మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బాలల సంరక్షణ సంస్థలు
Posted On:
23 SEP 2020 7:34PM by PIB Hyderabad
చిన్నారుల రక్షణ సేవల (సీపీఎస్) పథకం కింద మద్దతు పొందుతూ, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బాలల సంరక్షణ సంస్థలు (సీసీఐలు) సహా ఆశ్రయ గృహాలు, వాటిలో ఉంటున్న చిన్నారుల సంఖ్యతో కలిపి, గుజరాత్ సహా రాష్ట్రాలవారీ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.
బాలల న్యాయ (చిన్నారులు, చిన్నారుల రక్షణ) చట్టం-2015 (జేజే చట్టం), బాలల న్యాయ (సంరక్షణ, చిన్నారుల రక్షణ) నిబంధన-2016, సీసీఐలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, తనిఖీలు చేయడాన్ని తప్పనిసరి చేశాయి.
జేజే చట్టం అమలు ప్రాథమిక బాధ్యత రాష్ట్రాలు/యూటీలతో ముడిపడివుంది. కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో అవసరమైన సూచనలు అందించింది. దేశంలో జేజే చట్టం అమలును పర్యవేక్షించేందుకు, బాలల హక్కుల రక్షణ కమిషన్ల చట్టం-2005 (సీపీఆర్‌సీ) కింద, బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సీపీఆర్‌సీ)తోపాటు, బాలల హక్కుల రక్షణ రాష్ట్ర కమిషన్లు (ఎస్‌సీపీఆర్‌సీ) ఏర్పాటయ్యాయి.
ఎన్‌సీపీఆర్‌సీ అందించిన సమాచారం ప్రకారం, 2017-18 నుంచి 2019-20 వరకు, ఈ మూడేళ్లలో సీసీఐలు, ఆశ్రయ గృహాల్లో బాలలపై హింస, లైంగిక వేధింపులపై 41 ఫిర్యాదులు అందాయి. రాష్ట్రాలు/యూటీలవారీ వివరాలు అనుబంధం-IIలో ఉన్నాయి.
కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.
***
(Release ID: 1658385)
Visitor Counter : 993