ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

"ఆశా" లకు ప్రోత్సాహకాలు

Posted On: 23 SEP 2020 6:56PM by PIB Hyderabad

కోవిడ్-19 సంబంధిత కార్యకలాపాలను చేపట్టడం కోసం, “ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత ప్యాకేజీ” కింద ఆశా లకు,  ఈ పనిలో నిమగ్నమయ్యే కాలానికి,  నెలకు 1000 చొప్పున అదనపు ప్రోత్సాహకాన్ని అందజేయాలని, భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేటాయించింది.  దీనితో పాటు, కోవిడ్-19 చేత ప్రభావితమయ్యే ప్రమాదం ఉన్న ఆశా లతో సహా ప్రజారోగ్య పరిరక్షణ కార్యకర్తలకు, 50 లక్షల రూపాయల మేర బీమా సౌకర్యాన్ని కల్పించే  “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ: కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం” కింద ప్రయోజనాన్ని కూడా ప్రారంభించారు. 

ప్రజల ఆరోగ్యం, ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం కాబట్టి, ఆశా లకు ప్రోత్సాహకాన్ని సకాలంలో చెల్లించే బాధ్యత సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలపైనే ఉంటుంది.  ఎటువంటి జాప్యం లేకుండా ఆశా లకు ప్రోత్సాహకాలు చెల్లించేలా చూడాలని భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పదే, పదే కోరుతోంది.  

"ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ: కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం" కింద రాష్ట్రాలు /  కేంద్ర పాలిత ప్రాంతాలు అందజేసిన సమాచారం ప్రకారం, కోవిడ్-19 కార్యకలాపాల సమయంలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా మృతి చెందిన ఆశా కార్యకర్తల వివరాలను అనుబంధం -1 లో చూడవచ్చు. 

"ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ: కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం" కింద ఆశా కార్మికుల కోసం దాఖలు చేసిన మరియు ప్రాసెస్ చేసిన దావా వివరాలు అనుబంధం -2 లో చూడవచ్చు. 

*****



(Release ID: 1658579) Visitor Counter : 144


Read this release in: English , Manipuri