సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ)
ఎస్‌సి విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లలో పరివర్తనాత్మక మార్పులకు కేబినెట్ అనుమతి
ఎస్‌సిల విద్యకు ప్రభుత్వం పెద్ద ఊతం
రాగల 5 సంవత్సరాలలో 4 కోట్ల మంది ఎస్.సి విద్యార్దులకు 59,000 కోట్ల రూపాయల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని ఆమోదించిన ప్రభుత్వం
Posted On:
23 DEC 2020 4:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ పథకమైన షెడ్యూలు కులాల విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ - పిఎంఎస్-ఎస్‌సి లో ప్రధానమైన పరివర్తనాత్మక మార్పులను ఆమోదించింది. దీనివల్ల 4 కోట్ల మందికి పైగా ఎస్.సి.విద్యార్ధులకు రాగల 5 సంవత్సరాలలో ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల వారు విజయవంతంగా తమ ఉన్నత విద్యను పూర్తి చేయగలుగుతారు.
కేబినెట్ మొత్తం 59,048 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆమోదించింది. ఇందుకలో కేంద్రప్రభుత్వం 35,534 కోట్ల రూపాయలు (60 శాతం) ఖర్చుచేయనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వాలు ఖర్చుచేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న కమిటెడ్ లయబిలిటీ విధానం స్థానంలో కొత్త విధానం వస్తుంది. ఈ కీలక పథకంలో కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ గా పాలుపంచుకుంటుంది.
షెడ్యూలు కులాల వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 11 వ తరగతి నుంచి ఆపైన ఏదైనా పోస్ట్ మెట్రిక్ కోర్సును చదివేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం వీరి విద్యకు అయ్యే ఖర్చును భరిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం దీనికి మంచి ఊపు ఇచ్చేందుకు కట్టుబడి ఉంది. దీనివల్ల ఎస్‌సిల జిఇఆర్( ఉన్నత విద్య) రాగల 5 సంవత్సరాలలో జాతీయ ప్రమాణాలకు చేరుకోనుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పథకం దృష్టి , నిరుపేద విద్యార్థులను నమోదు చేసుకోవడం, వారికి సకాలంలో చెల్లింపులు చేయడం, సమగ్ర జవాబుదారిత్వం, నిరంతర మానిటరింగ్, పూర్తి పారదర్శకత పై ఉంటుంది. .
పదోతరగతి పాసైన పేదవర్గాల వారు వారికి ఇష్టమైన ఉన్నతవిద్యను అభ్యసించేందుకు ఈ పథకం కింద నమోదుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 1.36 కోట్ల మంది పేద విద్యార్ధులు పదోతరగతి పైన విద్యను కొనసాగించలేక పోతున్నారు. ఇలాంటి వారిని రాగల 5 సంవత్సరాలలో ఉన్నత విద్యారంగంలోకి తీసుకురానున్నారు.
ఈ పథకాన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం పై చేపడతారు. అత్యంత పకడ్బందీ సైబర్ భద్రతా చర్యలను చేపడతారు, ఇది పారదర్శకత, జవాబుదారిత్వం, సమర్థత, సకాలంలో చెల్లింపును ఎలాంటి జాప్యం లేకుండా చేసేలా చూస్తుంది. రాష్ట్రాలు విద్యార్ధుల అర్హత, కులస్థాయి, ఆధార్ గుర్తింపు, బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలన ఆన్‌లైన్ ద్వారా చేపడతాయి.
విద్యార్ధులకు ఈ పధకం కింద ఆర్ధిక సహాయం బదిలీ డిబిటి పద్ధతిలో ఉంటుంది.ప్రత్యేకించి ఇది ఆధార్ అనుసంధానిత పేమెంట్ వ్యవస్థను కలిగి ఉంటుంది. 2021-22 నుంచి ఈ పథకంలో కేంద్రం వాటా (60 శాతం) డిబిటిపద్ధతిలో, ఆయా రాష్ట్రప్రభుత్వాలు తమ వంతు వాటా విడుదల చేసిన తర్వాత నేరుగా విద్యార్దుల బ్యాంకు ఖాతాకు నిర్దేశిత టైమ్ షెడ్యూలు ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది.
సామాజిక ఆడిట్‌లు, వార్షిక థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్, అర్థ సంవత్సర స్వీయ ఆడిటెడ్ రిపోర్టులు ప్రతి సంస్థనుంచి పరిశీలించే యంత్రాంగం ఉంటుంది.
కేంద్ర సహాయం 2017-18 నుంచి 2019-20 వరకు సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇది 2020-21నుంచి2025-26 నాటికి 5 రెట్లుపైగా పెరిగి సుమారు రూ 6000 కోట్ల రూపాయలు కానుంది.
***
(Release ID: 1683194)
Visitor Counter : 112
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam