సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ల‌ద్దాఖ్ డిమాండ్ల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిచ్చినందుకు ప్ర‌ధా‌న మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

- లేహ్ ఎల్ఏహెచ్‌డీసీ ఛైర్మ‌న్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశం

Posted On: 12 NOV 2020 6:24PM by PIB Hyderabad

'లేహ్ అటాన‌మ‌స్ హిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కౌన్సిల్' (ఎల్ఏహెచ్‌డీసీ) ఛైర్మన్ / చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల‌ర్ శ్రీ తాషి గ్యాల్సన్, బీజేపీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) శ్రీ జమ్యాంగ్ త్సేరింగ్ నామ్‌గ్యాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా), ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య‌ము, ప్ర‌భుత్వ ఉద్యోగుల వ్య‌వ‌హారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్ష‌న్లు, అణు ఇంధ‌నం, అంత‌రిక్ష శాఖల స‌హాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుసాధ్య‌మై మరియు విజయవంతం అయిన ఎల్ఏహెచ్‌డీసీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వారిని అభినందించారు. ల‌ద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్ప‌డిన‌ త‌రువాత ఎల్ఏహెచ్‌డీసీ ఎన్నిక‌లే మొద‌టి ఎల‌క్ష‌న్ క‌స‌ర‌త్తు అయినందున‌ ఈ ఎన్నికలు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని ఆయన అన్నారు.
ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ లద్దాఖ్ మరియు ఇతర పరిధీయ ప్రాంతాల డిమాండ్లకు ప్రధాని నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇచ్చార‌ని అన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలోనే తొలిసారిగా ల‌ద్ధాఖ్‌కు ఒక విశ్వవిద్యాలయం, వైద్య‌ కాలేజీ, ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఎల్లప్పుడూ "చెప్పిన మాట‌పై..

 


నిల‌బ‌డుతోంది" అని అన్నారు. ఈ ప్రాంతం పట్ల తనకున్న మేటి నిబద్ధతను త‌మ‌ ప్ర‌భుత్వం నెరవేర్చిందని మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని నిర్మించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, లద్ధాఖ్ పరిపాలన శాఖ ఒక స్థ‌లాన్ని గుర్తించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.


ఈ ప్రాంతం యొక్క కనెక్టివిటీ సమస్య గురించి మంత్రి మాట్లాడుతూ.. అటల్ టన్నెల్ (రోహ్తాంగ్ టన్నెల్ అని కూడా పిలుస్తారు) మరియు నిర్మాణంలో ఉన్న జోజి లా టన్నెల్ ప్రారంభించడం ఈ పరిధీయ ప్రాంతంతో అన్ని వాతావరణ కనెక్టివిటీని ఈ ప్రాంతానికి పెద్ద ఆర్థిక మరియు భద్రతా ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వం మరియు అకుంటిత సంకల్పంతో మాత్రమే ఇది వాస్త‌వ‌రూపం దాల్చిన‌ట్టు మంత్రి తెలిపారు. వివిధ ప్రాజెక్టుల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సోలార్ టెక్నాలజీ ప్లాంట్‌పై ఒక మెగా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్న‌మ‌ని అన్నారు. ఇక్క‌డి ప్రజలకు ఈ ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల‌కు తగినంత విద్యుత్ అందించే సామ‌ర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామ‌ని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన విధంగా “కార్బన్ న్యూట్రల్” లద్దాఖ్ కోసం త‌గిన విధానం మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం దీనికి సంబంధించిన త‌గు సమగ్ర ప్రణాళికపై ఉత్సాహంగా పని చేస్తోంది. ఇది ఉన్నతాధికారుల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ల‌ద్దాఖ్ కోసం 50 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ విష‌యాన్ని కూడా కేంద్రమంత్రి ఈ సంద‌ర్భంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఇంత ఉదారంగా వ్యవహరించడం ఇదే మొద‌టి సారి అని తెలిపారు. ల‌ద్దాఖ్ ప్రాంతానికి ప్రత్యేకంగా కేటాయించిన రోడ్‌మ్యాప్‌లో ఇది మొదటిది అని ఆయన అన్నారు. ఎల్ఏహెచ్‌డీసీ ఎన్నికల తరువాత ప్రస్తుత పరిస్థితులను గురించి.. ప్రతినిధి బృందం కేంద్ర మంత్రికి వివరించింది. కేంద్రం నిధులు సమకూర్చిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ఆయనకు వివరించారు. స‌మావేశం ముగింపులో లేహ్ ఎల్ఏహెచ్‌డీసీ ఛైర్మన్ మాట్లాడుతూ వివిధ ల‌ద్దాఖ్ సంబంధిత విషయాలను చేపట్టేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలతో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రోజువారీ సమన్వయం చేప‌డుతున్నందుకు గాను ధన్యవాదాలు తెలిపారు.
                             

*****



(Release ID: 1672457) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi , Tamil