“కోవిడ్-19 నేపథ్యంలో కూడా ఈ గ్లోబల్ రీ ఇన్వెస్ట్ సమావేశం అత్యంత విజయవంతం అయింది. భారతదేశం నిరంతరం సామర్థ్యాలను విస్తరించుకుంటూ ఆచరణీయ పరిష్కారాలు, కొత్త టెక్నాలజీలు, సరికొత్త మార్కెట్ సొల్యూషన్లు అనుసరిస్తూ ఆర్ఇ విభాగంలో నవ్యపథంలో పయనిస్తోంది. మేం అమలుపరుస్తున్న ఫ్లోటింగ్ సోలార్, విండ్ హైబ్రిడ్ సోలార్ కాంట్రాక్టులు ఈ నవ్యపథానికి నిదర్శనం. ఆర్ఇ అనుసరించేందుకు దేశంలోని పలు రాష్ర్టాలకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తూ అవసరమైన మద్దతు ఇస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ మరింత పటిష్ఠం చేసుకుని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ముందుకు తీసుకువెళ్తాం” అని 3వ గ్లోబల్ రీ ఇన్వెస్ట్ ప్రదర్శన, సమావేశం ముగింపు సందర్భంగా విద్యుత్, పురనరుత్పాదక ఇంధనాలు, నైపుణ్యాల శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అన్నారు.
2030 నాటికి 450 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం సాధించడం ద్వారా విద్యుత్ మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు భారతదేశం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ “సోలార్ పివి, విండ్ మాడ్యూల్స్ సామర్థ్యాలు పెంచడం వల్ల వాటి ధరలు దిగివచ్చాయి. భరించగల సామర్థ్యాలు పెరగడంతో పాటు ఇంధనం అందుబాటు పెరిగింది. మరింత మెరుగైన జీవన ప్రమాణాలకు అవి దోహదపడుతున్నాయి” అని చెప్పారు. అమ్మోనియా దిగుమతి చేసుకునే స్థాయి నుంచి “హరిత అమ్మోనియా”కు భారత్ మారనున్నదని, హైడ్రోజెన్ వినియోగ పరిమాణం కూడా పెంచుకోనున్నదని తెలిపారు.
భారతదేశం అనుసరిస్తున్న సమగ్ర పునరుత్పాదక ఇంధన విధానం, త్వరితగతిన సొల్యూషన్ల అన్వేషణ కృషి గురించి పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “450 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాలు నిర్మించడంతో పాటు స్వచ్ఛ ఇంధనాల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలనుకుంటోంది. బయో, హైడ్రోజెన్ ఇంధనాలను ప్రోత్సహించడం, ఆర్ఇ విభాగంలో డిజిటల్ ఇన్నోవేషన్ కు పెద్ద పీట వేయనున్నాం” అని చెప్పారు. బయో ఇంధనాలు ఒక శాస్త్రం కాదు, ఒక మంత్రం అని ఆయన అన్నారు. వివిధ ఇంధనాలను మిశ్రమం చేయడానికి జాతీయ బయో ఇంధనాల విధానం ఏ విధంగా దోహదపడనున్నది ఆయన వివరించారు. సిటీ గ్యాస్ డిస్ర్టిబ్యూషన్ కు ఒక జాతి, ఒకే గ్రిడ్ విధానాన్ని అనుసరించడంతో పాటు సామాజిక మార్పునకు ఎల్ పిజి, విమానయాన రంగానికి బయో ఇంధనాల ప్రోత్సాహం మా విధానం. శిలాజ ఇంధన విధానాలకు కేంద్రం అయిన మా మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి స్వచ్ఛ ఇంధన జాతి లక్ష్యానికి అనుగుణంగా గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తోంది అని చెప్పారు.
“ఇథనాల్ వినియోగ యంత్రాంగాల అభివృద్ధిలో భారత్, బ్రెజిల్ కీలక భాగస్వాములు. మా దేశాలు ఇంధన శక్తులు. మా సహకారం ప్రత్యేకించి ఈ మహమ్మారి అనంతర కాలంలో సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆర్ఇ రంగంలో కొత్త అవకాశాలు, సవాళ్లపై ప్రపంచ భాగస్వాములతో చర్చించేందుకు ఈ రీ ఇన్వెస్ట్ చక్కని వేదిక” అని బ్రెజిల్ ఇంథన శాఖ మంత్రి బెంటో అల్బుకర్క్ అన్నారు.
ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ అనేది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రోత్సహించాలనుకుంటున్న వ్యూహమని అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) డైరెక్ట