జల శక్తి మంత్రిత్వ శాఖ

జల శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అధ్యక్షతన కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి)సమీక్ష

జియాంగ్ / బ్రహ్మపుత్ర నది వరదల నివారణకు ప్రణాళికలపై సమీక్ష మరియు టిబెట్ లోని మేడాంగ్

వద్ద సూపర్ జలవిద్యుత్ స్టేషన్ నిర్మాణానికి చైనా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వచ్చిన ఆందోళనకర వార్తలపై చర్చ

Posted On: 20 JAN 2021 6:16PM by PIB Hyderabad

  వివిధ కార్యక్రమాలు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పి ఎం కె ఎస్ వై)  మరియు డ్రిప్ (డి ఆర్ ఐ పి) ద్వారా సాధించిన ప్రగతిని జలశక్తి శాఖ సహాయ మంత్రి సమీక్షించారు.  గడచిన ఏడాదిన్నర కాలంలో 99 ప్రాధాన్యత ప్రాజెక్టులలో 10 ప్రాజెక్టులు పూర్తయినట్లు  మంత్రికి తెలియజేశారు.   రూ. 10,000 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న డ్రిప్ రెండవ మరియు మూడవ దశ స్కీములను మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రికి తెలియజేశారు.  ఆ 10,000 కోట్ల రూపాయలలో 7,000 కోట్ల మేరకు ప్రపంచ బ్యాంకు ,  ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు ఆరిక సహాయం చేస్తాయి.  డ్రిప్ మొదటి దశ కింద ఏడు రాష్ట్రాల లోని 223 డ్యాములకు సంబంధించిన పునరావాస పనలు రూ. 3466 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్లు కూడా మంత్రికి తెలియజేయడం జరిగింది.  ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు  శ్రీ రతన్ లాల్ కటారియా కేంద్ర జల సంఘాన్ని ప్రశంసించారు.  

నదీ పరివాహక ప్రాంత సంస్థల ఏర్పాటు ద్వారా నీటి నిర్వహణ బాగుండగలదని కూడా మంత్రికి తెలియజేయడం జరిగింది. అయితే దేశంలో జల వివాదాలు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు ఆమోదించడం ద్వారా జల వివాదాలు త్వరగా పరిష్కారం కాగలవని సిడబ్ల్యుసి అధికారులు తెలియజేశారు. దేశంలో జల వనరుల సమగ్ర పర్యవేక్షణకు అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు  మరియు డ్యాముల భద్రత బిల్లులను ఆమోదించడం తప్పనిసరి అని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.  

గత ఏడాది కాలంలో  వరదలకు సంబంధించి భావి సూచన చేసే 79 కొత్త కేంద్రాలను నిర్వహణలోకి తెచ్చినట్లు శ్రీ కటారియాకు తెలిపారు.  ఫలితంగా 19 నదీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 328 వరద సూచన స్టేషన్ల నుంచి 2020 సంవత్సరంలో  11,721 సూచనలు చేయడం జరిగిందని తెలిపారు.  2020 మే నెల నుంచి స్థాయి పెంచిన వరద సూచనల కొత్త వెబ్ సైట్ https://ffs.tamcnhp.com మరియు వరద డేటా  నమోదు సౌకర్యం ప్రారంభమైంది.  

     వరద సూచనలు మరియు నిర్వహణపై జరిగిన చర్చ సందర్భంగా బ్రహ్మపుత్ర నది వరదల వల్ల తలెత్తిన సమస్య గురించి చర్చించారు.   ఎగువ జియాంగ్ / బ్రహ్మపుత్రపై ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత గురించి అధికారులు మంత్రికి తెలియజేశారు.  టిబెట్ లోని మేడాంగ్ వద్ద సూపర్ జలవిద్యుత్ స్టేషన్ నిర్మాణానికి చైనా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ  బ్రహ్మపుత్ర నదీ జలాలను మళ్ళించినట్లయితే ప్రవాహం తక్కువగా ఉండే రోజుల్లో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోగలదని,  చైనా గనక  నీరు మళ్ళించినట్లయితే  నదీ తీర దిగువ  దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్ ల హక్కులకు భంగకరం కాగలదని తెలిపారు.  అయితే రెండు దేశాలలో ప్రవహించే నదులకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి ఇండియా, చైనా మధ్య 2006లోనే  ఏర్పాటు చేసిన అధికార వ్యవస్థ -- ఒక నిపుణుల స్థాయి యంత్రాంగం ఉంది. .  

***
 



(Release ID: 1691023) Visitor Counter : 210


Read this release in: English , Urdu , Hindi , Punjabi