జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ పై ఉత్తరాఖండ్ సి.ఎం.తో కేంద్ర జలశక్తి మంత్రి చర్చ

2022నాటికి వందశాతం పథకం అమలుకోసం ఉత్తరాఖండ్ ప్రణాళిక

పేదలకు, అట్టడుగు వర్గాలకు నీటి కుళాయిల కనెక్షన్ల పనులను ఉద్యమంగా చేపట్టాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి సూచన

Posted On: 23 SEP 2020 5:59PM by PIB Hyderabad

  జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పనుల అమలుపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.తో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించారు. ఉత్తరాఖండ్ జలశక్తి కార్యదర్శి, అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతి ఇంటికీ నీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న బృహత్తర లక్ష్యాన్ని 2022నాటికి వందశాతం పూర్తి చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది. నేపథ్యంలో రాష్ట్రంలో జె.జె.ఎం. అమలు ప్రగతిపై ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి చర్చలు జరిపారు.

  గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ పథకం ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి సందర్భంగా వివరిస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి సరఫరా పథకాన్ని మరింత బలోపేతం చేయడం ఎంతో ఆవశ్యకమన్నారు. ఉత్తరాఖండ్ లోని 15,218 గ్రామాల్లో 14,595 గ్రామాలకు పైపుల ద్వారా నీటి సరఫరా పథకం అమలులో ఉందని, అయితే, 14.61లక్షల ఇళ్లకు గాను, కేవలం 2.71 లక్షల ఇళ్లకు మాత్రమే అంటే 18.55శాతం ఇళ్లకు మాత్రమే నీటి కుళాయిలు ఉన్నాయన్నారు. సమాజంలోని పేదలు, అట్టడుగువర్గాలకు చెందిన మిగిలిన ఇళ్లకు కూడా సాధ్యమైనంత త్వరగా నీటి కుళాయిల కనెక్షన్లు అమర్చడానికి పనులు ఉద్యమం తరహాలో చేపట్టాలని కేంద్ర మంత్రి సూచించారు.

   జలజీవన్ మిషన్ కింద ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు కల్పించాలన్న లక్ష్య సాధనలో రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉందని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలో నీటి కుళాయిల కనెక్షన్ల ఏర్పాటులో  ఫలితాలు, అందుబాటులోని కేంద్ర నిధులు, రాష్ట్రం మ్యాచింగ్ వాటా వినియోగం ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులిస్తోందన్నారు. ఉత్తరాఖండ్ లో ఇళ్లకు నీటి కుళాయిల పథకాన్ని వందశాతం పూర్తి చేసేందుకు కేంద్రం అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

   2020-21 సంవత్సరంలో 3.59లక్షల ఇళ్లకు నీటి కుళాయిలు అమర్చాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 2020-21లో రూ. 362.58కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రం నిధుల వాటా, అంతకు ముందు సంవత్సరపు ఖర్చుపెట్టని నిధులు కలిపి ప్రస్తుతం రూ. 469.47కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక నిర్వహణ తీరు ప్రాతిపదికన  అదనంగా నిధులు పొందే అర్హత కూడా రాష్ట్రానికి ఉంది. గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఇచ్చే 15 ఆర్థిక సంఘం గ్రాంటు కింద ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రూ. 574 కోట్లు కేటాయించారు. అందులో 50శాతం నిధులను నీటిసరఫరా, పారిశుద్ధ్యం పనులకు వినియోగించాల్సి ఉంది. నిధులను గ్రామీణ నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం తదితర కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని కేంద్రమంత్రి షెకావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి సూచించారు. నీటి సరఫరా పథకాలను దీర్ఖకాల నిర్వహించే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

  నీటి సరఫరాకు సంబంధించి గ్రామ కార్యాచరణ ప్రణాళికలను, గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలను, పానీ సమితులను రూపొందించాలని, గ్రామ పంచాయతీల ఉప సంఘాలుగా వీటిని ఏర్పాటు చేయాలని, 50శాతం మహిళా సభ్యులు ఉండేలా చూడాలని కేంద్ర మంత్రి సూచించారు. గ్రామాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాల రూపకల్పన, ప్రణాళిక, అమలు, నిర్వహణ వంటి కార్యకలాపాలకు కమిటీలే బాధ్యత వహిస్తాయన్నారు. గ్రామ కార్యచరణ ప్రణాళికలను (వి..పి.లను) గ్రామాలన్నీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని సిసలైన ప్రజా ఉద్యమంగా మార్చేందుకు విస్తృత స్థాయిలో  అవగాహనా కార్యక్రమం చేపట్టాలన్నారు.

  సందర్భంగా పథకం అమలులో తమకు ఎదురయ్యే సవాళ్లను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వెళ్లడానికి వీల్లేని కొండ ప్రాంతాలు, పలుచగా ఉండే జనాభా, అనుసంధాన సౌకర్యాల లోపం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి పలు సవాళ్లను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, జలజీవన్ మిషన్ అమలు పనులను క్రమం తప్పకుండా సమీక్షిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిలు అమర్చే కార్యక్రమాన్ని నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో వారికి అవసరమైన మౌలిక సేవలందించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా తగిన పరిమాణంలో క్రమం తప్పకుండా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జలజీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ నీటి కుళాయిల ద్వారా మంచినీరు అందించాలన్నది పథకం లక్ష్యం.

    స్థానిక కమిటీ ద్వారా నీటి నాణ్యతపై నిఘా ఉంచేందుకు జలజీవన్ మిషన్ అమలులో  ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం, ప్రతి గ్రామంలోను ఐదుగురికి ప్రత్యేకించి మహిళలకు తర్ఫీదు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేసే నీటి నాణ్యతను పరీక్షించేందుకు క్షేత్ర స్థాయి టెస్ట్ కిట్లను వినియోగించేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. సరఫరాకోసం కోసం ఉద్దేశించి ప్రతి నీటి వనరునూ భౌతిక, రసాయనిక కలుషితాలపై ఏడాదికి ఒకసారి పరీక్షించాల్సి ఉంది. బాక్టీరియా కాలుష్యం నివారణకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు జరపాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర స్థాయి, జిల్లాల స్థాయి పరీక్షా కేంద్రాలకు  అధికారిక గుర్తింపును సాధించుకునే ప్రక్రియను 3-43 నెలల్లో పూర్తి  చేయాలని, తమకు సరఫరా అయ్యే నీటిని ప్రజలు నామమాత్రపు ధరపై పరీక్షించుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో అవకాశం ఇవ్వాలని  ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి షెకావత్ సూచించారు

*****



(Release ID: 1658578) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi