ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్ధిక సంవత్సరం 2020-21కి సంబంధించి సెప్టెంబర్ వరకు భారత ప్రభుత్వ నెలవారీ ఖాతాల సమీక్షల విడుదల
Posted On:
29 OCT 2020 4:57PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ నెలవారీ ఖాతాలను సెప్టెంబర్, 2020 వరకు ఏకీకృతం చేసి, నివేదికను ప్రచురించారు. నివేదికలోని కొన్ని ముఖ్యమైన అంశాలను దిగువన చూడవచ్చుః
భారత ప్రభుత్వానికి సెప్టెంబర్ 2020 వరకు రూ.5,65,417 కోట్ల ఆదాయం వచ్చింది (ఇది 2020-21లో వసూలు కావలసిన మొత్తం నగదులో 25.18%), ఇందులో రూ. 4,58,508 కోట్ల రూపాయలు పన్ను ఆదాయం (కేంద్రానికి నికరంగా) కాగా, రూ. 92,274 కోట్లు పన్నేతర ఆదాయం, రూ. 14, 635 కోట్లు రుణేతర పెట్టుబడి వసూళ్ళు. రుణేతర పెట్టుబడి వసూళ్ళలో రుణాల రికవరీ (రూ.8,854 కోట్లు), పెట్టుబడి ఉపసంహరణ నుంచి వచ్చిన విక్రయ ధనం (రూ. 5,781 కోట్లు)గా ఉంది.
ఇందులో రూ. 2,59,941 కోట్లను భారత ప్రభుత్వం వాటాల సంక్రమణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే ఇది రూ. 51,277 కోట్లు తక్కువ.
భారత ప్రభుత్వ ఖర్చు చేసిన మొత్తం రూ. 14,79,410 కోట్లు ( 2020-21 సంవత్సరానికి సంబంధించిన వ్యయంలో ఇది 48.63%). ఇందులో రూ. 13,13,574 కోట్లు ఆదాయపు ఖాతా కాగా, రూ. 165, 836 కోట్లు మూల ధన ఖాతా. వడ్డీ చెల్లింపుల కారణంగా మొత్తం ఆదాయపు వ్యయం రూ. 3,05,652 కోట్లు కాగా, ప్రధాన సబ్సిడీల కారణంగా రూ. 1,56,210 కోట్ల రూపాయిలు ఖర్చు చేసింది.
***
(Release ID: 1668690)
Visitor Counter : 96