చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

పారదర్శక విధానంతో పన్నుల భూతం దూరం..ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ

కటక్ లో ఆదాయపన్ను అప్పీలేట్ కార్యాలయ-నివాస సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని

వర్చ్యువల్ విధానంలో 2020 మార్చ్ 20 నుంచి ఆగస్ట్ 31 వరకు 25 లక్షల కేసుల విచారణ .. శ్రీ రవి శంకర్ ప్రసాద్

Posted On: 11 NOV 2020 7:44PM by PIB Hyderabad

కటక్ లో ఆదాయపన్ను అప్పీలేట్ బెంచ్ నూతన కార్యాలయ-నివాస సముదాయాన్నిఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర న్యాయ మరియు కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ , ఒడిషా ముఖ్యమంత్రి శ్రీ. నవీన్ పట్నాయక్, న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ అనూప్ కుమార్, ఆదాయపన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్.ప్.భట్ ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఈ బెంచ్ కేవెలం ఒడిషా కు మాత్రమే కాకుండా తూర్పు, ఈశాన్య భారతదేశానికి చెందిన ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించిన లక్షలాది కేసులను పరిష్కరించడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకునివస్తుందని అన్నారు.

పారదర్శకమైన పన్నుల విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం పన్నుల రూపంలో గతంలో ప్రజలను భయపెట్టిన పన్ను అనే తీవ్రవాదాన్ని నిర్మూలించిందని అన్నారు. సంస్కరణలు, పనితీరును మెరుగుపరచుకోవడంతో వ్యవస్థలో మాఱుపు వచ్చిందని ప్రధాని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నియమాలు, నిబంధనల్లో మార్పులను తీసుకునివస్తున్నామని ఆయన వివరించారు.

 ' మేము ఒకవైపు స్పష్టమైన విధానంతో పని:చేస్తూ పన్ను చెల్లిందారుల ఆలోచనా దృక్పధంలో మార్పు తీసుకుని వస్తున్నాము' అని ప్రధానమంత్రి వివరించారు. దేశానికి సంపదను సమకూరుస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా వారికి రక్షణ కల్పించవచ్చునని శ్రీ నరేంద్రమోడీ అన్నారు. ఇది జరిగిన రోజున దేశ వ్యవస్థలపై వారికి నమ్మకం ఏర్పడుతుందని దీనితో దేశాభివృధికి దోహదపడే పన్నుల పరిధిలోకి మరికొంతమంది వచ్చి చేరుతారని ఆయన అన్నారు. పన్నులను తగ్గించడం, పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేసి పన్నుచెల్లింపుదారులకు రక్షణ కల్పించి తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను తీసుకుని వచ్చిందని ప్రధాని అన్నారు.

పన్ను చెల్లింపుదారులపై నమ్మకం ఉంచి వారు దాఖలు చేస్తున్న రిటర్నులను అనుమానించకపోవడం పన్ను వ్యవస్థలో వచ్చిన ప్రధాన మార్పు అని పేర్కొన్న ప్రధాని దీనివల్ల ఎలాంటి అభ్యంతరాలు లేకుండా 99.75 శాతం రిటర్నులను ఆమోదించడం జరుగుతున్నదని చెప్పారు. దేశ పన్నుల వ్యవస్తలో దీనిని ఒక పెద్ద మార్పుగా ప్రధాని అభివర్ణించారు.

పన్నులను చెల్లించేవారు, పన్నులను వసూలు చేసేవారి మధ్య సంబంధాలు దారుణంగా ఉండేవని ప్రధాని వ్యాఖ్యానించారు. బానిసత్వ విధానంలో ఉండే విధంగా ఈ సంబంధాలు దోచుకునేవారు, దోపిడీకి గురయ్యేవారివిగా ఉండేవని అన్నారు. పన్ను విధానంపై ఒక స్పష్టమైన అవగాహనతో పనిచేస్తూ వస్తున్న తమ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా అనేక మార్పులను అమలు చేస్తూ పారదర్శక విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాడని ఆయన వివరించారు. పన్ను రిఫండ్ కొన్ని వారాలలో తిరిగి వచ్చినప్పుడు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న వివాదాలు పరిష్కారం అయినప్పుడు వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తున్నదన్న భావన పన్నులను చెల్లించే వారిలో కలుగుతుందని ఆయన అన్నారు. చెల్లించవలసి ఉన్న పన్ను మొత్తం తగ్గినప్పుడు వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తున్నదని ప్రజలు భావిస్తారని ప్రధాని అన్నారు.

అయిదు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారిని ఆదాయపన్ను నుంచి మినహాయించడం వల్ల మధ్య దిగువ తరగతి వర్గాలకు చెందిన యువతకు ప్రయోజనం కలిగించిందని ప్రధానమంత్రి అన్నారు. ఆదాయపన్ను పన్ను చెల్లించడానికి ఈ ఏడాది బడ్జెట్ లో ప్రవేశపెట్టిన విధానం వల్ల అనేకమంది ఊపిరి పీల్చుకున్నారని ఆయన అన్నారు. పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని అధివృధి పథంలో నడిపించడానికి కార్పొరేట్ పన్నులను తగ్గించామని , ఇది ఒక విప్లవాత్మక నిర్ణయమని ప్రధాని తెలిపారు. ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉత్పత్తి పరిశ్రమలకు 15 శాతం పన్ను విధించాలని నిర్ణయించామని అన్నారు. ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులను ఆకర్షించడానికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును రద్దు చేశామని, వివిధ వస్తువులు సేవలపై జిఎస్ టీని తగ్గించామని వివరించారు. వివాదాలు లేని వ్యవస్థ అందుబాటులోకి రావడంతో వ్యాపారం సులువుగా సాగుతున్నదని అన్నారు. వివాదాలను తగ్గించడానికి అప్పీల్ పరిమితిని ఆదాయపన్ను ట్రిబ్యునల్ లో మూడు లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలకు, సుప్రీం కోర్టులో రెండు కోట్ల రూపాయలకు పెంచమని ఆయన వివరించారు.

దేశవ్యాపితంగా ఉన్న తన బెంచ్ ల స్థాయిని ఆదాయపన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ పెంచడం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకుంటూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి న్యాయ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు మరింత ప్రయోజనం కలిగించాలని ఆయన సూచించారు.

ఆదాయపన్ను ట్రిబ్యునల్ కు నూతన కార్యాలయ సముదాయ నిర్మాణానికి ఉచితంగా భూమిని కేటాయించి సహకరించిన ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ కు కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ ఫైలింగ్, డిజిటల్ హియరింగ్ లాంటి విధానాలను ప్రవేశపెట్టిన ట్రిబ్యునల్ ను ఆయన అభినందించారు. వీటివల్ల సత్వర న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. 'లాక్ డౌన్ సమయంలో అంటే 2020 మార్చ్ 24 వ తేదీ నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు వర్చ్యువల్ విధానంలో 25లక్షల కేసుల విచారణ జరిగింది. వీటిలో సుప్రీమ్ కోర్టు 8632 కేసులను, హై కోర్టులు 6,881,318 కేసులను, కింది కౌతులు 19,33,492 కేసులను విచారించగా, ఆదాయం పన్ను ట్రిబునల్లు 8000 కేసులను విచారించాయి' అని మంత్రి తెలిపారు.

****

 

 



(Release ID: 1672171) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Hindi