రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కాన్సర్ మందులు అందుబాటు ధరలు ఉండడంలో ఎన్‌పిపిఎ కీలక పాత్ర

ఫిబ్రవరి 2019 లో మొదలైన ఎన్‌పిపిఎ ధర హేతుబద్ధీకరణ తరువాత, 42 క్యాన్సర్ నిరోధక ఔషధాల 526 బ్రాండ్లు 90% వరకు ధర తగ్గాయి

క్యాన్సర్ రోగులకు ఏటా సుమారు రూ.1000 కోట్లు ఆదా అవుతుంది

ఎన్‌పిపిఎ నవంబర్ 7 న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంది

Posted On: 06 NOV 2020 6:04PM by PIB Hyderabad

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), ఫిబ్రవరి 2019 లో ప్రారంభించిన ధరల హేతుబద్ధీకరణ నిర్ణయం చాలా ప్రభావాన్ని చూపింది, ఇది క్యాన్సర్ నిరోధక ఔషధాలలో భారీ ధరల తగ్గింపునకు దారితీసింది. ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని అసాధారణమైన అధికారాలను ఉపయోగించి, బాధపడుతున్న రోగులకు ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా మార్చడానికి ఒక ముందడుగుగా 42 యాంటీ క్యాన్సర్ ఔషధాల కోసం ట్రేడ్ మార్జిన్ హేతుబద్ధీకరణకు పైలట్ గా దీనిని ప్రారంభించింది. 7 వ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పాటించడంలో భాగంగా ఎన్‌పిపిఎ ఒక ప్రకటన చేస్తూ, నవంబర్ 2020 ఈ నిర్ణయానికి అన్ని వాటాదారుల నుండి ఏకగ్రీవ మద్దతు లభించిందని చెప్పారు. ఎన్‌పిపిఎ నోటిఫికేషన్ అమలు చేసిన తర్వాత ఔషధ కంపెనీల నుండి అందుకున్న ప్రతిస్పందన ఆధారంగా, ఈ కసరత్తు జరిపిన పిమ్మట 426 క్యాన్సర్ ఔషధాల 526 బ్రాండ్లు 90% వరకు ధర తగ్గింపును చూపించాయి. బ్రాండ్ల ధరలలో శాతం వారీగా తగ్గింపు క్రింది విధంగా ఉంది: -

 

క్రమ సంఖ్య

ధరల్లో స్లాబ్-శాతం తగ్గింపు 

బ్రాండుల సంఖ్య

1

75% కన్నా ఎక్కువ 

63

2

50% నుండి 75%

167

3

25% నుండి 50%

169

4

25% వరకు 

127

  మొత్తం  526

 

ఉదాహరణకు, బ్రాండ్ బిర్లోటిబ్ కింద ఎర్లోటినిబ్ 150 మి.గ్రా టాబ్ ఎంఆర్పి రూ .9999 / - నుండి రూ.891.79 / - కు సవరించారు, అంటే ఈ ఔషధం ధర తగ్గుదల 91.08% చూపుతుంది. అదేవిధంగా, పెమెస్టార్ 500 గా అమ్మబడిన పెమెట్రెక్స్డ్ 500 మి.గ్రా ఇంజెక్షన్ ఎంఆర్పి రూ .25,400 / - నుండి రూ .2509 / - కు సవరించబడింది, దీని ధరలో కూడా 90% తగ్గుదల అయింది. రూ .20,000 / - కంటే ఎక్కువ ధర ఉన్న 124 ఔషధాలు 62 అయ్యాయి. 

పైలట్ వల్ల వార్షిక ఆదా క్యాన్సర్ రోగులకు రూ.984 కోట్లు పొదుపయ్యే అవకాశం లభించింది. రోగుల సహాయక బృందాలతో సహా అన్ని వాటాదారుల నుండి పైలట్‌కు అపారమైన మద్దతు లభించడం కూడా చాలా సంతృప్తికరంగా ఉంది.

 ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ (ఐడాన్) కూడా ప్రజా ప్రయోజనార్థం ట్రేడ్ మార్జిన్‌ను పరిమితం చేయడం ద్వారా క్యాన్సర్ నిరోధక ఔషధాల అమ్మకంలో లాభాలను అరికట్టడానికి ఎన్‌పిపిఎ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మరియు నాన్-కమ్యూనికేట్ వ్యాధుల (ఎన్‌సిడి) కారణంగా ఈ రోజు కూడా క్యాన్సర్ వయోజన అనారోగ్యం మరియు మరణానికి ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణానికి క్యాన్సర్ రెండవ ప్రధాన కారణమని, 2018 లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 మిలియన్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 1.5 మిలియన్లు భారతదేశంలోనే ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 9.5 మిలియన్లకు వ్యతిరేకంగా 2018 లో భారతదేశంలో 0.8 మిలియన్ల క్యాన్సర్ మరణాలు సంభవించాయి. 2040 నాటికి భారతదేశంలో కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా.

క్యాన్సర్‌తో సంబంధం ఉన్న ఆర్థిక భారం రోగులను మరియు గృహాలనుతీవ్ర సంక్షోభానికి గురిచేస్తోంది. అందువల్ల క్యాన్సర్ మందులు సరసమైనవి కావాలి, అపుడు అవసరమైనప్పుడు ప్రారంభ దశలోనే చికిత్స అందించవచ్చు. క్యాన్సర్ ఔషధాల లభ్యత మరియు స్థోమత చికిత్స ఫలితాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

క్యాన్సర్‌ను నివారించడానికి మరియు నియంత్రించడానికి మరియు సరసమైన మరియు అందుబాటులో ఉండే సంరక్షణను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ (ఎన్‌పిసిడిసిఎస్) నివారణ మరియు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద జిల్లా స్థాయి కార్యకలాపాల కోసం అమలు చేయబడుతోంది.

ఆయుష్మాన్ భారత్ పరిధిలో, సంక్షోభ పరిస్థితులు ఉత్పన్నమయ్యే పేద మరియు బలహీన వర్గాలకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలకు ప్రాప్తిని కల్పించడానికి ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పిఎం-జై) అమలు అవుతోంది. ఇది సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5,00,000 (కుటుంబ ఫ్లోటర్ ప్రాతిపదికన) వరకు కవర్ అయి ప్రయోజనం చేకూరుస్తుంది.

ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డిపిసిఓ) 2013 ప్రకారం ఎన్‌పిపిఎ అన్ని ఔషధాల ధరలను నియంత్రిస్తుంది. ఇది నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఇఎమ్) లో పేర్కొన్న ఔషధాల జాబితా ప్రకారం షెడ్యూల్ ఫార్ములేషన్ల  ధరల పరిమితిని నిర్ణయిస్తుంది. డ్రగ్ ప్రైసింగ్ కంట్రోల్ ఆర్డర్ (డిపిసిఓ), 2013. షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరలను నియంత్రించడం ద్వారా, ఎన్‌పిపిఎ సుమారుగా ఫార్మా సెక్టార్ రంగంలో 16-17% మాత్రమే ఉంటుంది. 

 

******


(Release ID: 1670897) Visitor Counter : 196


Read this release in: English , Urdu , Hindi