వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2020-21 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ లో ఎంఎస్ పి కార్య‌క‌లాపాలు

గ‌త ఏడాదితో పోల్చితే 24.98% పెరిగిన ధాన్యం సేక‌ర‌ణ‌

కెఎంఎస్ సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌తో 65.32 ల‌క్ష‌ల మంది ధాన్యం రైతుల‌కు ల‌బ్ధి; ఎంఎస్ పి విలువ రూ.95596.84 కోట్లు

నాడు పోస్టు చేయడమైనది: 05 JAN 2021 8:12PM by PIB Hyderabad

ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ లో ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఎంఎస్ పి స్కీమ్ ల‌కు అనుగుణంగా ఎంఎస్ పి ధ‌ర‌ల‌కు రైతుల నుంచి 2020-21 ఖ‌రీఫ్ పంట దిగుబ‌డుల‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తోంది. 

పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఉత్త‌రాఖండ్‌, త‌మిళ‌నాడు, చండీగ‌ఢ్‌, జ‌మ్ము& క‌శ్మీర్‌, కేర‌ళ‌, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్ గ‌ఢ్‌, ఒడిశా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, బిహార్‌, జార్ఖండ్‌, అస్సాం, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో 2020-21 ఖ‌రీఫ్ ధాన్యం కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. 2021 జ‌న‌వ‌రి 4వ తేదీ నాటికి 506.33 ఎల్ఎంటి ధాన్యం కొనుగోళ్లు జ‌రిగాయి. గ‌త ఏడాది ఇదే సీజ‌న్ లో సేక‌రించిన 405.10 ఎల్ఎంటితో పోల్చితే ఇది 24.98 శాతం ఎక్కువ‌. మొత్తం కొనుగోలు చేసిన‌ 506.33 ఎల్ఎంటి ధాన్యంలో ఒక్క పంజాబ్ నుంచి కొనుగోలు చేసిన ధాన్య‌మే 202.77 ఎల్ఎంటిలు. మొత్తం కొనుగోలులో ఇది 40.04 శాతంతో స‌మానం.

కెఎంఎస్ కొనుగోలు కార్య‌క‌లాపాల మొత్తం విలువ రూ.95596.84 కోట్లు. దీని ద్వారా 65.32 ల‌క్ష‌ల మంది రైతులు ల‌బ్ధి పొందారు.

అలాగే వివిధ రాష్ర్టాల నుంచి అందిన ప్ర‌తిపాద‌న‌ల ఆధారంగా 2020 ఖ‌రీఫ్ మార్కెటింగ్ సీజ‌న్ లో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, తెలంగాణ‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ఒడిశా, రాజ‌స్తాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల నుంచి ధ‌ర‌ల మ‌ద్ద‌తు ప‌థ‌కం (పిఎస్ఎస్‌) కింద  51.66 ఎల్ఎంటి ప‌ప్పుదినుసులు, నూనె గింజ‌లు కొనుగోలు చేసేందుకు ఆమోదించారు. ఇది కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ర్టాల నుంచి 1.23 ఎల్ఎంటి కొబ్బ‌రి (నిరంత‌రం పండే పంట‌) కొనుగోలుకు కూడా అనుమ‌తి ఇచ్చారు. అలాగే పిఎస్ఎస్ స్కీమ్ కింద ప్ర‌క‌టిత ఎంఎస్ పి ధ‌ర‌కు ఇత‌ర రాష్ర్టాల నుంచి ప‌ప్పుదినుసులు, నూనెగింజ‌లు, కొబ్బ‌రి కొనుగోలుకు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌కు కూడా ఆమోదం తెలిపారు. ఈ ప‌థ‌కం కింద‌ 2020-21 సంవ‌త్స‌రంలో ఎఫ్ఏక్యు గ్రేడ్ పంట‌ల మార్కెట్ ధ‌ర‌లు ఎంఎస్ పి క‌న్నా త‌క్కువ‌గా ఉంటే  ముందుగానే న‌మోదు చేసుకున్న రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తారు. ఆయా రాష్ర్టాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ప్ర‌క‌టిత పంట కాలంలో మార్కెట్ రేట్లు ఎంఎస్ పి  క‌న్నా త‌గ్గితే కేంద్ర నోడ‌ల్ ఏజెన్సీలు రాష్ర్టాల్లోని అధీకృత ప్రొక్యూరింగ్ ఏజెన్సీల ద్వారా ఈ కొనుగోళ్లు నిర్వ‌హిస్తారు.

2021 జ‌న‌వ‌రి నాలుగో తేదీ నాటికి ప్ర‌భుత్వం నోడ‌ల్ ఏజెన్సీల ద్వారా 2,70,579.82 ఎంటి పెస‌ర‌, మినుము, వేరుశ‌న‌గ‌, సోయాగింజ‌లు ఎంఎస్ పి ధ‌ర‌ల‌కు కొనుగోలు చేశారు. రూ.1447.54 కోట్ల విలువ గ‌ల ఈ కొనుగోలు ద్వారా త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, హ‌ర్యానా, రాజ‌స్తాన్ ల‌కు చెందిన 1,44,969 మంది రైతులు లాభంపొందారు. 

అలాగే 2021 జ‌న‌వ‌రి నాలుగో తేదీ నాటికి రూ.52.40 కోట్ల ఎంఎస్ పి విలువ గ‌ల 5089 ఎంటి కొబ్బ‌రి (నిరంత‌రం పండే పంట‌) కొనుగోలు చేశారు. త‌ద్వారా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ర్టాల‌కు చెందిన 3961 మంది రైతులు ల‌బ్ధి పొందారు. గ‌త ఏడాది ఇదే సీజ‌న్ లో కొనుగోలు చేసిన కొబ్బ‌రి 293.34 ఎంటి. ప‌లు రాష్ర్టాల్లో కొబ్బ‌రి, మినుము మార్కెట్ ధ‌ర‌లు ఎంఎస్ పి క‌న్నా అధికంగానే ఉన్నాయి. ఖ‌రీఫ్  పంట కాలంలో పండిన ఇత‌ర ప‌ప్పు దినుసులు, నూనెగింజ‌లు అందుబాటులోకి వ‌చ్చిన అనంత‌రం ఆయా రాష్ర్టాలు నిర్ణ‌యించిన తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్తాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, క‌ర్ణాట‌క రాష్ర్టాల్లో ఎంఎస్ పి ధ‌ర‌ల‌కు ప‌త్తి విత్త‌నాల కొనుగోలు కార్య‌క‌లాపాలు కూడా జ‌రుగుతున్నాయి. 2021 జ‌న‌వ‌రి నాలుగో తేదీ నాటికి రూ.22,818.54 కోట్ల విలువ గ‌ల 77,97.758 ప‌త్తి బేళ్లు కొనుగోలు చేశారు. త‌ద్వారా 15,11,519 మంది రైతులు ల‌బ్ధి పొందారు.

 

****


(రిలీజ్ ఐడి: 1686440) సందర్శకుల సూచీ సంఖ్య : : 130
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil