ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎన్ ఎల్ ఐ యు భోపాల్ తో కలిసి సైబర్ చట్టాలు, సైబర్ నేరాల పరిశోధన, డిజిటల్ ఫోరెన్సిక్స్ అంశంలో పీజీ డిప్లమో కోర్సును ప్రారంభించిన నేషనల్ ఇ- గవర్నెన్స్ డివిజన్ ( ఎన్ ఇ జిడి)
Posted On:
09 NOV 2020 7:38PM by PIB Hyderabad
నేషనల్ ఇ- గవర్నెన్స్ డివిజన్, బోఫాల్ లోని నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీతో కలిసి సైబర్ చట్టాలు, సైబర్ నేరాల పరిశోధన, డిజిటల్ ఫోరెన్సిక్స్ అనే అంశంలో ఆన్ లైన్ పీజీ డిప్లమో కోర్సును ప్రారంభించింది. నవంబర్ 9న ఈ కార్యక్రమాన్ని విర్చువల్ గా నిర్వహించారు.
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద రూపొందిన ఈ పీజీ డిప్లమో కాల పరిమితి 9 నెలలు. ఎన్ జి జిడికి చెందిన డిజిటల్ లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా దీన్ని నిర్వహిస్తారు. వేయి మంది అధికారులు ఈ డిప్లమో కోర్సుద్వారా విద్యనభ్యసిస్తారు.
సైబర్ ఫోరెన్సిక్స్ కేసులను సమర్థవంతంగా, ప్రతిభావంతంగా పరిష్కరించడానికిగాను పోలీసు అధికారులు, రాష్ట్ర సైబర్ సెల్స్ అధికారులు, చట్టాలను అమలు చేసే ఏజెన్సీ సిబ్బంది, ప్రాసిక్యూటర్లు, న్యాయవ్యవస్థలోని అధికారులు మొదలైనవారికి అవసరమైన నైపుణ్యాలను బోధించడానికిగాను ఈ కోర్సును ప్రారంభించారు. అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ప్రమాణాలు, మార్గదర్శకాల ప్రకారం ఈ కోర్సును రూపొందించారు. ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబును ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఈ కోర్సును నిర్వహిస్తారు. దేశంలోని ఇతర న్యాయ విశ్వవిద్యాలయాలు ముందు ముందు ఈ ప్రోగ్రాంలో భాగం కానున్నాయి.
ఈ విర్చువల్ కార్యక్రమాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అజయ్ సాహ్ని ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, న్యాయనిపుణులు ఇందులోపాల్గొన్నారు.
ఎన్ ఇజిడికి చెందిన సిఇవో శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం నేపథ్యం వివరించారు.
మేఘాలయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంఎస్ రావు మాట్లాడుతూ చట్టాలను అమలు చేసే సంస్థల్లో పని చేసేవారికి ఈ డిప్లమో కోర్సు చాలా బాగా ఉపయోపడుతుందని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి వచ్చిన తర్వాత డిజిటల్ టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిందని సైబర్ నేరాలు కూడా పెరిగాయని అన్నారు.
సైబర్ క్రిమినల్స్ ను పట్టుకోవడంలో వున్న సమస్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు ఈ నేరాలపట్ల ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం కూడా ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్యమని ఆయన అన్నారు.
సైబర్ నేరాలను పరిష్కరించడంలో వున్న సమస్యలు, కోర్సు రూపకల్పన గురించి భోపాల్ నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడారు. తదనంతరం పలువురు నిపుణులు అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాల పరిష్కారంలోని సవాళ్ల గురించి దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. పీజీ డిప్లమోకోర్సు ప్రాధాన్యతపై వారు వివరంగా మాట్లాడారు.
***
(Release ID: 1671621)
Visitor Counter : 200