ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రతిపాదిత విమాన లీజు నియంత్రణలపై సంప్రదింపుల పత్రాన్ని విడుల చేసిన ఐఎఫ్ ఎస్ సిఏ
Posted On:
16 DEC 2020 8:24PM by PIB Hyderabad
విమానయాన రంగంలో 2022 నాటికి ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మార్కెట్ గా అవతరించడానికిగాను భారతదేశం కృషి చేస్తోంది. ప్రాజెక్ట్ రూపీ రాప్టర్ పేరు మీద గత ఏడాది జనవరి నెలలో కేంద్ర విమానయానశాఖ ఒక నివేదికను ప్రచురించింది. భారతదేశ విమాన రంగంలో ఆర్ధికపర సహాయం, లీజింగుకు సంబంధించిన పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన రోడ్డుమ్యాపును అందులో వివరించారు. మనదేశ విమానయాన రంగంలో తగిన వాతావరణం తేవడానికిగాను అవసరమయ్యే అంత్జాతీయ ఆర్ధికపర సహాయ సేవల కేంద్ర ఆవశ్యకతను ఆ నివేదిక గుర్తించింది.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మాలా సీతారామన్ గత ఏడాది జులై నెలలో చేసిన బడ్జెట్ ప్రంసంగంలో భారతదేశ విమానరంగంలో ఆర్ధికపరమైన సహాయ, లీజు కార్యక్రమాలపైన మాట్లాడారు. ఈ కార్యకలాపాలు దేశంలోనే మొదలవ్వడానికి సమయం వచ్చిందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్వయం సమృద్ధ విమానయాన పరిశ్రమ అభివృద్ధికి ఇది కీలకమని ఆమె అన్నారు. భారతదేశ ఆర్ధికపర సహాయ వ్యవహారాల ప్రత్యేక ఆర్ధిక మండలి అయిన అంతర్జాతీయ ఆర్ధికపర సహాయ సేవల కేంద్రం ( ఐఎఫ్ ఎస్ సి)లో అందుబాటులోకి వచ్చిన వ్యాపార అవకాశాలను వినియోగించుకుంటూనే ఈ రంగంలో ఉద్యోగాల కల్పన వుంటుందని ఆమె అన్నారు.
ఐఎఫ్ ఎస్ సి ఏ సిఫార్సుల మేరకు ఈ ఏడాది అక్టోబర్ నెల 16న కేంద్ర ప్రభుత్వం విమానయాన లీజుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. విమానాలు, హెలికాప్టర్లు, విమానాల ఇంజిన్లు, ఇంకా ఇతర భాగాల లీజుకు సంబంధించిన వివరాలు ఇందలో వున్నాయి. వీటిని అంతర్జాతీయ ఆర్ధికపరమైన సేవల కేంద్రాల అధికారిక చట్టం, 2019 కింద ఆర్ధిక పమైన ఉత్పత్తిగా భావించి లీజుకు ఇస్తారు.
విమానాల లీజు వ్యవహారాలు అనేవి భారతదేశానికి కొత్త కాబట్టి దీనికి సంబంధించిన నియంత్రణలు ఆయా ఆర్ధిక సహాయ కేంద్రాల్లో వేరు వేరుగా వుండడంవల్ల ఐఎఫ్ ఎస్ సి ఏ ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసింది. తద్వారా ఈ రంగంలో భాగస్వాములుగా వున్నవారు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
భారతదేశానికి సంబంధించి విమానయానరంగం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి పలు అంతర్జాతీయ లీజు సంస్థలు ఐఎఫ్ ఎస్ సిలో లీజు సంస్థను నెలకొల్పడానికిగాను ఆసక్తిని చూపుతున్నాయి. అంతర్జాతీయంగా వున్న లీజుదారులను అందుబాటులోకి తెస్తుండడంతో ఐఎఫ్ ఎస్ సి లావాదేవీల్లో భాగం కావడానికిగాను దేశీయ విమాన సంస్థలు కూడా ఆసక్తిని చూపుతున్నాయి.
ముసాయిదా నియంత్రణలను ఐఎఫ్ ఎస్ సి ఏ వెబ్ సైట్లో అప్లోడ్ చేశారు.
వివరాలకు URL: https://www.ifsca.gov.in/PublicConsultation సంప్రదించవచ్చు.
ప్రజలనుంచి వచ్చే సూచనలు సలహాలను బట్టి ఈ రంగానికి సంబంధించిన నియంత్రణలను అంతిమంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఐఎఫ్ ఎస్ సి లో కార్యకాలపాలను ప్రారంభించే లీజు కంపెనీలకోసం ఒక విధివిధానాల వ్యవస్థను రూపొందించి ఇస్తారు.
****
(Release ID: 1681338)
Visitor Counter : 139