ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐఎఫ్ఎస్ సిఏకి తుది నివేదిక సమర్పించిన ఐఎఫ్ఎస్ సి అంతర్జాతీయ రిటైల్ బిజినెస్ అభివృద్ధి కమిటీ
Posted On:
11 NOV 2020 6:52PM by PIB Hyderabad
అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల కేంద్రాల సంస్థ (ఐఎఫ్ఎస్ సిఏ) 2020 ఆగస్టు 3వ తేదీన ఐఎఫ్ఎస్ సి అంతర్జాతీయ రిటైల్ వ్యాపారాభివృద్ధి కమిటీని నియమించింది. ఐఎఫ్ఎస్ సిలోఅంతర్జాతీయ రిటైల్ వ్యాపారాల అభివృద్ధిపై అధ్యయనం చేసి ఒక సమగ్ర ప్రణాళిక సూచించడంతో పాటు తనవంతుగా ఏవైనా సలహాలుంటే తెలియచేయడం కోసం నియమించిన ఈ కమిటీ నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇచ్చారు. బ్యాంకింగ్, బీమా సర్వీసులపై కమిటీ ఇప్పటికే రెండు నివేదికలు అందించింది. తాజా నివేదికలో పెట్టుబడి మార్కెట్లపై తన సిఫారసులు అందచేసింది. వీటికి తోడు ఐఎఫ్ఎస్ సి స్థూల అభివృద్ధిపై కూడా కమిటీత తన సిఫారసులు అందచేసింది.
భారతదేశం నుంచి ఫైనాన్షియల్ సర్వీసులు అందించేందుకు గల అవకాశాలు విశేషంగా తెలియచేయడంతో పాటు ఐఎఫ్ఎస్ సి ద్వారా భారత్ ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంపై కూడా కమిటీ సలహాలు అందించింది. వ్యాపారానుకూలతతో పాటు అత్యుత్తమ ప్రమాణాలు ఆచరించి తనను తాను ఒక బెంచ్ మార్క్ గా నిలిపేందుకు వీలుగా ఐఎఫ్ఎస్ సిఏ సువిశాలమైన నియంత్రణ యంత్రాంగాన్ని సమతూకం చేసుకోవాలని ఆ కమిటీ పేర్కొంది.
ఐఎఫ్ఎస్ సిలో అంతర్జాతీయ రిటైల్ వ్యాపారాలను ప్రోత్సహించేందుకు తక్షణ అవకాశాలున్నాయని పేర్కొంటూ అలా చేయడం వల్ల ఎ) ఉపాధికల్పన, బి) భారత్ కు అదనపు వనరుల లభ్యత, సి) మౌలిక వసతుల నిర్మాణానికి అవసరం అయిన నిధుల ఆకర్షణ (విదేశాల్లోని భారతీయ సంతతి ప్రజల నుంచి) లక్ష్యాలు నెరవేరతాయని పేర్కొంది.
అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల కేంద్రాల చట్టం, 2019 కింద ఐఎఫ్ఎస్ సిఏకు సంక్రమించిన విధుల నేపథ్యంలో ఐఎఫ్ఎస్ సిఏ అభివృద్ధి, నియంత్రణ కోణంలోఅనుసరించగల ద్వంద్వ పాత్రను ఆ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐఎఫ్ఎస్ సి ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సంస్థలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం ప్రాథమిక సంవత్సరాల్లో ఐఎఫ్ఎస్ సిఏ అభివృద్ధి పాత్ర అత్యంత కీలకమని పేర్కొంది.
“ప్రపంచ మార్కెట్లతో శక్తివంతమైన అనుసంధానత కలిగిన అగ్రశ్రేణి ప్రపంచ ఆర్థిక కేంద్రంగా భారతదేశంలో ఐఎఫ్ఎస్ సిని అభివృద్ధి చేయడం మా విజన్. ప్రపంచ దేశాల నుంచి నిధులు ఆకర్షించడంలో ఐఎఫ్ఎస్ సిని ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో అతి పెద్దదైన భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైబడి ఉన్న భారతీయ సంతతి ప్రజలు కీలకంగా నిలుస్తారు” అని ఐఎఫ్ఎస్ సిఏ చైర్మన్ శ్రీ ఇంజేటి శ్రీనివాస్ అన్నారు.
“సరికొత్త నియంత్రణ వ్యవస్థతో కూడిన ఈ సరికొత్త ఐఎఫ్ఎస్ సి ప్రగతిశీలక నియంత్రణ యంత్రాంగం, అనుకూలమైన పని వాతావరణంతో ఆర్థిక ఉత్పత్తులు, సేవల్లో నవ్యతకు పట్టం కట్టడం ద్వారా సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ గా నిలుస్తుంది. భారతదేశం నుంచి ఆర్థిక సర్వీసులు అనే విధానంతో ఐఎఫ్ఎస్ సి భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా విజన్ కు కూడా కీలకంగా నిలుస్తుంది” అని కమిటీ చైర్మన్ శ్రీ ప్రదీప్ షా అన్నారు.
నివేదిక కార్యనిర్వాహక వివరణ www.ifsca.gov.in ద్వారా అందుబాటులో ఉంటుంది.
ఈ కమిటీ బ్యాంకింగ్, బీమా, పెట్టుబడి మార్కెట్లపై చేసిన కీలక సిఫారసులు...
1. బ్యాంకింగ్ :
- ప్రవాస భారతీయుల ఎల్ఆర్ఎస్ పెట్టుబడులతో పాటు ఐఎఫ్ఎస్ సి బ్యాంకింగ్ యూనిట్ల (ఐబియు) నుంచి రిటైల్/ వ్యక్తిగత క్లయింట్లకు బ్యాంకింగ్ ఉత్పత్తులు, సొల్యూషన్లు అందించడం ద్వారా రిటైల్ భాగస్వామ్యం పెరిగేందుకు అనుమతించాలి.
- ఐబిఏ ద్వారా విభిన్న భౌగోళిక ప్రాంతాల్లోని విభిన్న మార్కెట్లలో పెట్టుబడులను అనుమతించడం ద్వారా వెల్త్ మేనేజ్ మెంట్ సామర్థ్యాలు అందుబాటులోకి తేవాలి.
- ఐబియులు ఐఎఫ్ఎస్ సి ద్వారా విదేశీ కరెన్సీ క్లియరింగ్ సర్వీసులు అందించడానికి అనుమతించాలి. ఇందుకు వీలుగా ఐఎఫ్ఎస్ సిలో కేంద్రీయ క్లియరింగ్ యంత్రాంగం ఏర్పాటు చేయాలి.
- ఐబియు విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ గా నమోదు కావడానికి అనుమతించడం ద్వారా రూపాయి మారకంలో జారీ చేసే ప్రభుత్వ సెక్యూరిటీలు (జి-సెక్), కార్పొరేట్ బాండ్లు, ఆమోదనీయయమైప ఇతర రూపాయి మారకం సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలి.
- ఎఫ్ సివై లోని రవాణాకు ముందర, రవాణా అనంతరం వస్తువులపై భారత ఎగుమతిదారులకు రుణం అందించేందుకు ఐబియుకు అనుమతి ఇవ్వాలి.
- ఆసక్తి గల అన్ని సంస్థల కోసం కరెంట్ అకౌంట్లు (ఎస్క్రో అకౌంట్లు సహా) ఓపెన్ చేసేందుకు ఐబియుకు అనుమతి ఇవ్వాలి.
- లిక్విడిటీ నిష్పత్తి (లిక్విడిటీ కవరేజి నిష్పత్తి లేదా ఎల్ సిఆర్; నికర స్థిర నిధుల నిష్పత్తి (ఎన్ఎస్ఎఫ్ఆర్) నిర్వహించాల్సిన నిబంధనను తొలగించాలి.
2. బీమా :
- ఐఎఫ్ఎస్ సి ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న బీమా కంపెనీల నుంచి శాశ్వత ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), భారత సంతతి ప్రజలు (పిఐఓ) వ్యక్తిగతంగాను, భారతదేశంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల పేరిట జీవిత బీమా పాలసీలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలి. అలాగే వారు తమకు అనుకూలమైన కరెన్సీలో (రూపాయి సహా) ప్రీమియం చెల్లించేందుకు అనుమతించాలి.
- ఎన్ఆర్ఐలు, పిఐఓలకు వ్యక్తిగతంగాను, భారతదేశంలో నివశిస్తున్న వారి కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య బీమా ఉత్పత్తులు జారీ చేసేందుకు బీమా కంపెనీలను అనుమతించాలి.
- వ్యాపారాలు విస్తరించుకునేందుకు బీమా కంపెనీలు ఐఎఫ్ఎస్ సిలో అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలి.
- ఐఎఫ్ఎస్ సి ఆసియా, ఆఫ్రికాలకు రీ ఇన్సూరెన్స్ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అనుమతించాలి. మరిన్ని రీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఐఎఫ్ఎస్ సి లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలాగే ప్రపంచ విమాన పరిశ్రమకు బీమా అందించే కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలి.
- ఐఎఫ్ఎస్ సిలో మధ్య శ్రేణి విదేశీ రీ ఇన్సూరెన్స్ కంపెనీలు కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు నికర స్వంత నిధుల (ఎన్ఓఎఫ్) నిబంధన కింద కనీస నిధుల పరిమాణం రూ.500 కోట్ల కన్నా తగ్గించాలి.
- విదేశాల్లో బీమా కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ ఇన్వెస్టర్లు తక్కువ మూలధనంతో డైరెక్ట్, రీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి.
- విస్తారమైన బీమా మార్కెట్ అందుబాటులోకి తేవడానికి వీలుగా విదేశీ రీ ఇన్సూరెన్స్ బ్రోకర్లు ఐఎఫ్ఎస్ సిలో కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలి.
3. ఆస్తుల నిర్వహణ, పెట్టుబడి మార్కెట్లు :
- ఎల్ఆర్ఎస్ రూట్ లో ఐఎఫ్ఎస్ సి ద్వారా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్లు (ఎఐఎఫ్), మ్యూచువల్ ఫండ్లలో (ఎంఎఫ్) ఇన్వెస్ట్ చేసేందుకు దేశీయంగా నివశిస్తున్న భారతీయులకు అనుమతి ఇవ్వాలి.
- ఎల్ఆర్ఎస్ రూట్ లో ఐఎఫ్ఎస్ సిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ అయిన కంపెనీల్లో దేశీయంగా నివశిస్తున్న భారతీయులు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలి.
- ఐఎఫ్ఎస్ సి నుంచి ఈక్వటీ లేదా రుణపత్రాల జారీకి విదేశీ, భారతీయ కంపెనీలను అనుమతించేందుకు అవసరం అయిన నిబంధనావళి రూపొందించాలి.
- బ్యాంకులు ప్రత్యేక కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థల ద్వారా ట్రేడింగ్/ క్లియరింగ్ సభ్యులుగా పని చేసేందుకు అనుమతించాలి.
- ఐఎఫ్ఎస్ సి ఫండ్ మేనేజర్లు ఇతర అంతర్జాతీయ సంస్థల తరహాలో తేలికపాటి, ఆచరణీయ రక్షిత కేంద్రాలుగా వ్యవహరించేందుకు వీలు కల్పించే విధానాలు అనుసరించాలి.
- ఐఎఫ్ఎస్ సిలో అమెరికన్ డాలర్, ఎఫ్ సివై సెటిల్మెంట్ల కోసం పేమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
- ఐఎఫ్ఎస్ సిలోని ఫండ్ల నిర్వహణకు వయబుల్ క్యాపిటల్ కంపెనీ (విసిసి) తరహా హైబ్రిడ్ వ్యవస్థలను అనుమతించాలి.
భారత ప్రభుత్వం శ్రీ ఇంజేటి శ్రీనివాస్ చైర్మన్ గా ఐఎఫ్ఎస్ సిలో అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల అభివృద్ధి, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ఐఎఫ్ఎస్ సిఏను ఏర్పాటు చేసింది. శ్రీ జి.శ్రీనివాస్ (న్యూఇండియా అష్యూరెన్స్ లిమిటెడ్ మాజీ సిఎండి), శ్రీ సిద్ధార్థ సేన్ గుప్తా (ఎస్ బిఐ మాజీ డిఎండి), శ్రీ శ్యామల్ ముఖర్జీ (పిడబ్ల్యుసి చైర్మన్), శ్రీ ప్రకాశ్ సుబ్రమణియన్ (స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హెడ్-స్ర్టాటజీ), శ్రీ దీపేష్ షా (గిఫ్ట్ ఐఎఫ్ఎస్ సిలో ఐఎఫ్ఎస్ సి విభాగం అధిపతి), శ్రీ నితిన్ జైస్వాల్ (బ్లూమ్ బర్గ్ ఆసియా పసిఫిక్ విభాగం ప్రభుత్వ, వ్యూహాత్మక సంబంధాల విభాగం అధిపతి) ఐఎఫ్ఎస్ సిఏలో ఇతర సభ్యులు.
భారత విదేశీ వ్యాపారాలను గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్ఎస్ సి ద్వారా జరిగేలా చూడడంతో పాటు భారత కేంద్రీకృత అంతర్జాతీయ ఆర్థిక సర్వీసులకు గేట్ వేగా అభివృద్ధి చేయడం, లండన్, హాంకాంగ్, సింగపూర్, దుబాయ్ తరహాలో అంతర్జాతీయ ఆర్థిక సర్వీసులకు ప్రపంచ హబ్ గా మార్చడం ఐఎఫ్ఎస్ సి ఏర్పాటు ప్రధాన లక్ష్యం.
***
(Release ID: 1672215)
Visitor Counter : 120