ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోహతక్ లోని పండిట్ బి.డి. శర్మ పి.జి.ఐ.ఎం.ఎస్. వద్ద ఓ.టి. మైర్యు ఐ.సి.యూ. భవన సముదాయాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్

మాజీ ప్రధానమంత్రి శ్రీ ఏ.బి. వాజ్ ‌పేయి, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి. సుష్మా స్వరాజ్ లను డాక్టర్ హర్ష వర్ధన్ స్మరించుకున్నారు; "వారిని స్మరించుకోకుంటే ఈ కార్యక్రమం అసంపూర్ణంగా ఉంటుంది"

“వాజ్‌పేయి జీ కలను శ్రీ నరేంద్రమోదీ సాకారం చేస్తున్నారు ”

Posted On: 19 NOV 2020 6:08PM by PIB Hyderabad

రోహతక్ ‌లోని పండిట్ భగవత్ దయాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో కొత్తగా నిర్మించిన ఓ.టి. మరియు ఐ.సి.యూ. భవన సముదాయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు డిజిటల్‌ మాధ్యమం ద్వారా దేశానికి అంకితం చేశారు.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే మరియు హర్యానా రాష్ట్ర హోం, ఆరోగ్యం, వైద్య విద్య, పరిశోధన శాఖల మంత్రి శ్రీ అనిల్ విజ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.   

 

 

ప్రధాన మంత్రి స్వాస్త్య సూరక్షా యోజన (పి.ఎం.ఎస్.ఎస్.వై) కింద 104.92 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భవన సముదాయం మొత్తం నిర్మించబడింది.  ఈ భవన సముదాయంలో - సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్‌మెంట్ (సి.ఎస్.‌ఎస్.‌డి), ప్రయోగశాలలు, 34 పడకల ఐ.సి.యు.  కారిడార్, రెండు అంతస్తుల్లో విస్తరించియున్న 16 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, అనస్థీషియా విభాగం, ప్రీ-ఆపరేటివ్, పోస్ట్-ఆపరేటివ్ సమయంలో డాక్టర్ల వినియోగం కోసం గదులు, బోధనా సిబ్బంది గదులు, తరగతి గదులు, లైబ్రరీ, సమావేశ మందిరం, సెమినార్ రూమ్, సందర్శకుల ప్రాంతం, డాక్టర్లు, సిబ్బంది కోసం ఫలహారశాల మొదలైనవి ఉన్నాయి.   ఈ భావన సముదాయంలో - సోలార్ పివి మరియు సోలార్ హీటర్లు, లిఫ్ట్ మెషిన్ రూములు, ఒ.టి.ల కోసం ఎ.హెచ్.‌యు, ప్లాంట్‌ (10 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం) తో మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్ (ఎం.జి.పి.ఎస్), పర్యవేక్షణ గది, సర్వీస్ బ్లాక్ హెచ్‌.వి. ఎసి చిల్లర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, డి.జి.  సెట్లు, ఎలక్ట్రికల్ ప్యానెల్స్ మొదలైనవి ఉన్నాయి.

2003 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని డాక్టర్ హర్ష వర్ధన్ గుర్తుచేస్తూ,  “స్వాతంత్య్రం పొందిన 56 సంవత్సరాల తరువాత, భారతదేశం ప్రస్తుతమున్న దానికి మరో ఆరు ఎయిమ్స్‌ను జతచేయాలన్న వాజ్ పేయి గారి దృష్టిని నిర్ధారిస్తోంది.  కొత్త ఎయిమ్స్ ఏర్పాటు యొక్క అవరోధాలు మరియు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రజారోగ్య వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం గురించి తెలుసుకోవడం, సూపర్ స్పెషాలిటీ బ్లాకులు లేదా ట్రామా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఎయిమ్స్ వంటి సేవలను అందించడానికి ప్రస్తుతం ఉన్న మరో 75 సంస్థలను అభివృద్ధి చేయాలని సంకల్పించడం జరిగింది.   ఈ లక్ష్య సాధనలో భాగంగా పండిట్ బి.డి. శర్మ పి.జి.ఐ.ఎం.ఎస్. ను అభివృద్ధి చేయడం జరిగింది.” అని వివరించారు.

 

 

మాజీ ఆరోగ్య మంత్రి శ్రీమతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు.  పి.ఎమ్.ఎస్.ఎస్.వై. పథకానికి సుష్మా స్వరాజ్ చేసిన అపారమైన సహకారం మరియు హర్యానాతో ఆమెకు గల జీవితకాల అనుబంధాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.  "ఆమె రాష్ట్ర మంత్రి వర్గంలో అతి పిన్న వయస్కురాలు. ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని ఆమె చూస్తే చాలా సంతోషంగా ఉండేది. ఈ సందర్భంగా వారిని స్మరించుకోకుంటే, ఈ కార్యక్రమం అసంపూర్ణంగా ఉంటుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన వ్యక్తిగత దృష్టిని, శక్తిని కేంద్రీకరించిన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వ పటిమకు, డాక్టర్ హర్ష వర్ధన్, కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.   "పి.ఎం.ఎస్.ఎస్.వై. పధకం మూడవ దశను  2019 లో ప్రకటించారు. ఆశాజనక జిల్లాల్లోని 75 వైద్య కళాశాలల పని ఇప్పటికే పూర్తి స్థాయిలో కొనసాగుతోంది." అని అయన చెప్పారు. 

భారతదేశం స్వాతంత్య్రం వచ్చి 75 వ సంవత్సరాన్ని జరుపుకోబోతున్న 2022 డిసెంబర్, 31వ తేదీ నాటికి వాగ్దానం చేసిన 1.5 లక్షల ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను తెరవడానికి తన నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

కోవిడ్ ప్రభావానికి లోనుకాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని ఆయన ఎత్తి చూపారు. హర్యానా ప్రజలలో కోవిడ్ ప్రవర్తనను ప్రేరేపించడానికి మరియు రాష్ట్రాన్ని పోటీకి ఎదురు నిలిచే తత్వానికి ప్రతీకగా మార్చాలనీ, జన్ ఆందోళన్ కోసం ప్రధాని ఇచ్చిన స్పష్టమైన పిలుపును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలనీ, ఆయన,  రాష్ట్ర అధికారులు మరియు ఎన్నికైన ప్రతినిధులను కోరారు.

బక్సర్‌లోని తమ పూర్వీకుల ఇంటి నుండి ఆన్-లైన్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అశ్వినీ కుమార్ చౌబే మాట్లాడుతూ, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలోని ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో "సర్వే సంతు నిరామయా" అనే కలను, పి.ఎం.ఎస్.‌ఎస్.వై. పధకం సాకారం చేస్తోందని అశ్విని కుమార్ చౌబే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

హర్యానాలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేసిన కృషికి శ్రీ అనిల్ విజ్ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ ప్రాంగణంలో కోవిడ్ అనంతర సంరక్షణ పరిశోధనా సదుపాయాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన అందరికీ వివరించారు.  విద్యార్థులకోసం 160 గదులు, విద్యార్థినుల కోసం 255 గదులు, కొత్తగా 156 సిబ్బంది క్వార్టర్ల‌తో ఒక నివాస సముదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది.

ఈ సదస్సులో - రోహతక్ లోక్ సభ సభ్యుడు డాక్టర్ అరవింద్ శర్మ; రోహతక్ లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఓ.పి. కల్రా; రోహతక్ లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ పి.జి.ఐ.ఎం.ఎస్. ప్రొఫెసర్ రోహ్తాస్ కె. యాదవ్ పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి పద్మజా సింగ్ తో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

*****


(Release ID: 1674276) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi , Tamil