ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఓపెన్ డొమైన్ లో విడుదలైన అరోగ్య సేతు బ్యాకెండ్ కోడ్
Posted On:
20 NOV 2020 7:38PM by PIB Hyderabad
అరోగ్య సేతు బ్యాకెండ్ కోడ్ ను పెన్ డొమైన్ లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.ఈ కోడ్
https://openforge.gov.in/plugins/git/aarogyasetubackend/aarogya_setu_backend?a=tree&hb=3d5bce9e481d89ecbe6ed3f07179419bb04ecc66&f=srcలో అందుబాటులోఉంటుంది.
ఇ-గవర్నెన్స్ అప్లికేషన్ సోర్స్ కోడ్ ల వినియోగం మరియు పునర్వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఓపెన్ ఫోర్జ్ను వేదికగాఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం "ప్రభుత్వ అనువర్తనాల మూలకోడ్ లను వినియోగం కోసం ప్రభుత్వం ఒక విధానానికి రూపకల్పన చేసింది. దీనివల్ల సేకరించిన సమాచారాన్ని ఉపయోగించడం, ఒకరితో ఒకరు పంచుకోవడానికి పునర్వియోగానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ శాఖలు / సంస్థలు . ప్రైవేట్ సంస్థలు, ప్రజలు మరియు అభివృద్ధి సంస్థలు కలసి మరింత వినూత్నంగా ఈ -గవర్నెన్స్ సేవలు, విధానాలకు రూపకల్పన చేయడానికి అవకాశం కలుగుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆరోగ్యసేతు యాప్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, యాప్ ను అందరితో కలసి పంచుకోవాలన్నది ప్రభుత్వ అభిప్రాయం. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ల యొక్క సోర్స్ కోడ్ లను ఇంతకుముందు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా సమాచారాన్ని అందరితో కలసి పంచుకుని అందరి సహకారంతో దీనిని మరింత మెరుగుపరచాలన్న ఉద్దెశంతో ప్రస్తుతం బ్యాక్ ఎండ్ సోర్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది.
భారతదేశంలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఆరోగ్యసేతు యాప్ కీలక పాత్ర పోషిస్తున్నది. 2020 ఏప్రిల్ రెండవ తేదీన ప్రభుత్వం దీనిని విడుదల చేసింది. భారత పరిశ్రమల రంగం, మేధావులతో కలసి ప్రభుత్వం అహర్నిశలు శ్రమించి విశ్వసించి అమలు చేసి ఫలితాలు లభించే విధంగా దీనిని రూపొందించింది. ప్రస్తుతం యాప్ ని’ నిక్’ నిర్వహిస్తోంది. రికార్డు సమయంలో యాప్ ను సిద్ధం చేసి కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొని సాఫ్ట్ వేర్ రంగంలో తనకున్న ప్రతిభాపాటవాలను భారతదేశం ప్రదర్శించింది. అత్యంత పారదర్శకంగా యాప్ ను రూపొందించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలను, వీటిని ఎవరు ఉపయోగించవచ్చును అన్న వివరాలను ఆరోగ్య సేతు పోర్టల్ లో పొందుపరిచింది. దీనిలో యాప్ ఎలా పనిచేస్తుంది అన్న అంశాలతో పాటు కొవిడ్ కు సంభందించిన తాజా సమాచారాన్ని పొందుపరుస్తూ, ఆరోగ్యసేతు ను ప్రతి ఒక్కరూ ఎందుకు ఉపయోగించాలి అన్న సమాచారాన్ని ఉంచడం జరిగింది. ఈ యాప్ ను ప్రభుత్వ పోర్టల్ తో పాటు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచారు.
ఈ యాప్ ను 16.43 కోట్లకు పైగా ఎక్కువ మంది వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకున్నారు. కొవిడ్ 19 కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల ప్రయత్నాలకు ఇది సహకరించింది. బ్లూటూత్ తో పాజిటివ్ కేసులను గుర్తించి ఆ వివరాలను ప్రజలకు వివరించి వారు జాగ్రత్తగా ఉండేలా ఆరోగ్యసేతు సహకరించింది. బ్లూటూత్ ద్వారా గుర్తించిన వారు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన పరీక్షలను చేయించు కుంటూ బయటకు రాకుండా ఉండాలని హెచ్చరించడం జరిగింది. పరీక్షలను చేయించుకోవాలని సూచించిన వారిలో 27% అంది పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఇది సాధారణ సగటు కన్నా ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యసేతు విశ్వసనీయత మరింత పెరిగింది. ఇంతేకాకుండా ఆరోగ్యసేతు వల్ల కొత్తగా కేసులు నమోదు అవుతున్న హాట్ స్పాట్ లను గుర్తించడంతో అధికారులు అప్రమత్తం అయి తగిన చర్యలను తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఏవిధంగా చూసిన కొవిడ్ పై జరిగిన పోరులో ఆరోగ్య సేతు యాప్ కీలకపాత్ర పోషించిందని చెప్పుకోవచ్చును . పరిపాలన పారదర్శకంగా సాగుతున్నదని తెలియచేయడానికి ప్రభుత్వం యాప్ షోస్ కోడ్ ను విడుదలచేసింది.
***
(Release ID: 1674631)
Visitor Counter : 198