రైల్వే మంత్రిత్వ శాఖ

ప్ర‌యాణికుల సౌక‌ర్యాన్ని మెరుగు ప‌రిచేందుకు రైళ్ల‌కు సంబంధించి వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లురైలు ప్ర‌యాణం సుర‌క్షితం , ప్ర‌యాణికుల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు భార‌తీయ రైల్వే ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అలాంటి వాటిలో కొన్ని కింద పేర్కొన‌డం జ‌రిగింది.

Posted On: 05 FEB 2021 3:55PM by PIB Hyderabad

1.న్యూఢిల్లీ - వార‌ణాశి, న్యూఢిల్ల్లీ- శ్రీ‌మాతా వైష్ణోదేవి క‌త్రా  మ‌ధ్య అత్య‌ధునాత‌న వందేభార‌త్ స‌ర్వీసెస్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. ఈ రైళ్ల‌లో స‌త్వ‌ర యాక్సిల‌రేష‌న్‌, రైలులోనే వినోదం, గ్లోబ‌ల్‌పొజిష‌నింగ్ సిస్ట‌మ్ -జిపిఎస్ వ్య‌వ‌స్థ‌తో కూడిన ప్ర‌యాణికుల స‌మాచార వ్య‌వ‌స్థ‌, ఆటోమేటిక్ స్ల‌యిడింగ్ డోర్లు, రిట్రాక్ట‌బుల్ మెట్లు, జీరో డిశ్చార్జి వాక్యూమ్ బ‌యోటాయిలెట్ల స‌దుపాయం ఉన్నాయి.
 2. వివిధ ప్రీమియం రైళ్లు అయిన హ‌మ్‌స‌ఫ‌ర్‌, తేజ‌స్‌,అంత్యోద‌య‌, ఉత్కృష్ట్‌డ‌బుల్ డెక‌ర్ ఎయిర్ కండిష‌న్డ్ యాత్రి ( ఉద‌య్‌), మ‌హామ‌న‌, దీన్ ద‌యాలు, అనుభూతి వంటి కోచ్‌లలో మెరుగుప‌రిచిన ఇంటీరియ‌ర్లు, వెలుప‌లి అలంక‌ర‌ణ‌లు, మెరుగైన ప్ర‌యాణికుల స‌దుపాయాలను భార‌తీయ రైల్వేల‌లో ప‌లు రైళ్ల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.

 3. భార‌తీయ రైల్వేలు లింకే హాఫ్‌మాన్ బుష్ (ఎల్ హెచ్‌బి) కోచ్ ల‌ను మాత్ర‌మే త‌యారు చేస్తున్న‌ది. ఇవి సాంకేతికంగా ఎంతో మెరుగైన‌వి. వీటి లో ప్ర‌యాణం సౌక‌ర్య‌వంతంగా, క‌ళాత్మ‌కంగా,భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంఆ, సంప్ర‌దాయ ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ త‌ర‌హా (ఐసిఎఫ్ ) కోచ్‌లుగా ఉంటాయి.భార‌తీయ రైల్వే ఉత్ప‌త్తి యూనిట్‌లు ఐసిఎఫ్ త‌ర‌హా కోచ్‌లు త‌యారుచేయ‌డం నిలిపివేశాయి. ఇవి ఎల్ హెచ్‌బి త‌ర‌హా కోచ్‌ల‌ను 2018-19 సంవ‌త్స‌రం నుంచి త‌యారు చేస్తున్నాయి.

4.  విస్టాడోమ్ కోచ్‌లు పెద్ద పెద్ద సైడ్ విండోల ద్వారా బ‌య‌టిదృశ్యాన్ని చూడ‌డానికిఅలాగే పై క‌ప్పునుంచి పార‌ద‌ర్శ‌క విభాగాల ద్వారాఆకాశాన్ని చూడ‌డానికి వీలు క‌లుగుతుంది.దీనివ‌ల్ల ప్ర‌యాణికులు తాము ప్ర‌యాణించే ప్ర‌దేశాల‌లోని అందాల‌ను అద్భుతంగా తిల‌కించ‌డానికి వీలు క‌లుగుతుంది. ఇందులో అత్య‌ధునాత‌న సదుపాయాలు, కొత్త‌కొత్త ఫీచ‌ర్లు ఉన్నాయి.
5. భార‌తీయ రైల్వే 2018 ఏప్రిల్‌లో ప్రాజెక్ట్ ఉత్కృష్ట్‌ను ప్రారంభించింది.ఇది మెయిల్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లో ఐసిఎప్ త‌ర‌హా కోచ్‌ల‌లో స‌దుపాయా మెరుగుప‌ర‌చ‌డానికి ఉద్దేశించిన‌ది. 2020 డిసెంబ‌ర్ నాటికి ప్రాజెక్ట్ ఉత్కృష్ట్ కింద మెయిల్ , ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు సంబంధించి 447 రేక్‌ల‌ను అప్‌గ్రేడ్ చేయ‌డం జ‌రిగింది.

6.ప్రాజెక్టు స్వ‌ర‌ణ్ కింద 65 రేక్‌ల రాజ‌ధాని, శ‌తాబ్ది రైళ్ల‌ను వివిధ ర‌కాలుగా అప్‌గ్రేడ్‌చేయ‌డం జ‌రిగింది. ఇందులో కోచ్ అంత‌ర్భాగాలు మెరుగుప‌ర‌చ‌డం, టాయిలెట్లు,కోచ్‌లో ప‌రిశుభ్ర‌త‌, సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌, కోచ్‌లో స‌ర‌ఫ‌రా చేసే వ‌స్త్రాలను మెరుగు ప‌ర‌చ‌డం జ‌రిగింది.
7. 63 స్మార్ట్‌కోచ్‌ల‌కు అత్యధునాత‌న స‌దుపాయాలు క‌ల్పించారు. స్మార్ట్‌ప‌బ్లిక్ అడ్ర‌స్‌సిస్ట‌మ్‌, పాసింజ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ స‌దుపాయం క‌ల్పించారు. స్మార్ట్ హెచ్ విఎసి ( హీటింగ్‌, వెంటిలేష‌న్‌, ఎయిర్‌కండిష‌నింగ్‌సిస్ట‌మ్ )  క‌ల్పించ‌డం జ‌రిగింది. స్మార్ట్ సెక్యూరిటీ, నిఘా వ్య‌వ‌స్థ‌ల‌నూ త‌యారు చేసి ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
8. .ఎండ్ - ఆన్‌- జ‌న‌రేష‌న్ రైళ్ల‌ను హెడ్ ఆన్ జ‌న‌రేష‌న్ (హెచ్ ఓజి) రైళ్లుగా మార్పి రైళ్ల‌లో రైల్వే స్టేష‌న్ల‌లో వాటినుంచి శ‌బ్ద‌కాలుష్యం , వాయు కాలుష్యం  రాకుండాత‌గ్గించ‌డం జ‌రిగింది. 9.శిలాజ ఇంధ‌నాల వినియోగాన్ని త‌గ్గించ‌డానికి   కోచ్‌ల‌లో  సంప్ర‌దాయ లైటింగ్‌కు బ‌దులుగా అధునాత‌న‌ లైట్ ఎమిటింగ్ డ‌యోడ్ (ఎల్‌.ఇ.డి) లైట్‌ల‌ను అమ‌ర్చ‌డం జ‌రిగింది.

10. రైళ్ల‌లో మొబైల్ చార్జింగ్ పాయింట్ల‌ను కూడా రైల్వేలు పెంచ‌డం జ‌రిగింది.

11 భార‌తీయ రైల్వేల‌కు చెందిన 2,900 కి పైగా కోచ్‌ల‌లో సిసిటివి కెమెరాల‌ను అమ‌ర్చ‌డం  జ‌రిగింది..ప‌శ్చిమ‌రైల్వే, మ‌ద్య రైల్వేల‌లో ఎయిర్‌కండిష‌న్డ్ ఎల‌క్ట్రిక్‌మ‌ల్టిపుల్ యూనిట్ (ఇఎంయు) స‌ర్వీసుల‌ను ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రిగింది. అత్య‌వ‌స‌ర టాక్‌బ‌ట‌న్‌,సిసిటివి కెమెరాల‌ను ఇఎంయు రైళ్ల‌లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

12. అత్య‌వ‌స‌ర టాక్‌బ్యాక్ వ్య‌వ‌స్థ‌, సిసిటివి కెమెరాల‌కు తోడు భ‌ద్ర‌తావ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేసేందుకుఆగ్నేయ రైల్వేలో ఇఎంయు రేక్‌ల‌లోని మ‌హిళ‌ల కోచ్‌ల‌లో ఫ్లాష‌ర్‌లైట్లుఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

13.ఇ ఎం యు, కోల్‌క‌తా మెట్రో రైళ్ల‌లో జిపిఎస్ ఆధారిత పాసింజ‌ర్ అనౌన్స్‌మెంట్‌, ప్ర‌యాణికుల స‌మాచార వ్య‌వ‌స్థ‌ల‌ను (పిఎపిఐఎస్‌) ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈపాసింజ‌ర్ స‌మాచార‌వ్య‌వ‌స్థ రాబోయే స్టేష‌న్‌కు సంబంధించిన సమాచారాన్ని స్పీక‌ర్ల ద్వారా ఆడియో ప్ర‌క‌ట‌న రూపంలోను, అలాగే  ఎల్‌.ఇ.డి తెర‌ల‌పై వీడియో ద్వారా ప్ర‌ద‌ర్శిస్తారు.దీనికితోడు కొత్త‌గా త‌యారైన ఇఎంయు , మెయిన్ లైన్ ఎల‌క్ట్రిక్ మ‌ల్టిపుల్ యూనిట్ ( ఎంఇఎంయు) రేక్‌లు ఇలాంటి సాంకేతిక ప‌రిజ్ఞాన వ్య‌వ‌స్థ‌ను ఇప్ప‌టికే క‌లిగి ఉన్నాయి.

ప్ర‌యాణికుల కోచ్‌ల‌లో మెరుగైన సుద‌పాయాలు క‌ల్పించ‌డం అనేది భార‌తీయ‌రైల్వేల నిరంత‌ర కృషిగా చెప్పుకోవ‌చ్చు. 


ఈ స‌మాచారాన్ని రైల్వే, వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారాం. ప్ర‌జా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్ ఈ రోజు రాజ్య‌స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు లిఖిత పూర్వ‌క‌స‌మాధానంలో తెలిపారు.

 

****

 



(Release ID: 1695792) Visitor Counter : 84


Read this release in: English , Bengali