వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
'ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్- 2020-21' కనీస మద్దతు ధర కార్యకలాపాలు
వరి సేకరణ గత సంవత్సరంతో పోలిస్తే 23.22% పెరుగుదల నమోదు
సుమారు 48.28 లక్షల మంది రైతులు కేఎంఎస్ ప్రొక్యూర్‌మెంట్ ఆపరేషన్ల ద్వారా రూ.77608.01 కోట్ల మేర లబ్ధి పొందారు
Posted On:
19 DEC 2020 7:18PM by PIB Hyderabad
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2020-21లో ప్రభుత్వం కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) పథకాల ప్రకారం ఖరీఫ్ పంటలను రైతుల నుండి కొనుగోలు చేస్తూనే ఉంది. ఖరీఫ్ 2020-21 వరి సేకరణ సజావుగా వృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఈ నెల 18వ తేదీ నాటికి (18.12.2020) పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరా ఖండ్, తమిళనాడు, ఛండీగఢ్, జమ్మూ & కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ లలో 411.05 ఎల్ఎంటీల వరిని కొనుగోలు చేశారు. గత సంవత్సరం జరిపిన 333.59 ఎల్ఎంటీల వరి కొనుగోళ్లతో పోలిస్తే ఇది 23.22 శాతం మేర అధికం.
మొత్తం 411.05 ఎల్‌ఎంటీల వరి కొనుగోళ్లలో 30.11.2020 నాటికి సేకరణ కాలం ముగిసేటప్పటికీ ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచి 202.77 ఎల్‌ఎమ్‌టీని కొనుగోళ్లు జరిగాయి. ఇది దేశంలో మొత్తం సేకరణలో 49.33 శాతం. సుమారు 48.28 లక్షల మంది రైతులు కేఎంఎస్ ప్రొక్యూర్‌మెంట్ ఆపరేషన్ల ద్వారా రూ.77608. 01 కోట్ల మేర లబ్ధి పొందారు. దీనికి తోడు రాష్ట్రాల నుంచి అందిన ఆయా ప్రతిపాదనల ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020లో ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద 51.00 ఎల్ఎంటీల పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు తగిన అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కేరళ రాష్ట్రాలకు దాదాపు 1.23 ఎల్‌ఎమ్‌టీల కొబ్బర (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. పీఎస్ఎస్ పథకం కింద ఇతర రాష్ట్రాలు/ యుటీల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు కొప్రాలను సేకరించే ప్రతిపాదనలు అందిన తరువాతనే ఆమోదం ఇవ్వడం జరుగుతంది.
తద్వారా ఈ పంటల యొక్క ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి నోటిఫైడ్ ఎంఎస్‌పీ వద్ద రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగాపొందొచ్చు. ఆయా రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు ఆయా రాష్ట్రాలు/ యుటీలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ వ్యవధిలో మార్కెట్ రేటు ఎంఎస్‌పీ
కంటే తక్కువగా ఉన్నా మంచి ధరకే కొనుగోళ్లు జరుపుతారు. 18.12.2020 నాటికి ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా దాదాపు 191669.08 ఎంటీల పెసర్లు, మినుములు, వేరు శనగ కాయలు, సోయాబీన్లను ఎంఎస్‌పీ ధరల వద్ద కొనుగోలు చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో 105987 మంది రైతుల నుంచి దీనిని కొనుగోలు చేశారు.
దీని ఫలితంగా రూ.1027.76 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అదేవిధంగా 18.12.2020 నాటికి రూ. 52.40 కోట్ల విలువైన 5089 మెట్రిక్ టన్నుల మేర కొబ్బరను (శాశ్వత పంట) కర్ణాటక రాష్ట్రం, తమిళనాడులోని 3961 మంది రైతుల నుంచి ఎంఎస్‌పీ వద్ద కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఇదే కాలంలో 293.34 మెట్రిక్ టన్నుల మేర కొప్రా కొనుగోలు చేశారు. కోప్రా మరియు ఉరాద్‌లను ప్రధానంగా ఉత్పత్తి చేసే చాలా రాష్ట్రాల్లో రేట్లు ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు మార్కెట్‌కు వచ్చేటి సమయం ఆధారంగా సేకరణను ప్రారంభించడానికి రాష్ట్ర / యుటీ ప్రభుత్వాలు సేకరణను ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ ఆధారంగా సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 18.12.2020 వరకు రూ.16799.87 కోట్ల విలువైన 5761122 కాటన్ బేల్స్ కొనుగోలు చేశారు. దీనివల్ల 11,20,868 మంది రైతులకు లబ్ధి చేకూరింది.
***
(Release ID: 1682087)
Visitor Counter : 132