పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న - కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలను తెలియజేసే ఎఫ్.ఈ.సి. (రాజ్యాంగంపై ప్రాధమిక విద్య) పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

Posted On: 26 NOV 2020 10:14PM by PIB Hyderabad

1949 నవంబర్, 26వ తేదీన రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంది.  కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ నాయకత్వంలో మంత్రిత్వ శాఖలోని అధికారులు / సిబ్బంది మొత్తం,  భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తో కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదవడంతో ఈ వేడుక ప్రారంభమైంది.

 

          

ఆ తర్వాత, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ (డాక్టర్) సి. ఎస్. కుమార్ మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కె. ఎస్. సేథీ కలిసి, పౌరుల ప్రాధమిక విధులతో కూడిన ప్రతిజ్ఞను ఇతర అధికారులు, సిబ్బంది చేత చేయించారు.

ఎన్.ఐ.ఆర్.డి. మరియు పంచాయితీ రాజ్ సహకారంతో, మిషన్ సమృద్ధి మరియు "వుయ్, ది పీపుల్ అభియాన్ బృందం" కలిసి రూపొందించిన, ఎఫ్.ఈ.సి. (రాజ్యాంగంపై ప్రాధమిక విద్య) పుస్తకాన్ని, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ (డాక్టర్) సి. ఎస్. కుమార్, ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ పుస్తకం మన రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలతో పాటు, మన దైనందిన జీవితంతో దాని సంబంధాలను తెలియజేస్తుంది.  రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక విధులను ప్రదర్శించే బ్యానర్లను, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యాలయ ప్రాంగణంలోని వ్యూహాత్మక ప్రదేశాలలో ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన, పంచాయతీ రాజ్ విభాగాలు, పంచాయతీ రాజ్ సంస్థలు రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహం, శ్రద్ధ, పట్టుదలతో జరుపుకున్నాయి.  కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ, రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించడానికి ఏర్పాట్లు చేశారు.

 

*****



(Release ID: 1676319) Visitor Counter : 85


Read this release in: English , Urdu , Manipuri