జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్: పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం మార్చి 31, 2021 వరకూ పొడిగించబడింది

Posted On: 20 FEB 2021 5:17PM by PIB Hyderabad

 

జల్ జీవన్ మిషన్ కింద పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు (ఎడబ్ల్యుసి) మరియు ఆశ్రమ పాఠశాలలో కుళాయి నీటి కనెక్షన్లు కల్పించాలన్న జల్ శక్తి మంత్రిత్వ శాఖ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి మంచి స్పందన లభించింది. పలు రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల పరిధిలోని అన్ని పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో 100% కార్యక్రమాన్ని పూర్తిచేశారి. కొన్ని రాష్ట్రాలు / యుటిలు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అలాగే ఈ గొప్ప కార్యక్రమాన్ని కొనసాగించడానికి మరికొంత సమయం అవసరమని సూచించాయి. రాష్ట్రాలు/యుటిల నుండి వచ్చిన మంచి స్పందన మరియు ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని 2021 మార్చి 31 వరకు పొడిగించింది.


ఈ 100 రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, తమిళనాడు మరియు తెలంగాణ వంటి రాష్ట్రాలు అన్ని పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళాయి నీటిని అందించినట్లు నివేదించాయి. పంజాబ్ రాష్ట్రం అన్ని పాఠశాలల్లో కుళాయి ద్వారా నీటి సరఫరాను చేసినట్టు తెలిపింది. ఈ కార్యక్రమం కింద అంగన్‌వాడీ కేంద్రాలు (ఎడబ్ల్యుసి), పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు త్రాగడానికి పైపుల ద్వారా నీటి సరఫరా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటివరకు 1.82 లక్షల  నీటి నిర్వహణ నిర్మాణం, 1.42 లక్షల వర్షపు నీటి సేకరణ నిర్మాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తంమీద ఇప్పటివరకు 5.21 లక్షల పాఠశాలలు, 4.71 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా నీటి సరఫరా అందించారు. ఇంకా, ఈ పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలలో సుమారు 8.24 లక్షల ఆస్తులు కూడా జియో-ట్యాగ్ చేయబడ్డాయి.


పిల్లలు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా చూడ్డంతో పాటు కోవిడ్ -19 మహమ్మారిని నివారించడానికి పదేపదే చేతులు కడుక్కోవడం అవసరం ఉన్నందున వారికి 'త్రాగడానికి కుళాయి నీరు' అవసరమని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అక్టోబర్ 2 న '100 రోజుల కార్యక్రమం' ప్రారంభించాలని సూచించారు. 2020 గాంధీ జయంతి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పైపుల ద్వారా సురక్షితమైన నీటిని ఉండేలా చూడ్డం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ ప్రభుత్వ విద్యాసంస్థల్లో  మధ్యాహ్నం భోజనానికి, త్రాగడానికి,వండడానికి, చేతులు కడుక్కోవడానికి మరియు మరుగుదొడ్లలో వాడటం కోసం త్రాగునీటి పైపుల ద్వారా నీటి సరఫరాను చేయడానికి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.


దేశవ్యాప్తంగా పిల్లలకు పరిశుభ్రమైన మరియు సురక్షితమైన తాగునీరు అందించే గొప్ప ప్రయత్నంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ సేఖావత్ ప్రత్యేక మిషన్ మోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ఆశ్రమ విద్యాసంస్థల్లో పైపుల ద్వారా త్రాగునీటి సరఫరాను అందించడానికి 2020 అక్టోబర్ 2న చేపట్టిన కార్యక్రమం 2021 మార్చి 31 వరకు పొడిగించబడింది. తద్వారా ఏ ఒక్క పాఠశాల, అంగన్వాడీ కేంద్రం లేదా ఆశ్రమ పాఠశాలల్లో  ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటి సరఫరా అందించలేని పరిస్థితి లేకుండా చూసుకోవాలి.

***



(Release ID: 1699789) Visitor Counter : 160