పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉడాన్ కింద బెల్గాం - సూరత్ - కిషన్గఢ్ మార్గంలో మొదటి విమాన సేవలు మొదలయ్యాయి.

Posted On: 21 DEC 2020 7:40PM by PIB Hyderabad

బెల్గాం (కర్ణాటక) నుండి సూరత్ (గుజరాత్) నుండి కిషన్గఢ్ (అజ్మీర్) వరకు మొదటి విమానం సేవలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్‌సిఎస్-ఉడాన్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ - ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) కార్యక్రమం కింద ఈ రోజు సర్వీసులు ప్రారంభమయ్యాయి.   ప్రారంభోత్సవానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా), ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఐఐ) అధికారులు హాజరయ్యారు. సూరత్-కిషన్గఢ్-బెల్గాం మార్గంలో విమాన కార్యకలాపాలను ప్రారంభించడమేగాక, ఉడాన్ పరిధిలోని దేశంలోని టైర్ -2 & టైర్ -3 నగరాలకు మెట్రోలతో ఎయిర్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది. ఉడాన్ పథకం కింద 300 కి పైగా రూట్లలో విమానాలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం మొదలైనది 303వ రూటు.

                     ఇప్పటికీ కనెక్టివిటీ లేని ప్రాంతాలను అనుసంధానించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఉడాన్ 3 బిడ్డింగ్ ప్రక్రియలో స్టార్ ఎయిర్ కు బెల్గాం-సూరత్-కిషన్ గఢ్ మార్గం దక్కింది. విమాన సర్వీసులను సరసమైన & సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఉడాన్ పథకం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) అందిస్తున్నారు. ఈ మార్గంలో వారానికి మూడుసార్లు  ఈ కంపెనీ తన విమానాలను నడుపుతుంది. ఇందుకోసం 50 సీట్ల ఎంబ్రాయర్-145 విమానాలను మోహరించనుంది. ఈ మార్గం ఉడాన్పథకంలో స్టార్ ఎయిర్ మొదలుపెట్టిన 20 వ విమానమార్గం. ఈ రూట్లో ఎయిర్ కనెక్టివిటీ కోసం స్థానికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కిషన్ గఢ్‌లోని ప్రసిద్ధ నవగ్రహాల ఆలయం, అజ్మీర్ షరీఫ్ దర్గా, పుష్కర్ సరస్సు, ఫూల్ మహల్ ప్యాలెస్, రూపంగఢ్ కోట మొదలైనవాటిని ప్రజలు తరచూ సందర్శిస్తారు. ఈ నగరాన్ని మార్బుల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎర్ర మిరపకాయల పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు బెల్గాం నుండి కిషన్గఢ్‌కు ప్రత్యక్ష రవాణా విధానం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఆగ్రా వరకు రైలులో వెళ్లాల్సి వచ్చేది. కిషన్గఢ్ చేరుకోవడానికి బస్సు ఎక్కాల్సి ఉండేది. అదేవిధంగా, రహదారి ద్వారా, మొత్తం ప్రయాణం పూర్తి కావడానికి 25 గంటలకు పైగా పట్టేది. ఇప్పుడు, ప్రజలు 3:10 గంటల విమాన ప్రయాణాన్ని ఎంచుకోవడం ద్వారా సౌకర్యవంతంగా, త్వరగా ప్రయాణించవచ్చు , సులభంగా ప్రయాణించవచ్చు. విమానయానం బెల్గాం & కిషన్గఢ్ మధ్య తరచూ ప్రయాణించే ప్రజల సమయం, డబ్బు , శక్తిని ఆదా చేస్తుంది. అంతే కాకుండా, ఈ మార్గంలో సాధారణ విమాన కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల ఈ ప్రాంత వాణిజ్యం , పర్యాటక రంగానికి మరింత ఉత్తేజం అందిస్తుంది.  సూరత్ వాసులు మార్బుల్ సిటీకి చేరుకోవడానికి సుదీర్ఘ రైలు & రహదారి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. మొత్తం ప్రయాణం పూర్తి కావడానికి 50 గంటలకు పైగా పట్టింది, ఇప్పుడు, స్థానికులు కేవలం 80 నిమిషాల విమాన ప్రయాణంతో ద్వారా కిషన్గఢ్ చేరుకుంటారు.

***


(Release ID: 1683060) Visitor Counter : 139


Read this release in: Hindi , English , Urdu , Kannada