జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో గ్రామంలో నీటి నిర్వహణ ముఖ చిత్రాన్ని మార్చిన - సర్పంచ్

Posted On: 09 NOV 2020 5:40PM by PIB Hyderabad

‘ఒకసారి సైనికుడు, ఎప్పుడూ సైనికుడే’. అదే, పరంజీత్ కి, భారత సైన్యంలో బూట్ శిక్షణా శిబిరం నేర్పింది.  దాంతో, రక్షణ దళాల నుండి పదవీ విరమణ చేసిన తరువాత కూడా, అతను తన గ్రామంలో శుభ్రమైన, త్రాగునీటి కొరతను తీర్చడానికి ముందుకు వచ్చాడు.  పదవీ విరమణ తరువాత, పరంజీత్ తన స్వగ్రామమైన హర్యానాలోని మహేందర్ గఢ్ ‌లోని  కోతల్ ఖుర్ద్  ‌లో స్థిరపడాలని నిర్ణయించారు.  ఈ గ్రామం అభివృద్ధి చెందిన ప్రదేశం, వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెరుగైన విద్య మరియు జీవనశైలి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.  అయితే, ఆ గ్రామంలో ఒక అసౌకర్యం ఇప్పటికీ ఉంది, అది ఏమిటంటే, ఆ గ్రామంలో నీటి నిర్వహణ సరిగా లేక తాగునీటి కొరతను ఎదుర్కొంటోంది.

పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తే, గ్రామాల్లో చాలా ఇళ్ళకు నీటి పైప్ ‌లైన్ ఉందని పరంజీత్ గ్రహించాడు, అయితే, సక్రమమైన నీటి సరఫరా లేదు. దీనికి తోడు, నీటి నిర్వహణ గురించి గ్రామస్తులకు సరైన అవగాహన లేకపోవడంతో త్రాగునీరు ఎక్కువగా వృధా అవుతోంది.  చాలా మంది ప్రజలు అక్రమ కనెక్షన్లను కలిగి ఉండడంతో, పరిస్థితి మరింత దిగజారడానికి ఇది కూడా కారణమయ్యింది. 

ఈ సమయమయంలో ‘జల్ జీవన్ మిషన్’ పరంజీత్ కు మార్గదర్శిగా నిలిచింది.   కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం జల్ జీవన్ మిషన్, 2024 నాటికి ఫంక్షనల్ గృహ ట్యాప్ కనెక్షన్ల (ఎఫ్.‌హెచ్.‌టి.సి.లు ) ద్వారా ప్రతి గ్రామీణ గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించి, ప్రజల జీవితాలను మెరుగుపర్చాలని, యోచిస్తోంది.  అతను జల్ జీవన్ మిషన్ పై దృష్టిని కేంద్రీకరించాడు.  అతడు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన వెంటనే అతనిలోని సైనికుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి యుద్ధ ప్రాతిపదికన ఉద్యమించాడు. 

ప్రజారోగ్యం మరియు ఇంజనీరింగ్ విభాగం సహాయంతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సమగ్ర సర్వే చేపట్టడం జరిగింది.  342 గృహాలలో 145 గృహాలకు మాత్రమే చట్టపరమైన కనెక్షన్లు ఉన్నాయనీ, 115 కుళాయిలు విరిగిపోవడంతో, వీధుల్లో నీరు పొంగి ప్రవహించి వృధా అవుతున్నాయనీ, 60 శాతం గృహాల్లో కుళాయిలు ఏర్పాటు చేయలేదని ఈ సర్వేలో తేలింది.

జల్ జీవన్ మిషన్ కింద, గ్రామానికి సహాయం చేయడానికి మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణ వైపు గ్రామస్తులను సమీకరించడానికి, సరైన ఐ.ఈ.సి. (సమాచారం, విద్య, కమ్యూనికేషన్) ప్రణాళికను రూపొందించారు. పైపుల నీటి కనెక్షన్లను ఏర్పాటు చేయడానికీ, వాటి నిర్వహణకు సహాయం చేయడానికి, ఈ ప్రచారం, గ్రామస్థులను ప్రేరేపించింది.  హర్యానాలోని వాటర్ అండ్ శానిటేషన్ సపోర్ట్ సంస్థ (డబ్ల్యు.ఎస్.ఎస్.ఓ) అన్ని గ్రామ పంచాయతీలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో నీటి సంరక్షణలో మెళకువలు గురించి వి.డబ్ల్యు.ఎస్.సి. సభ్యులకు వివరించారు.

సమాజాన్నీ, పాఠశాల విద్యార్థులనూ చైతన్య పరచడంతో పాటు, వారిలో సామాజికంగా, ప్రవర్తనా పరంగా మార్పు తీసుకురావడానికీ నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో, గ్రామంలోని యువతను భాగస్వాములను చేయడం జరిగింది.  తాగు నీరు ఎక్కడ ఎక్కువగా వృధా అవుతోందో తనిఖీ చేయడానికి ఇంటింటి సర్వే చేయడం జరిగింది.  సర్పంచ్ ప్రయత్నాలలో గ్రామా ప్రజలందరూ చేరడంతో, ఆ గ్రామ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.  ప్రస్తుతం గ్రామంలో 4 సీజనల్ చెరువులు మరియు 14 ఇంకుడు గుంతలు గ్రామంలో 2,300 జనాభా అవసరాలను తీరుస్తున్నాయి.  200 కొత్త కనెక్షన్లు, 230 కొత్త కుళాయిలతో సహా గ్రామంలో మొత్తం  345 కనెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని లీకేజ్ పాయింట్లను గుర్తించి, మరమ్మతులు చేయడం జరిగింది.

కోతల్ ఖుర్ద్ గ్రామం భూగర్భజల ఉపరితల రీఛార్జ్ చెరువును నిర్మించింది.  వర్షాకాలంలో, ఆకాశం మరియు కాలువ నుండి వచ్చే నీరు చెరువును నింపుతుంది, ఇది భూగర్భ జలమట్టాన్ని మెరుగుపరచడంలో సహాయపడింది.  భూగర్భ జల మట్టం 250 అడుగుల నుండి 40 అడుగులు పెరిగి ఇప్పుడు 290 అడుగులకు పెరిగింది.  "మేరా గావ్ స్వచ్ఛ్ గావ్" కార్యక్రమం కింద, నీటి నిర్వహణలో చేపట్టిన ఉత్తమ పనులకు గాను, 2020 జనవరిలో, మహేంద్ర గఢ్ కమిషనర్, కోతల్ ఖుర్ద్ గ్రామాన్ని సత్కరించారు.  దేశంలో లాక్ డౌన్ ఉన్నప్పటికీ, నీటికి సంబంధించిన పనులు, ట్యాప్ కనెక్షన్లను ఆధార్ కార్డుతో అనుసంధానించే పనులు కొనసాగాయి.  పరంజీత్ చాలా సంతోషంగా ఉండే వ్యక్తి, అయితే,  నీటి దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో గెలవాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు.  అతని కృషి కొనసాగుతోంది. 

నీటి సరఫరా పథకం ప్రణాళిక నుండి ప్రారంభమైన ఆపరేషన్ మరియు భరోసా కలిగిన సేవా డెలివరీ కోసం నిర్వహణ వరకు, జల్ జీవన్ మిషన్ పధకానికి ముఖ్యమైనది ‘సమాజ భాగస్వామ్యం’.  ప్రతి గ్రామం నీటి భద్రంగా మారే విధంగా ప్రతి గ్రామాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుంటారు.  నీటి సరఫరా వ్యవస్థల ఆపరేషన్ మరియు నిర్వహణ ద్వారా ప్రతి కుటుంబానికి రెగ్యులర్ మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగునీటి సరఫరా భరోసా లభించే విధంగా,   స్థానిక తాగునీటి వనరులను బలోపేతం చేయడం, పంపు నీటి కనెక్షన్లు అందించడానికి, మురుగు నీటి శుద్ధి మరియు పునర్వినియోగం వంటి విభాగాలలో స్థానిక సమాజంలో పాల్గొనడం ద్వారా ప్రతి గ్రామానికి ఐదేళ్లపాటు గ్రామ కార్యాచరణ ప్రణాళిక (వి.ఏ.పి) సిద్ధం చేసుకోవాలి.  దీంతో పాటు, గ్రామ సమాజం సమస్యలను మరియు సవాళ్ళను గుర్తించగలదని భావిస్తున్నారు.  ఆ సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఎమ్.ఎన్.ఆర్.ఈ.జి.ఏ; జె.జె.ఎం; ఎస్.బి.ఎం(జి); పి.ఆర్.‌ఐ.లకు 15వ ఆర్ధిక సంఘం నిధులు; డి.ఎమ్.‌డి.ఎఫ్; ఎం. పి. / ఎం.ఎల్.ఏ. స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు; సి.ఎస్.‌ఆర్. నిధులు; కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ మొదలైన గ్రామంలో అందుబాటులో లభ్యమయ్యే వనరులను వినియోగించుకోవాలి. 

 

ప్రజల క్రియాశీల ప్రమేయంతో క్షేత్ర స్థాయి విధానం సేవల పంపిణీ పరంగా ఎలా సత్పలితాలనిస్తుందీ అనే విషయంలో,  కోతల్ ఖుర్ద్ వంటి గ్రామాల్లో ప్రణాళిక, అమలు, కార్యాచరణ, నిర్వహణలో స్థానిక సమాజం పాల్గొనడం ఒక ఉదాహరణగా నిలిచింది.

*****



(Release ID: 1671592) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi