మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మత్స్య శాఖ నవంబర్, 21వ తేదీన ‘ప్రపంచ మత్స్య దినోత్సవం’ జరుపుకోనుంది

మత్స్య రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొదటి సారి అవార్డులు ప్రదానం చేస్తోంది; అవార్డు గ్రహీతల్లో - సముద్ర తీర ప్రాంతాలలో ఒడిశా; లోతట్టు ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్; పర్వత, ఈశాన్య ప్రాంతాల్లో అస్సామ్ రాష్ట్రాలు ఉన్నాయి

Posted On: 20 NOV 2020 8:23PM by PIB Hyderabad

కర్టెన్ రైజర్ 

భారత ప్రభుత్వ మత్స్య శాఖ; మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ‘ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని’ 2020 నవంబర్,  21వ తేదీన న్యూఢిల్లీ, పూసా లోని ఎన్.ఏ.ఎస్.సి. కాంప్లెక్స్ ‌లో నిర్వహిస్తున్నాయి.  ఈ కార్యక్రమానికి మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. లోతట్టు మత్స్య రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవార్డు పొందిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర పాడి అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖల శాఖ మంత్రి శ్రీ లక్ష్మీ నారాయణ్ చౌదరి ఆ అవార్డును స్వీకరించడానికి వస్తున్నారు.  ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ మత్స్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ రంజన్ కూడా పాల్గొంటారు.  ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు, చేపల రైతులు, వ్యవస్థాపకులు, వాటాదారులు, నిపుణులు, అధికారులు మరియు శాస్త్రవేత్తలు కూడా పాల్గొంటారు.  

ఈ కార్యక్రమంలో, మత్స్య రంగంలో తొలిసారిగా భారత ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల అవార్డులను ప్రదానం చేస్తోంది.  ఈ అవార్దులకు ఒడిశా (సముద్ర తీర రాష్ట్రాలలో), ఉత్తర ప్రదేశ్ (లోతట్టు రాష్ట్రాలలో) మరియు అస్సాం (కొండ, ఈశాన్య రాష్ట్రాలలో) రాష్ట్రాలు ఎంపికయ్యాయి.   భారత ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఉత్తమ సంస్థలకు కూడా అవార్డులు ప్రదానం చేస్తోంది [తమిళనాడు మత్స్య పరిశ్రమాభివృధి కార్పొరేషన్ లిమిటెడ్. (మెరైన్ కోసం);  తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య (లోతట్టు ప్రాంతాల కోసం);  అస్సాం అపెక్స్ సహకార మత్స్య మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ సమాఖ్య (కొండ ప్రాంతానికి)]; ఉత్తమ సముద్ర తీర జిల్లాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా; ఉత్తమ లోతట్టు ప్రాంత జిల్లాగా ఒడిశా లోని కలహందిపర్వత ప్రాంతం మరియు ఈశాన్య జిల్లాగా అస్సోమ్ లోని నాగాన్ అవార్దులకు ఎంపిక అయ్యాయి.   అంతేకాకుండా, ఈ రంగంలో వారు సాధించిన విజయాలు మరియు ఈ రంగం వృద్ధికి వారు చేసిన కృషికి గుర్తింపుగా, ఉత్తమ మత్స్య సంస్థలకు; ఉత్తమ పనితీరు కలిగిన మత్స్య సహకార సంఘాలు / ఎఫ్.ఎఫ్.పి.ఓ. లు / ఎస్.ఎస్.జి. మరియు ఉత్తమ వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు; ఉత్తమ సముద్ర మరియు లోతట్టు ప్రాంతాలోని చేపల రైతు; మరియు ఉత్తమ ఫిన్‌ఫిష్ మరియు రొయ్యల హేచరీలకు,  అవార్డులు,  సత్కారాలు ఉంటాయి.   

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు, చేపల రైతులతో పాటు వాటాదారులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతి సంవత్సరం నవంబర్, 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.    ఇది 1997 లో ప్రారంభమైంది. "వరల్డ్ ఫోరమ్ ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ & ఫిష్ వర్కర్స్" న్యూఢిల్లీలో సమావేశమై, 18 దేశాల ప్రతినిధులతో "వరల్డ్ ఫిషరీస్ ఫోరం" ఏర్పడింది. ఈ సందర్భంగా స్థిరమైన చేపల వేట పద్ధతులు మరియు విధానాల యొక్క ప్రపంచ ఆదేశం కోసం వాదించే ప్రకటనపై సంతకం చేయడం జరిగింది. మన సముద్ర మరియు లోతట్టు వనరుల సుస్థిరతకు అవరోధంగా ఉన్న, అధికంగా చేపలు పట్టడం, ఆవాసాలను నాశనం చేయడం వంటి ఇతర తీవ్రమైన బెదిరింపులపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.  స్థిరమైన నిల్వలు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను నిర్ధారించడానికి ప్రపంచ మత్స్య సంపదను ప్రపంచం నిర్వహించే విధానాన్ని మార్చడంపై దృష్టి పెట్టడానికి ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయి.

ఈ రంగాన్ని మార్చడంలో మరియు దేశంలో నీలి విప్లవం ద్వారా ఆర్థిక విప్లవాన్ని సాధించడంలో భారత ప్రభుత్వం ముందంజలో ఉంది.  చేపల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. కాగా, ప్రపంచంలో ఆక్వాకల్చర్ ద్వారా చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది.  భారతదేశంలో మత్స్య రంగం 28 మిలియన్ల మంది మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులకు ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది.  దీనితో పాటు, ఆహారం, పోషక భద్రత తో పాటు విదేశీ మారకాన్ని ఆర్జిస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారతదేశం వాటా 7.7 శాతం వరకు ఉంది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం 4 వ స్థానంలో ఉంది. ఉత్పత్తి, ఉత్పాదకతల ను పెంచడం, నాణ్యతను మెరుగుపరచడం, వ్యర్థాలను తగ్గించడం ద్వారా చేపల రైతుల ఆదాయాన్ని పెంపొందించాలని ఈ రంగం భావిస్తోంది.  2015 డిసెంబర్ ‌లో ప్రారంభమైన కేంద్ర ప్రాయోజిత పథకం “నీలి విప్లవం (బ్లూ రివల్యూషన్)” ను పరిగణనలోకి తీసుకొని ఈ రంగం అభివృద్ధికి కీలక కృషి జరిగింది.  మత్స్య రంగం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో, జాతీయ జి.వి.ఎ. కు సుమారు 1.24 శాతం; వ్యవసాయ జి.వి.ఎ. లో 7.28 శాతం మేర తోడ్పడింది.

ఈ ఏడాది 2020 సెప్టెంబర్,  10వ తేదీన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020-21 నుండి 2024-25 వరకు, ఐదేళ్ల కాలానికి 20,050 కోట్లరూపాయల అంచనా వ్యయంతో "ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన" (పి.ఎం.ఎం.ఎస్.వై) ని ప్రారంభించారు.  2024-25 నాటికి చేపల ఉత్పత్తిని 22 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎమ్.‌ఎమ్.‌టి) మేర సాధించాలని పి.ఎం.ఎం.ఎస్.‌వై.  లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ పధంకం సుమారు 55 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.  ఈ కొత్త పథకం ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి, మత్స్యకారులు మరియు చేపల రైతుల సంక్షేమం, ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, వ్యవస్థాపకత అభివృద్ధి, వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడం, ఆవిష్కరణలు మరియు అంకురసంస్థలు,  ఇంక్యుబేటర్లతో సహా వినూత్న ప్రాజెక్టు కార్యకలాపాలు చేపట్టడానికి, మత్స్య మరియు ఆక్వాకల్చర్ ‌లో కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చొప్పించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  అదనంగా, 2018-19 లో 7,522.48 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎఫ్.ఐ.డి.ఎఫ్) దేశంలో చేపల ఉత్పత్తిని పెంచడానికి సముద్ర మరియు లోతట్టు మత్స్య రంగాలలో మత్స్య మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతుంది.  వీటితో పాటు, మత్స్యకారులు, చేపల రైతులకు వారి పెట్టుబడి  అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి కిసాన్ క్రెడిట్ కార్డుల (కె.సి.సి) సౌకర్యాలను కూడా ప్రభుత్వం వర్తింపచేసింది.

*****



(Release ID: 1674633) Visitor Counter : 220


Read this release in: English , Urdu , Hindi