వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో కనీస మద్దతు ధర కార్యకలాపాలు
కెఎంఎస్ సేకరణ కార్యకలాపంలో సుమారు 21.90 లక్షల వరి రైతులకు రూ. 48766.12 కోట్ల కనీస మద్దతు ధర విలువ మేరకు మద్దతు
Posted On:
10 NOV 2020 5:58PM by PIB Hyderabad
ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధరల పథకానికి అనుగుణంగా రైతుల నుంచి ఖరీఫ్ 2020-21 పంటలను ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ప్రభ/త‌్వం సేకరిస్తోంది.
ఖరీఫ్ 2020-21 వరి పంట సేకరణ సాఫీగా సాగుతోంది. సేకరణ చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము, కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి 09.11.2020 వరకు దాదాపు 258.30 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేయడం జరిగింది. ఇది గత ఏడాది ఇదే కాలానికి సంబంధించిన 214.85 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా 20.22% ఎక్కువ. మొత్తం 258.30 లక్షల మెట్రిక్ తన్నులలో పంజాబ్ ఒక్క రాష్ట్రమే 181.93 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు దోహదం చేసింది, అంటే మొత్తం సేకరణలో 70.43 శాతం. గత ఏడాదితో పోలిస్తే పంజాబ్ ఈ ఏడాది 26% గత ఏడాదికన్నా ఎక్కువ. అంతే కాక, నిర్ధారించిన లక్ష్యానికన్నా 8% ఎక్కువగా ఉంది.
సాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సేకరణ కార్యకలాపాలలో సుమారు 21,90 లక్షలమంది రైతులు కనీస మద్దతు ధర విలువ ప్రకారం రూ.48766.12 కోట్ల రూపాయిల మేరకు లబ్ధిపొందారు.
అంతేకాకుండా, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా, ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 45.10 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ నుంచి ధరల మద్దతు పథకం కింద సేకరణలు చేశారు. దీనికి అదనంగా 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరిని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ నుంచి సేకరించడానికి ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వారి నుంచి పప్పుధాన్యాలు, నూనె విత్తనాలు, కొబ్బరిని ధరల మద్దతు పథకం కింద కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు అందుకున్న తర్వాత ఆమోదం తెలపనున్నది. తద్వారా 2020-21 సంవత్సరానికి నాణ్యతను పరీక్షించిన పంటలు నోటిఫై చేసిన కాలంలో మార్కెట్ ధరలు- కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉంటే, కనీస మద్దతు ధర కింద రాష్ట్ర నామినేటెడ్ సేకరణ ఏఎన్సీల ద్వారా కేంద్ర నోడల్ ఏజెన్సీలు ఆయా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో సేకరించడం జరుగుతుంది.
నోడల్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం 09.11.2020 వరకు రూ. 242.63 కోట్ల విలువైన 45282.30 మెట్రిక్ టన్నుల పెసరపప్పు, మినప పప్పు, వేరుశనగకాయలు, సోయా బీన్ గింజలను తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో 26352 మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. ఇది గత ఏడాది సేకరించిన పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణతో పోలిస్తే 124.79% ఎక్కువ. గత ఏడాది 20144.09 మెట్రిక్ టను్నల కొనుగోలు జరిగింది.
అలాగే, 09.11.2020 వరకు కర్నాటక, తమిళనాడులోని 3961 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 52.40 కోట్ల కనీస మద్దతు ధర విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని కొనుగోలు చేశారు.గత ఏడాది ఇదే కాలంలో 293.34 మెట్రిక్ టన్నుల కొబ్బరిని సేకరించారు. ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో కొబ్బరి,మినపపప్పు ధరలు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీలను అనుసరించి ఖరీఫ్ పప్పు ధాన్యాలు, నూనె గింజల రాకను బట్టి సేకరణకు అవసరమైన ఏర్పాట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేయనున్నాయి.
పత్తి విత్తనాల సేకరణ కార్యకలాపాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో సాఫీగా కొనసాగుతున్నాయి. దాదాపు 220057 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 09.11.2020 వరకు రూ. 3257.00 కోట్ల విలువ గల 1135818 కాటన్ బేళ్ళను సేకరించారు.
***
(Release ID: 1671802)
Visitor Counter : 156