ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫుడ్ ప్రాసెసింగ్‌లో పాల‌నీయ ప‌రిష్కారాలు, సృజ‌నాత్మ‌క భావ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్న రా‌మేశ్వ‌ర్ తెలి

Posted On: 19 FEB 2021 5:50PM by PIB Hyderabad

అస్సాం ప్ర‌భుత్వం, అసోచాం ( ) భాగ‌స్వామ్యంతో గువాహ‌తిలో శుక్ర‌వారం నిర్వ‌హించిన ఉద‌యిస్తున్న ఈశాన్యం 4వ ఎడిష‌న్ కార్య‌క్ర‌మంలో భార‌త ప్ర‌భుత్వ‌ ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల సహాయ మంత్రి రామేశ్వ‌ర్ తెలి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు 19-21 ఫిబ్ర‌వ‌రి 2021, వ‌ర‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో  ఈ ప‌రిశ్ర‌మ గురించి చైత‌న్యాన్నిపెంచేదుకు,  వివిధ భాగ‌స్వాములు మ‌ధ్య నెట్‌వ‌ర్క్ను ప్రోత్స‌హించేందుకు వాణిజ్య స‌మా వేశాలు, ప్ర‌ద‌ర్శ‌న‌ల ద్వారా ఒక వేదిక‌ను అందించేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.
ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ, దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ వృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌ని రామేశ్‌ర్ తెలి చెప్పారు. ప్ర‌స్తుతం, సుమారు 32.75 బిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర పెట్టుబ‌డితో దాదాపుగా న‌మోదు చేసుకున్న 40వేల యూనిట్లు 160 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన ఉత్పాద‌న చేస్తూ క‌నీసం 1.93 మిలియ‌న్ల మంది వ్య‌క్తుల‌తో క‌లిసి ప‌ని చేస్తోంద‌ని, దీనిని బ‌హుళత‌రం చేయాల‌ని ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు. 
మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ప్ప‌టికీ, గ‌త ఏడాది ప్ర‌భుత్వం వివిధ రాష్ట్రాల‌లో 21 ఆగ్రో ప్రాసెసింగ్ క్ల‌స్ట‌ర్లు, 47 కోల్డ్ చైన్లు, 43 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స‌హా 134 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల‌ను ఆమోదించింద‌నిమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులు అద‌న‌పు వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ప్రాసెసింగ్‌, ఏడాదికి 3.83 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నులను భ‌ద్ర‌ప‌ర‌చే సామ‌ర్ధ్యంతో, 77,300మందికి పైగా వ్య‌క్తుల‌కు ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ఉపాధిని ఈ ప్రాజెక్టులు సృష్టించ‌నున్నాయి. 
ఆహార ప్రాసెసింగ్ రంగంలో భార‌త్ స‌మ‌గ్ర పోటీత‌త్వాన్ని, సామ‌ర్ధ్యాల‌ను 2021-22 కేంద్ర బ‌డ్జెట్ ప్రోత్స‌హించేందుకు తోడ్ప‌డుతుంద‌ని తెలి అన్నారు. ఈ రంగంలో నిక‌ర‌మైన ప‌రిష్కారాలు, సృజ‌నాత్మ‌క భావ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఆహార ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మే కాక‌, వివిధ ప‌థ‌కాల ద్వారా వాల్యూ చైన్ (విలువ గొలుసు) వ్యాప్తంగా పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తోందన్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ దిశ‌గా ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపి ప‌ని చేసేందుకు ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధుల‌ను, స్టార్ట‌ప్‌ల‌ను, పౌరుల‌ను ముందుకు రావ‌ల‌సిందిగా ఆయ‌న ఆహ్వానించారు. 
ఆహార ప్రాసెసింగ్‌, అనుబంధం రంగం - అస్సాంకు ప్ర‌యోజ‌నం అన్న శీర్షిక‌తో కూడిన ప‌రిచ‌య నివేదిక‌ను తెలి విడుద‌ల చేశారు. ఈ నివేదిక నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (NABARD) భాగ‌స్వామ్యంతో త‌యారు చేశారు.

 

****


(Release ID: 1699524) Visitor Counter : 111


Read this release in: Hindi , English , Urdu , Assamese