
డాక్టర్ హర్షవర్ధన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, ఆరోగ్య రంగానికి నిధులు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉందని, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల అందుబాటులో సమానత్వం ఉండాలని ఆయన అన్నారు. పేదలకు ప్రభుత్వ సదుపాయాల అందుబాటులో పెద్ద ఎత్తున మెరుగుపరచడం.అత్యావశ్యక ఔషధాలు, ఆరోగ్యప పరికరాల ధరలను గణనీయంగా తగ్గించడం ఈ దిశగా తీసుకున్న మంచి చర్యలని ఆయన అన్నారు.
ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం పునరుద్ఘాటించింది. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగానికి మున్నెన్నడూ లేనంతటి బడ్జెట్‌కేటాయింపులు చేసినట్టు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. బడ్జెట్‌లో భారీగా 137 శాతం కేటాయింపుల పెంపు వల్ల మన ఆరోగ్య రంగమౌలి క సదుపాయాలను బలోపేతం చేయడానికి మాత్రమే కాక, ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ప్రజల శ్రేయస్సుపై ఈ బడ్జెట్ ప్రముఖంగా దృష్టిపెడుతుందని ఆయన అన్నారు. ఈ రంగానికి కేటాయించిన మొత్తం సొమ్ము 2.2 లక్షల కోట్లరూపాయలు. ఇది ప్రస్తుత కీలక సమయంలో పౌరుల ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే పెద్ద ఎత్తున ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పనకు వీలుకల్పిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ప్రభుత్వం కోవిడ్ -19 సమయంలో ప్రజలకు ఉపశమనం కల్పించడంలో తన బాధ్యతను నెరవేర్చడమే కాకుండా, కోవిడ్ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడమే కాకుండా,ముందుముందు మరింత ప్రగతి అభివృద్ధికి వీలు కల్పించేలా ఆత్మనిర్భర్ భారత్ ఏర్పాటుకు అవకాశం లభించిందన్నారు.
కోవిడ్ 19 పై ఏడాది పాటు సాగిన పోరాటంనుంచి నేర్చుకున్న పాఠాలు కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఎలా ఉపయోగపడిందీ ఆయన వివరించారు. దేశంలో ప్రగతిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆరోగ్యాన్ని ఓక కీలక స్తంభంగా గుర్తించినట్టు డాక్టర్ హర్షవర్ధన్‌తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమీకృత ఆరోగ్య సమాచార పోర్టల్ విస్తరణను వర్తింప చేయడం, అన్ని ప్రజారోగ్యల్యాబ్‌ల అనుసంధానం, కొత్త ప్రజారోగ్య యూనిట్లను ఆచరణలోకి తేవడం, ప్రస్తుతం దేశంలో పలు ప్రాంతాలలో ఉన్న ప్రజారోగ్యయూనిట్లను బలోపేతం చేయడం, 15 ఆరోగ్య అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేయడం, రెండు మొబైల్ ఆస్పత్రుల ఏర్పాటు, నేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌ఫర్ వన్ హెల్త్ ఏర్పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించి ఆగ్నేయాసియా ప్రాంతానికి సంబంధించి ప్రాంతీయ పరిశోధన ప్లాట్‌ఫాం ఏర్పాటు, బయో సేఫ్టీ లెవల్ 3 లేబరెటరీల ఏర్పాటు, జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌తరహాలో 4 ప్రాంతీయ ఇన్‌స్టిట్యూట్ ల ఏర్పాటు వంటివి దేశం గర్వంగా చెప్పుకోదగిన కొన్ని చర్యలని మంత్రి అన్నారు.
ఆరోగ్య సంరక్షణకు సంబంధించి సమీకృత విధానానికి మద్దతు తెలుపుతూ డాక్టర్ హర్షవర్ధన్, గత కొద్ది సంవత్సరాలుగా తెలుసుకున్న అంశాలు కోవిడ్ మహమ్మారి సమయంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. ఈ సమయంలో మన మూలాలలోకి వెళ్ళి వ్యక్తి భౌతిక, మానసిక, ఆథ్యాత్మిక బాగుకు వీలు కలిపించే ఔషధ వ్యవస్థలను ఎంచుకునే ఎరుక కలిగిందని కూడా ఆయన తెలిపారు. మన సంప్రదాయ ఆయుర్వేద, యునాని,సిద్ధ వైద్యానికి సంబంధించి సైన్సు ఆధారిత, పరిశోధన ఆధారిత ఫలితాలను చేర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. మన వైద్య రంగంలోని వారు ఈ సంపూర్ణ ఆరోగ్య ప్యాకేజిని ఆరోగ్యసంరక్షణలో భాగం చేసేందుకు ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
మిషన్ పోషన్ 2.0 పథకం పాత్రను కూడా ప్రముఖంగా ప్రస్తావించదలచినట్టు ఆయన తెలిపారు. ఇది పౌష్టికాహార అంశాన్ని, పంపిణీ, ఫలితాలు, అందుబాటును బలోపేతం చేసినట్టు ఆయన చెప్పారు. ఇది అనుబంధ పౌష్టికాహారా కార్యక్రమాలను , పోషణ్ అబియాన్‌ను మిళితం చేస్తుంది. 112 జిల్లాలలో పౌష్టికాహార ఫలితాలను మెరుగు పరిచేందుకు వ్యూహాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రతిపాదించడం జరిగింది. అలాగే సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఇది ప్రముఖంగా ప్రస్తావిస్తోందని అన్నారు.
ఆరోగ్య రంగానికి సంబంధించిన పథకాల గురించి ప్రస్తావిస్తూ ఆయన, మరో ముఖ్యమైన విషయం జల్ జీవన్ మిషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపడం అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ (అర్బన్) రెండో దశ,పరిశుభ్ర గాలికి సంబంధించిన చర్యలు దేశంలో ప్రజల సంపూర్ణారోగ్యాన్ని లక్షించేవని అన్నారు. ఈ పథకాలు కాలుష్యం కారణంగా వ్యాపించే వ్యాధులు,
అలాగే, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్త్య భారత్ యోజన పథకాన్ని రానున్న ఆరు సంవత్సరాలలో 64,180 కోట్ల రూపాయల కేటాయింపులతో చేపట్టనున్నారు. ఇది ప్రైమరి,సెకండరి, టెర్షియరీ సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్ధ్యం పెంపు, కొత్తగా వచ్చే వ్యాధుల గుర్తింపు వాటిని నయం చేయడం, ప్రస్తుత జాతీయ ఆరోగ్యమిషన్‌ను స్వతంత్రంగా బలోపేతం చేయడం వంటివి ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు.
అంటువ్యాధుల భారాన్నితగ్గించడానికి ఉపకరిస్తాయని ఆయన అన్నారు. ఈ పథకం 17,000 గ్రామీణ ఆరోగ్యకేంద్రాలు, 11 000 పట్టణ ఆరోగ్యకేంద్రాలు, వెల్‌నెస్‌సెంటర్లను బలోపేతం చేయడమేకాక అన్నిజిల్లాలలో సమీకృత ప్రజారోగ్య లేబరెటరీలను ఏర్పాటు చేయనుంది. అలాగే 11 రాష్ట్రాలలోని 3,382 బ్లాక్‌లలో ప్రజారోగ్యయూనిట్ల ఏర్పాటు, 602 జిల్లాలలో కీలక ఆరోగ్య సంరక్షణ బ్లాక్‌లు 12 కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయనుంది.
తన ప్రారంభోపన్యాసాన్ని ముగిస్తూ డాక్టర్ హర్షవర్ధన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ భారతదేశానికి సంబంధించి దర్శించిన దార్శనికతే 2022 కు సంబంధించి తన దార్శనికత అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి కన్నకలలను సాకారం చేసేందుకు అందరూ సమష్టి గా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కోరుకున్న బలమైన , సుసంపన్నమైన దేశంగా భారత్ 2022 నాటికి ప్రపంచదేశాలలో ముందుండే లా కృషి చేయాలన్నారు. ఈ లక్ష్యసాధనకు నవ భారతం ఎంతో చేయవలసి ఉందని ఆయన అన్నారు. అయితే ఇందుకు ప్రతి వ్యక్తి భుజం భుజం కలిపి ముందుకువస్తే ఈ లక్ష్యం సాధించడం మన పరిధిలోనే ఉంటుందని ఆయన అన్నారు.
కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి డాక్టర్ కె.సుధాకర్, పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య, లఘు ఉద్యోగ భారతి అధ్యక్షుడు శ్రీ పి.ఎస్ శ్రీ కృష్ణదత్త, ఐఎంఎస్ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ హెచ్.వి. ఎస్. కృష్ణ తదితరులు ఈప్రారంభోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు..
***
(Release ID: 1702951)
Visitor Counter : 245