శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం కోసం టైఫాక్ సిద్ధం చేసిన నివేదికను ఈరోజు న్యూఢిల్లీ లో విడుదల చేసిన డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
29 DEC 2020 7:16PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ సాధనకు అనుసరించవలసిన కార్యాచరణపై టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ ( టైఫాక్) రూపొందించిన నివేదికను కేంద్ర శాస్త్రసాంకేతిక, భూశాస్త్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు. కార్యక్రమంలో శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, టైఫాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్ శ్రీవాత్సవ, టైఫాక్ కి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ' మేక్ ఇన్ ఇండియా' అనే అంశంపై 2020 జులైలో టైఫాక్ కొవిడ్ -19 నేపథ్యంలో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా టైఫాక్ తుది నివేదికను రూపొందించింది. ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఆరోగ్య రంగం, యంత్రాలు, ఐసీటీ, వ్యవసాయం, ఉత్పత్తి ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొవిడ్- 19 అనంతర పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చునని నివేదికలో పేర్కొన్నారు. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వివిధ రంగాల బలాలు బలహీనతలను అంచనా వేసి మార్కెట్ అవసరాలను గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ హర్షవర్ధన్ ముందు చూపుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ రూపొందించిన కార్యాచరణ కార్యక్రమం వల్ల కొవిడ్ ను భారతదేశం ఎదుర్కొని విజయం సాధించిందని అన్నారు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. ' భారతదేశం అనుకున్నది సాధిస్తుంది' అని ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు.
ఈ విషయంలో టైఫాక్ చేసిన కృషిని అభినందించిన మంత్రి సంస్థ రూపొందించిన నివేదికలోని అంశాలను అమలు చేయడానికి కృషిజరగాలని సూచించారు. టైఫాక్ సిఫార్సులు ప్రజల జీవనప్రమాణాలను పెంపొందించి ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఉపయోగ పడతాయని మంత్రి అన్నారు.
టైఫాక్ రూపొందించిన కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి పట్టుదల అంకితభావంతో పనిచేయవలసి ఉంటుందని పేర్కొన్న మంత్రి ఏ అంశంలోనూ లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ముఖ్యమైన సిఫార్సులను 2022 ఆగస్ట్ 15 నాటికి అమలు చేయడానికి చర్యలను తీసుకోవాలని ఆయన అన్నారు.
శాస్త్రీయపరమైన సామాజిక భాద్యతను కల్పించి భవిషత్ అవసరాలకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నివేదికను సిద్ధం చేశామని శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి వివరించారు. దీనిలో లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కోడానికి గల అవకాశాలను నివేదికలో పొందుపరిచామని అన్నారు.
నివేదిక ప్రాధాన్యత:
కొవిడ్ -19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీనివల్ల గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రపంచ దేశాలు ఆరోగ్య, ఆర్థికపరమైన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాపితంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుందన్న ఆందోళన నెలకొంది. దీని నుంచి బయటపడడానికి ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడడానికి ప్రపంచదేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ' మేక్ ఇన్ ఇండియా' అనే అంశంపై 2020 జులైలో టైఫాక్ కొవిడ్ -19 నేపథ్యంలో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఆరోగ్య రంగం, యంత్రాలు, ఐసీటీ, వ్యవసాయం, ఉత్పత్తి ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొవిడ్- 19 అనంతర పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చునని నివేదికలో పేర్కొన్నారు. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వివిధ రంగాల బలాలు బలహీనతలను అంచనా వేసి మార్కెట్ అవసరాలను గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు.
దీనిపై అధ్యయనం చేసిన టైఫాక్ నిపుణులు, మేధావులు, పరిశ్రమవర్గాలు, పరిశోధనాసంస్థలు, వివిధ వర్గాలకు చెందినవారితో చర్చలు జరిపి తుది నివేదికను సిద్ధం చేసింది. దీనిలో స్వల్ప, మధ్య, దీర్ఘ కాలాల్లో అమలు చేయవలసి ఉన్న అంశాలను ప్రాధాన్యతా రంగాల వారీగా పొందుపరిచారు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్థానికం నుంచి అంతర్జాతీయం అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దీనిని సాధించడానికి అవసరమైన సాంకేతిక అంశాలు, పరిశోధనా కార్యక్రమాలు, ఉత్పత్తితి అధికం చేయడానికి అనుసరించవలసి ఉన్న వ్యూహాలు, ప్రపంచీకరణ, సమాచార నిర్వహణ, శిక్షణ తదితర అంశాలను నివేదికలో ప్రస్తావించడం జరిగింది.
***
(Release ID: 1684953)
Visitor Counter : 202