ఆర్థిక మంత్రిత్వ శాఖ

సుమారు 392 కోట్ల రూపాయల ఇన్ పుట్ టాక్సు క్రెడిట్ ఫోర్జరీ చేసినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న - గుర్గావ్ డి.జి.జి.ఐ.

Posted On: 29 OCT 2020 8:53PM by PIB Hyderabad

నకిలీ పత్రాలపై కల్పిత సంస్థలను సృష్టించడం, నిర్వహించడం మరియు వాస్తవానికి ఎటువంటి వస్తువులు లేదా సేవలను స్వీకరించడం లేదా సరఫరా చేయకుండా ఇన్వాయిస్‌ లు జారీ చేయడం ద్వారా నకిలీ ఇన్‌ పుట్ టాక్సు క్రెడిట్‌ను పంపడం వంటి ఆరోపణలపై, హర్యానాలోని జి.ఎస్.‌టి. ఇంటెలిజెన్సు (డి.జి.జి.ఐ) డైరెక్టరేట్ జనరల్ గుర్గావ్ జోనల్ యూనిట్ (జి.జెడ్.యూ) కార్యాలయం, న్యూఢిల్లీ నివాసి కబీర్ కుమార్‌ను అరెస్టు చేసింది. 

గుర్గావ్, న్యూఢిల్లీ, ఫరీదాబాద్, సోలన్, నోయిడా, ఝాజ్హార్, సిర్సా మొదలైన ప్రాంతాల్లో, క్వీర్ కుమార్ కేవలం కాగితాలపై అనేక కల్పిత యాజమాన్య సంస్థలను సృష్టించినట్లు, ఈ రోజు వరకు జరిపిన దర్యాప్తు ద్వారా వెల్లడయ్యింది.  అతని ప్రాంగణంల్లో జరిపిన దర్యాప్తులో, కబీర్ నగరం నుండి పారిపోవడానికి కూడా ప్రయత్నించినట్లు తెలిసింది.  అయితే, కస్టమ్స్ మరియు సి.ఐ.ఎస్.ఎఫ్. అధికారుల సహకారంతో డి.జి.జి.ఐ. అధికారులు, అతనిని విమానాశ్రయంలో అలా చేయకుండా నిరోధించారు.

అంతేకాకుండా, 31 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, వాస్తవంగా ఎటువంటి వస్తువులనూ సరఫరా చేయకుండా, 2,993.86 కోట్ల రూపాలమేర నకిలీ ఇన్వాయిస్ లను రూపొందించి, 392.37 కోట్ల రూపాయల మేర ఐ.టి.సి. ప్రయోజనాన్ని పొందినట్లు అతను ఒప్పుకున్నాడు.  అతనికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి ల్యాప్‌ టాప్, మొబైల్ ఫోన్లు, 140 సిమ్ కార్డులు వంటి అనేక సాక్ష్యాధారాలను స్వాధీనం చేకున్నారు. 

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిపిన దర్యాప్తుతో పాటు పలు దస్తావేజుల ఆధారంగా, నమోదు చేసిన నివేదికల ఆధారంగా, నకిలీ పత్రాలపై నకిలీ సంస్థలను ఏర్పాటు చేసే ఈ ముఠాను నిర్దేశించడంలో కబీర్ కుమార్ ముఖ్య వ్యక్తి అని తేలింది. దీని ప్రకారం, కబీర్ కుమార్‌ ను ఈ రోజు అదుపులోకి తీసుకుని, ఢిల్లీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా, ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. మొత్తంమీద 392 కోట్ల రూపాయల మేర  నకిలీ ఐ.టి.సి. ని నిందితులు జారీ చేశారు.ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 

*****


(Release ID: 1668720) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi