మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అంగన్‌వాడీ కేంద్రాల డిజిటలీకరణ

Posted On: 23 SEP 2020 7:32PM by PIB Hyderabad

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను ఉపయోగించే ప్రయత్నంలో భాగంగా, ప్రస్తుతం, మొబైల్‌ ఆధారిత ఉపాధి-సహాయ అప్లికేషన్‌ (ఐసీడీఎస్‌-సీఏఎస్‌)ను మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఇది దేశంలోని 351 రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది.

ఐసీడీఎస్‌-సీఏఎస్ అమలు స్థితిపై రాష్ట్రాలవారీ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మదర్‌&ఛైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టం/రీప్రొడక్టివ్‌ ఛైల్డ్‌ హెల్త్‌ (ఆర్‌సీహెచ్‌‌) పోర్టల్‌తో ఐసీడీఎస్‌-సీఏఎస్ అనుసంధానం కాలేదు. 

    డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖ 'పోషణ్‌ ట్రాకర్‌' అనే డిజిటల్‌ వేదికను అందుబాటులోకి తెస్తోంది. సౌకర్యాలు, సేవలు, అంతఃఅనుసంధానతలను అందించే, విశ్లేషణలతో కూడిన వాస్తవ సమయ సమాచారాన్ని ప్రోత్సహించే విస్తృతమైన వ్యవస్థ ఇది.

    అంగన్‌వాడీ సేవల పథకం కింద, చిన్నారి లబ్ధిదారులకు అనుబంధ పౌష్టికాహారం అందుతోంది. పిల్లల పోషణ స్థితిలో వృద్ధి కోసం, "నెలవారీ గ్రామీణ ఆరోగ్య, పారిశుద్ధ రోజు &సమాజ ఆధారిత కార్యక్రమాలను" రాష్ట్రాలు/యూటీలు నిర్వహిస్తున్నాయి. ఇదేగాక, 3-6 ఏళ్ల వయస్సున్న చిన్నారులకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అనధికారిక ప్రీ-స్కూల్ విద్య సేవలు అందుతున్నాయి. ఇందుకోసం ఏడాదికి అంగన్‌వాడీ కేంద్రానికి రూ.5 వేలను రాష్ట్రాలు/యూటీలు కేటాయిస్తున్నాయి.

    కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.
 

****



(Release ID: 1658395) Visitor Counter : 152


Read this release in: English , Punjabi