ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్‌లో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ
Posted On:
06 NOV 2020 3:11PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక ప్రముఖ బొగ్గు వ్యాపారికి చెందిన రాణీగంజ్, అసన్‌సోల్, పురూలియా, కోల్‌కొతాలోని ఆవరణలలో గురువారం నాడు ఆదాయపపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ ప్రయోజనాల కోసం లెక్క చెప్పని నగదు భారీ స్థాయిలో నగదును పోగు చేస్తున్నారన్న రహస్య సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరిగాయి. పన్ను చెల్లించే గ్రూప్‌కు చెందిన కంపెనీలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాలు ప్రకారం రూ. 150 కోట్ల వరకు బోగస్ పెట్టుబడులను పేర్కొనబడని, గుర్తించని ఈక్విటీ షేర్లలో పెట్టి, అందులో రూ. 145 కోట్ల షేర్లను అమ్మారు. ఈ లావాదేవీలు అన్నీ కూడా మోసపూరిత లావాదేవీలు, ఇదే విషయాన్ని సోదాల సందర్భంగా ఈ విషయాన్ని అసెస్సీ అంగీకరిస్తూ చేసిన ప్రకటనను అధికారులు నమోదు చేశారు.
బొగ్గు, ఇసుక వ్యాపారం, పరిశుద్ధం చేసిన ఇనుము అమ్మకాలు తదితరాల నుంచి నగదును ఉత్పత్తి చేసినట్టు చూపే నేరారోపక పత్రాలను పెద్ద సంఖ్యలో ఈ సోదాల సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు రవాణా, వివిధ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన లెక్క చూపని భారీ ఖర్చులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాలలో లెక్కచూపని నగదు రూ. 7.3 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు సాగుతోంది.
***
(Release ID: 1670693)