మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవం

రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి తొలిసారిగా మత్స్య రంగంలో ఉత్తమంగా పనిచేసిన రాష్ట్రాలకు అవార్డులు

Posted On: 21 NOV 2020 8:05PM by PIB Hyderabad

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈ రోజు మత్స్య శాఖ, మత్స్య మంత్రిత్వ శాఖ, పాడిపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో కేంద్ర మత్స్య,పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ .ప్రతాప్ చంద్ర సరంగి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ పాడిపరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ లక్మీ నారాయణ్ చౌధరి పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తరపున ఈ అవార్డును అందుకుంది, లోతట్టు మత్స్య రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న అవార్డును రాష్ట్రప్రభుత్వం తరఫున అందుకున్నారు. దేశం వివిధప్రాంతాలకు చెందిన మత్స్యకారులు, చేపల రైతులు, పారిశ్రామికవేత్తలు, వాటాదారులు, నిపుణులు, అధికారులు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడిన మంత్రి శ్రీ .ప్రతాప్ చంద్ర సరంగి ప్రపంచ మత్స్య దినోత్సవ నిర్వహణ ద్వారా భారతదేశం మత్స్య రంగం గురించి అంతర్జాతీయ దృక్పధంలో ఆలోచిస్తూ స్థానిక ఆలోచనలతో ముందుకు సాగుతున్నదని అన్నారు. దేశ సామాజిక ఆర్ధిక ప్రగతిలో మత్స్య రంగం కీలకపాత్ర పోషిస్తున్నదని ఇదే అంశాన్ని ఇటువంటి కార్యక్రమాల ద్వారా వెల్లడిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ రంగం లక్షలాది మంది భారతీయులకు పోషక భద్రతను కల్పించడంతో పాటు జీవనోపాధి అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నదని ఆయన వివరించారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనాభా పెరుగుదలతో పోషక భద్రత కోసం డిమాండ్ కూడా సమాంతరంగా పెరుగుతున్నది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు ఆహార డిమాండ్ ను తట్టుకోడానికి, ప్రజలకు పోష్టిక ఆహారాన్ని అందించడానికి కృషి చేయవలసి ఉంటుందని మంత్రి వివరించారు.

దేశంలో సముద్ర మత్స్య రంగంలో స్తబ్దత ఏర్పడిందని దీనితో మత్య్స రంగం స్థానిక పద్ధతుల్లో సాగుకు మొగ్గు చూపడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. పౌష్ఠిక ఆహార సరఫరాకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. మత్స్య ఉత్పత్తి గిరాకీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి 20,050 కోట్ల పెట్టుబడి అంచనాలతో ప్రధానమంత్రి మత్స్య సంపద పధకానికి రూపకల్పన చేశామని మంత్రి అన్నారు. ఈ పథకం నాణ్యత, ఉత్పత్తి,ఉత్పాదకత,సాంకేతిక అంశాలు, యాజమాన్య విధానాలు, సాగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.

మత్స్య రంగం వైవిధ్యంతో కూడిన వైవిధ్యమైనదని శ్రీ.ప్రతాప్ చంద్ర సరంగి అన్నారు. సామర్థ్యాన్ని పెంచడం మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టి సారించిఅందుబాటులో ఉన్న వనరులను క్రమబద్ధంగా, స్థిరంగా వినియోగించవలసి ఉంటుందని మంత్రి తెలిపారు. దీని కోసం రైతులు మరియు మత్స్యకారులకు పరిశోధనా ఫలితాలు అందించి వారికి ప్రయోజనం కల్పించేవిధంగా విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందించవలసి ఉంటుందని అన్నారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి నీరు నిల్వ ఉండే ప్రాంతాలు,, చిత్తడి నేలలు, సరస్సులు, జలాశయాలు, కాలువలు, చెరువులు, ట్యాంకులు, వరద మైదానాలు, బ్యాక్ వాటర్స్, మడుగులు, తక్కువ లవణ సాంద్రత కలిగిన లోతట్టు ప్రాంతాలు వంటి వనరులను గుర్తించి వినియోగంలోకి తీసుకునిరాడానికి చర్యలు తీసుకోవలసి ఉంటుందని మంత్రి అన్నారు.

మత్స్య రంగ అభివృద్ధికి, చేపల ఉత్పత్తిని పెంచడానికి మరియు ఈ రంగంలో సంబంధం ఉన్న మత్స్యకారులు మరియు ఇతర ప్రజల సామాజిక-ఆర్ధిక పరిస్థితులను మెరుగుపర్చడానికి సహాయ సహకారాలను అందించాలని ఆయన ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో మత్స్యకార వర్గాలు, స్థిరమైన చేపల నిల్వలు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థల జీవితం మరియు జీవనోపాధిని ఎత్తిచూపడానికి మరియు రక్షించడానికి ఈ ప్రపంచ మత్స్య దినోత్సవాన్నిజరుపుకుందామని మంత్రి అన్నారు.


ఈ కార్యక్రమంలో, మత్స్య రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది. 2019-20 సంవత్సరానికి ఒడిషా (తీరా ప్రాంత రాష్ట్రాలలో), ఉత్తర ప్రదేశ్ (లోతట్టు రాష్ట్రాలలో) మరియు అస్సామ్ (కొండ ప్రాంతాలు,ఈశాన్య రాష్ట్రాలలో). ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేసింది. . 2019-20 సంవత్సరానికి ఉత్తమ సంస్థలగా తమిళ నాడు ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (మెరైన్ ); తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘం (ఇన్ ల్యాండ్ ), మరియు అస్సామ్ అపెక్స్ కోఆపరేటివ్ ఫిష్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. (కొండ ప్రాంతం ). ఉత్తమ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉత్తమ ఉత్తమ సముద్ర జిల్లాగా, ఓడిశాలోని కలహంది జిల్లా ఉత్తమ ఇన్ ల్యాండ్ జిల్లాగా ఎంపిక అయ్యాయి. అస్సాం లోని నాగన్ ఉత్తమ కొండా ప్రాంత మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్తమంగా ఎంపిక అయ్యింది. ఇంతేకాకుండా ఉత్తమ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ / ఎఫ్ఎఫ్ పిఓలు / ఎస్ ఎస్ జి మరియు ఉత్తమ వ్యక్తిగత వ్యవస్థాపకులు; ఉత్తమ మెరైన్ మరియు ఇన్లాండ్ ఫిష్ ఫార్మర్; మరియు ఉత్తమ ఫిన్ ఫిష్ మరియు రొయ్యల హేచరీల రంగాలలో సాధించిన విజయాలు సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా అవార్డులను అందజేయడం జరిగింది. లో వారి విజయాలు మరియు ఈ రంగం వృద్ధికి వారి సహకారాన్ని గుర్తించాయి. అన్ని అవగాహనలకు బహుమతులు పంపిణీ చేయబడ్డాయి మరియు ఈ కార్యక్రమంలో అనేక ప్రచురణలు కూడా విడుదల చేయబడ్డాయి.

Click here to read the Background Note & Curtain Raiser

***

 



(Release ID: 1674826) Visitor Counter : 260


Read this release in: English , Urdu , Hindi