వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈక్వలైజేషన్ లెవీపై అమెరికా ఎస్-301 నివేదికకు భారత్ ప్రతిస్పందన
Posted On:
07 JAN 2021 6:48PM by PIB Hyderabad
భారత దేశం విధించిన ఈక్వలైజేషన్ లెవీతో సహా వివిధ దేశాలు స్వీకరించిన లేదా పరిశీలనలో ఉన్న డిజిటల్ సేవలపై పన్ను విధింపునకు సంబంధించి వర్తక చట్టం 1974 లోని సెక్షన్ 301 కింద దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా తెలిపింది. యు.ఎస్. పరిపాలన విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ తరహా దర్యాప్తు ఎదుర్కొంటు ఇతరత్రా దేశాలలో ఇటలీ, టర్కీ, బ్రిటన్‌లు కూడా ఉన్నాయి. దర్యాప్తులో భారతదేశానికి సంబంధించి ప్రత్యేక దృష్టి ఈ-కామర్స్ సేవల సరఫరాపై భారత్ విధించే 2% ఈక్వలైజేషన్ లెవీ (ఈఎల్) పై ప్రధానంగా ఉంది. అమెరికా కంపెనీలపై ఈఎల్ వివక్ష లేక పునరాలోచనలో భాగంగా వర్తింపజేయబడిందా అమెరికాను వేరు చేసి విధించబడిందా అనే కోణంలో ఈ దర్యాప్తు ముందుకు సాగుతోంది. భారత్‌లో ఈ సంస్థలు స్థానికమైనవి కానందును.. వివిధ అంతర్జాతీయ పన్ను నిబంధనల్ని అనుసరించి ఆయా సంస్థలపై పన్ను వర్తింపజేస్తున్నారా అనే కోణంలో కూడా ఈ దర్యాప్తు సాగుతోంది. ఇదే విషయమై సంప్రదింపుల కోసం అమెరికా మన దేశాన్ని అభ్యర్థించింది. భారతదేశం 15 జూలై 2020న యుఎస్‌టీఆర్‌కు తన వివరణను సమర్పించింది. దీనికి సంబంధించి 5 నవంబర్ 2020న జరిగిన ద్వైపాక్షిక సంప్రదింపులలోనూ పాల్గొంది. ఈఎల్ విషయంతో తమకు ఎలాంటి వివక్ష లేదని నొక్కి చెప్పింది; కానీ దీనిపై అమెరికా విశ్లేషణ చేస్తూ విరుద్ధంగా వ్యాఖ్యానించింది.. ఈ-కామర్స్ కార్యకలాపాలకు సంబంధించి భారత దేశంలో ఉంటున్న సంస్థలు మరియు భారతదేశంలో ఉండని లేదా భారత దేశంలో శాశ్వత స్థాపన లేని సంస్థలకు కూడా సమానమైన అవకాశాలను కల్పించాలని కోరింది. ఈఎల్ వర్తించే విధంగా మాత్రమే వర్తింపజేయబడిందని.. అదనపు ప్రాదేశిక అనువర్తనం లేదని అమెరికాకు స్పష్టం చేయబడమైంది. డిజిటల్ మార్గాల ద్వారా భారతదేశ భూభాగంలో జరిగే అమ్మకాలపై ఆధారపడి ఈ పన్ను
లేవీ ఉంటుంది కాబట్టి ఈ విధానంను అనుసరిస్తున్నట్టు తెలియజేయడమైంది.
భారత మార్కెట్ నుండి వచ్చే ఆదాయానికి సంబంధించి భారతదేశానికి చెందిన ఈ-కామర్స్ ఆపరేటర్లు ఇప్పటికే భారత దేశంలో పన్నులకు లోబడి ఉన్నారు.
అయితే ఈఎల్ లేనప్పుడు స్థానికం కాని ఈ-కామర్స్ ఆపరేటర్లు (భారతదేశంలో శాశ్వత స్థాపన లేకపోవడం కానీ గణనీయమైన ఆర్థిక ఉనికిని కలిగి ఉండని వారు) భారత మార్కెట్లో ఈ-కామర్స్ సరఫరా, అందించిన సేవలలో పొందిన పరిశీలనకు సంబంధించి పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదు. భారత్‌లో శాశ్వత స్థాపన లేని నాన్-రెసిడెంట్ ఈ-కామర్స్ ఆపరేటర్‌పై 2% ఈఎల్ విధించ బడుతోంది.లెవీ విధింపు అనేది ఏలాంటి అమెరికా కంపెనీలపై వివక్ష చూపదు, ఎందుకంటే ఇది వారి నివాస దేశంతో సంబంధం లేకుండా అన్ని రకాల నాన్-రెసిడెంట్ ఈ-కామర్స్ ఆపరేటర్లకు సమానంగా వర్తిస్తుంది. 2020 ఏప్రిల్ 1 వ తేదీకి ముందు లెవీ అమలు చేయబడినందున.. పునరాలోచన మూలకం లేదు, ఇదే లెవీ యొక్క ప్రభావవంతమైన తేదీ. ఇది భారతదేశం నుండి వచ్చే ఆదాయంపై మాత్రమే వర్తిస్తుంది కాబట్టి దీనికి అదనపు ప్రాదేశిక అనువర్తనం లేదు. ఈఎల్ అనేది బీఈపీఎస్ ప్రాజెక్ట్ యొక్క యాక్షన్ 1 పై 2015 ఓఈసీడీ / జీ20 రిపోర్ట్ సూచించిన పద్ధతుల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థ యొక్క డిజిటలైజేషన్ నుండి ఉత్పన్నమయ్యే పన్ను సవాళ్లు పరిష్కరించే లక్ష్యంతో ఇది అమలులోకి
వచ్చింది. ఈక్వలైజేషన్ లెవీ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, న్యాయమైన పోటీ, సహేతుకత మరియు వారి డిజిటల్ కార్యకలాపాల ద్వారా భారతీయ మార్కెట్‌తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేలా వ్యాపారాలకు పన్ను విధించే విషయమై ప్రభుత్వాల సామర్థ్యాన్ని ఉపయోగించడం. ఈ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో, అమ్మకందారుడు ఎలాంటి భౌతిక ఉనికి లేకుండానే.. తన వ్యాపార లావాదేవీల్లో పాల్గొనవచ్చు. అలాంటి లావాదేవీలపై పన్ను విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంది. అయితే జనవరి 6న యుఎస్‌టీఆర్ కార్యాలయం భారతదేశ డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (డీఎస్‌టీ) సెక్షన్ 301 దర్యాప్తుపై తన పరిశోధనలను విడుదల చేసింది. ఇందులో భారతదేశం యొక్క డీఎస్‌టీ - ఈక్వలైజేషన్ లెవీ - వివక్షత మరియు అమెరికా వాణిజ్యాన్ని పరిమితం చేస్తుందని తేల్చింది. ఇటలీ మరియు టర్కీపై కూడా జనవరి 6న అమెరికా ఇలాంటి నిర్ణయాలనే వ్యక్తపరిచింది. ఈ విషయంలో యు.ఎస్ నోటిఫై చేసిన నిర్ణయం/ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది. జాతీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటుంది.
****
(Release ID: 1687021)
Visitor Counter : 213