మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పాఠశాల పిల్లలలో పోషకాహార లోపం

Posted On: 23 SEP 2020 7:29PM by PIB Hyderabad

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రమానుగతంగా నిర్వహించిన జాతీయ సర్వేల ద్వారా పిల్లల పోషక స్థితిని పర్యవేక్షిస్తుంది.  ఇటీవల నిర్వహించిన సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సి.ఎన్.‌ఎన్.ఎస్) (2016-18) పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితిపై సమాచారాన్ని పొందుపరిచింది. ఈ సర్వే ప్రకారం, 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారు,  5 - 9 సంవత్సరాల మధ్య వయస్సులో 35.2 శాతం మంది పిల్లలు తక్కువ బరువు కలిగి ఉన్నారు,  10 - 19 సంవత్సరాల మధ్య వయస్సులో 24.1 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు.

పాఠశాలకు వెళ్లే పిల్లల పోషక స్థితిని మెరుగుపరిచేందుకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖచే జాతీయ స్థాయిలో అమలు చేస్తోంది.  జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 లోని షెడ్యూల్- II లో పేర్కొన్న పోషక ప్రమాణాల ప్రకారం పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.  ప్రస్తుత (కోవిడ్-19) పరిస్థితులలో వండిన భోజనాన్నివేడిగా అందించడం సాధ్యం కానందున, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె మొదలైన (వంట చేయడానికయ్యే ఖర్చుతో సమానంగా) వాటితో కూడిన ఆహార భద్రత అలవెన్సు (ఎఫ్.ఎస్.ఏ) ను కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి పాఠశాలలు మూసివేయడానికి ముందు అర్హత ఉన్న పిల్లలందరికీ అందించాలని సూచించారు. 

ఇంకా, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.‌హెచ్.‌ఎం) కింద రక్తహీనత ముక్త్ భారత్ వ్యూహం పిల్లలలో (5-9 సంవత్సరాలు) మరియు కౌమార బాలికలు మరియు బాలురు (10-19 సంవత్సరాలులలో రక్తహీనత నివారణ మరియు చికిత్స కోసం సేవలను అందిస్తుంది.  ఈ పథకం కింద, రోగనిరోధక ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ (ఐ.ఎఫ్.ఎ) భర్తీ, తరచుగా పేగుల్లోని పురుగుల నిర్మూలన, డిజిటల్ పద్ధతులను ఉపయోగించి రక్తహీనతను పరీక్షించడం, చికిత్స చేయడంమలేరియా, హిమోగ్లోబినోపతీలు మరియు ఫ్లోరోసిస్ ‌పై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రాంతాల్లో రక్తహీనత యొక్క పోషక రహిత కారణాలను పరిష్కరించడంతో పాటు. సంరక్షణతో కూడిన ఇతర చికిత్సలు పాఠశాల వేదిక ద్వారా జరుగుతున్నాయి. 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో, పాఠశాలకు వెళ్లే పిల్లలు మరియు కౌమార దశలోని పిల్లలకు ఐ.ఎఫ్.ఏ. అనుబంధ సేవలను అందించడంలో ఎదురౌతున్న సవాళ్ళ కారణంగా, "కోవిడ్-19 వ్యాప్తి సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచడం" మరియు "కోవిద్-19 మహమ్మారి సమయంలోనూ, కోవిడ్ తర్వాతి పరిస్థితుల్లోనూ, పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, పిల్లలకౌమార ఆరోగ్యం మరియు పోషకాహార సేవలను అందించడం" గురించి, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సేవలను నిరంతరాయంగా కొనసాగించడానికి వీలుగా, అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ,  మార్గదర్శకాలను విడుదల చేసింది.   ఈ మార్గదర్శకాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న 5-9 సంవత్సరాల పిల్లలు మరియు కౌమారదశలో 10-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో సహా లక్ష్య వయస్సు గల వారికి ఐ.ఎఫ్.ఏ. యొక్క గృహ పంపిణీని నిర్ధారించాలని, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడమయ్యింది.  కంటైన్మెంట్ లేని జోన్లలో, గ్రామ ఆరోగ్య, పారిశుధ్య మరియు పోషకాహార రోజులలో ఈ ఐ.ఎఫ్.ఎ. అనుబంధ ఆహార పదార్ధాల పంపిణీని చేపట్టాలని సూచించారు.  అన్ని వ్యక్తిగత రక్షణ చర్యలు, భౌతిక దూర నిబంధనలను పాటిస్తూఫ్రంట్‌ లైన్ కార్మికులైన ఆశా లు / ఏ.ఎన్.ఎమ్. లు / ఏ.డబ్ల్యూ, డబ్ల్యూ లచేత  ఈ పంపిణీని చేపట్టాలని సూచించారు. 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి  స్మృతి జుబిన్ ఇరానీ.  ఈ రోజు లోక్‌సభలో, లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.   

*****



(Release ID: 1658597) Visitor Counter : 222


Read this release in: English , Punjabi