వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ దిగుమతులు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2020 1:45PM by PIB Hyderabad
భారతదేశ ప్రధాన దిగుమతులలో వంటనూనెలు, పప్పుదినుసులు, తాజా పండ్లు, ముడుఇ జీడిపప్పు, చక్కెర, ముడు ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. మొత్తం భారత వ్యవసాయ దిగుమతులలో వీటి వాటా దాదాపు 84%.
వ్యవసాయ వర్తకంలో భారత్ మిగులులో ఉంది. ప్రధాన దిగుమతిగా ఉన్న వంటనూనెల విషయాన్ని జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ జాతీయ మిషన్ చూస్తోంది. వ్యవసాయ దిగులుల మీద ఆధారపడటం తగ్గించాలంటే పంటల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచటం చాలా ముఖ్యమైన చర్య. అందువలన నూనె గింజలు, ఆహార ధాన్యాలు. పప్పు దినుసులు, పండ్లు, సుగంధద్రవ్యాలు తదితరాల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచటానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటూ అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అందులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ( ఆర్ కె వి వై), జాతీయ ఆహర భద్రతా మిషన్ (ఎన్ ఎఫ్ ఎస్ ఎమ్), ఎన్ ఎఫ్ ఎస్ ఎమ్-నూనె గింజలు, ఆయిల్ పామ్, తూర్పు భారతానికి హరిత విప్లవం తీసుకురావటం ( బిజిఆర్ఇఐ), సమీకృత ఉద్యానాభివృద్ధి మిషన్ ( ఎం ఐ డి హెచ్), ప్రధాన మంత్రి కృషి చించాయ్ యోజన ( పిఎం కె ఎస్ వై) భూసార ఆరోగ్య కార్డు ఉన్నాయి.
భారత వ్యవసాయ పరిశోధనామండలి ( ఐసిఎంఆర్), రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ( ఎస్ ఎ యు) అనేక మెరుగైన హైబ్రిడ్ వంగడాలను అభివృద్ధి చేశాయి. దీనివలన ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగాయి. ఎన్ ఎఫ్ ఎస్ ఎమ్ ) నూనె గింజలు, ఆయిల్ పామ్) కింద రైతులకు వివిధ అంశాలలో సాయం అందిస్తున్నారు. అందులో ధ్రువీకృత విత్తనాల పంపిణీ, నాటు వేసే పరికరాలు, ప్రయోగాత్మక ప్రదర్శనలు, ఐ పి ఎం, ఐ ఎన్ ఎం, పిపి రసాయనాలు, అనేక వ్యవసాయ సాధనాలు, రైతులకు శిక్షణ, నీటిపారుదల పరికరాలు, నూనె గింజల ఉత్పత్తి పెంచే చర్యలు ఉన్నాయి.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ ఈ రోజు రాజ్య సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారం ఇది.
***
(రిలీజ్ ఐడి: 1658335)
సందర్శకుల సూచీ సంఖ్య : : 140