నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ, గిరిజన పారిశ్రామికవేత్తల కోసం అంకుర సంస్థ‌ల అనుకూల పర్యావరణ వ్యవస్థ

Posted On: 23 SEP 2020 1:38PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ‌పు 'నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ'  దేశంలో యువత, మహిళల వ్యవస్థాపకత అభివృద్ధికి వివిధ‌ పథకాల‌ను మరియు ప‌లు‌ కార్యక్రమాల అమలుకు త‌గు చొరవ తీసుకుంటోంది. వ్యవస్థాపకతపు విద్య, హ్యాండ్‌హోల్డింగ్ & మెంటర్‌షిప్‌తో పాటుగా,ఆర్థిక మరియు మార్కెట్ సంస్థలతో అవసరమైన అనుసంధానాల ద్వారా ఆయా కార్య‌క్ర‌మాల అమ‌లు చేప‌డుతోంది.పురి, వారణాసి, హరిద్వార్, కొల్లూరు, పంధర్‌పూర్ మరియు బోధ్ ‌గ‌యా వంటి ఆరు ఆల‌యన‌గ‌రాల‌లో సూక్ష్మ, చిన్న సంస్థల ఏర్పాటు ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వానికి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) ఒక ప్రాజెక్టును అమలు చేస్తోంది. మొదటి తరం వ్యవస్థాపకులు, విద్యావంతులైన నిరుద్యోగ యువత, పాఠశాల/ కళాశాల విద్యార్ధులు, మహిళలు, వెనుకబడిన సమాజానికి చెందిన యువత మొదలైన వారిలో త‌గిన వ్యవస్థాపక సామర్థ్యాన్ని ఒడిసిపట్టి వారిని ప్రోత్స‌హించేలా  ఈ ప‌థ‌కం కింద త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టారు. మహిళ‌ల్లో  వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి.. నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) జర్మనీ దేశానికి చెందిన 'డ్యూయిష్ గెసెల్స్‌చాఫ్ట్‌ఫోర్ ఇంటర్నేషనల్ జుసామెనార్‌బీట్' (జీఐజెడ్) వారి సహకారంతో ‘మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక సాధికారత మరియు మహిళల స్టార్టప్‌లు’ అనే ప్రాజెక్టును అమలు చేస్తోంది. అస్సాం, రాజస్థాన్, తెలంగాణలో ఇప్పటికే ఉన్న సంస్థల స్థాయిని పెంచేందుకు.. కొత్త వ్యాపారాల ప్రారంభానికి గాను సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల‌ను నిర్వ‌హిస్తున్న మ‌హిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రాజెక్ట్ పైలట్ల ఇంక్యుబేషన్ మరియు త్వరణం కార్యక్రమం నిర్వ‌హిస్తున్నారు. దాదాపు 250 మంది మహిళలతో ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని, 100 మంది మహిళలతో త్వరణం కార్యక్రమాన్ని పైలట్ చేయాలనే లక్ష్యంగా.. ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. ఈ సహాయక కార్యక్రమంలో మొదటి బృందం చేయూత కార్య్ర‌క్ర‌మం  ఈ ఏడాది ఏప్రిల్-మే నెల‌లో ముగిసింది. రెండో బృందం కార్య‌క్ర‌మం ఈ ఏడాది జూలై  నెల‌లో ప్రారంభమైంది.
'పీఎం యువ'..
వ్య‌వ‌స్థాప‌క‌త విద్య‌, ట్రైనింగ్ అడ్వకేసీ ద్వారా త‌గిన ఎకోసిస్టమ్‌ను రూపొందించే దిశగా ఎంఎస్‌డీసీ 'పీఎం యువ' (పీఎం యువ ఉద్య‌మితా వికాస్ అభియాన్) అనే పైలట్ ప‌థకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్‌ను ఔత్సాహికులు సులువుగా పొందేందుకు వీలుగా త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రధాన్ మంత్రి కౌషల్ కేంద్రా, జ‌న్ శిక్ష‌ణా సంస్థాన్‌ వంటి నైపుణ్య పర్యావరణ వ్యవస్థ నుండి బయటకు వచ్చే విద్యార్థులు / ట్రైనీలు మరియు పూర్వ విద్యార్థులపై దృష్టి పెడుతోంది.
ఆర్‌ఎస్ఈటీఐల ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ‌..
ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా, గ్రామీణ స్వయం ఉపాధి మరియు శిక్షణా సంస్థల (ఆర్‌ఎస్ఈటీఐ) ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇది నైపుణ్య శిక్షణ పొందినవారు సూక్ష్మ సంస్థలను ఏర్పాటు చేసుకోవ‌డానికి వీలుగా బ్యాంక్ రుణ‌ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. గ్రామీణ పేద యువతకు వేతనం లేదా స్వయం ఉపాధితో త‌గిన ఉపాధిని పెంచేలా ఈ పథకం చేప‌డుతున్నారు. ఆర్ఎస్ఈటీఐ కార్యక్రమాన్ని ప్రస్తుతం 585 ఆర్ఎస్ఈటీఐల ద్వారా 23 ప్రముఖ బ్యాంకులు (ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగాలు మరియు కొన్ని గ్రామీణ బ్యాంకులు) 33 రాష్ట్రాలు/ ‌కేంద్ర పాలిత ప్రాంతాలలో దేశంలోని 566 జిల్లాలలో అమ‌లు చేస్తున్నారు. వీటిలో ఒడిశాలో 30 ఉన్నాయి, కేబీకే ప్రాంతంలో 3 ఉన్నాయి. గ్రామీణ పేదలకు వివిధ నైపుణ్య వ్యవస్థాపక అభివృద్ధి కార్యకలాపాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు సొంత సంస్థలను ప్రారంభించడానికి వీలు క‌ల్పిస్తోంది.
స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్య‌క్ర‌మం..
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్‌దయాల్ అంత్యోద‌య‌ యోజన- జాతీయ‌ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద  స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్య‌క్ర‌మంను (ఎస్‌వీఈపీ) అమలు చేస్తోంది. గ్రామీణ పేదలు పేదరికం నుండి బయటపడటానికి గాను సంస్థలను స్థాపించడానికి, మరియు సంస్థలను స్థిరీకరించే వరకు సహాయాన్ని అందించే లక్ష్యంతో దీనిని 2016 నుంచి అమ‌లు చేస్తున్నారు. సంస్థల ప్రమోషన్ కోసం స్థానిక కమ్యూనిటీ క్యాడర్లను సృష్టించేటప్పుడు ఆర్థిక సహాయం మరియు వ్యాపార నిర్వహణ మరియు మృదువైన నైపుణ్యాలపై శిక్షణతో స్వయం ఉపాధి అవకాశాలను అందించడంపై ఎస్‌వీఈపీ త‌గిన దృష్టి పెడుతుంది. స్వయం ఉపాధి అవకాశాలను క‌ల్పించ‌డం, త‌గిన ఆర్థిక సహాయం అందించడం, స్థానిక కమ్యూనిటీ కార్యకర్తల‌లో సంస్థల ఏర్పాటు ప్రోత్సా‌హానికి గాను వ్యాపార నిర్వహణ మరియు సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్ష‌ణ‌ను కూడా అందిస్తోంది. ఎస్‌వీఈపీ ఒడిశాతో సహా 23 రాష్ట్రాల్లో వ్యాపార సహాయ సేవలను మరియు మూలధనాన్ని స‌మ‌కూర్చ‌డం వంటి సేవ‌ల‌ను విస్తరించింది.
గిరిజనుల కోసం ప్రధాన్ మంత్రి వ‌న్ ధన్ యోజన..
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'ప్రధాన్ మంత్రి వ‌న్ ధన్ యోజన' (పీఎంవీడీవై) అనే మార్కెట్ అనుబంధ‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తోంది. గిరిజనుల‌ స్వయం సహాయక సమూహాల క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేసి వాటిని గిరిజన ఉత్పత్తి సంస్థలుగా బలోపేతం చేయడానికి ఇది దోహ‌దం చేస్తోంది. ఆర్థిక సేవ‌ల శాఖ ద్వారా భారత ప్రభుత్వం స్టాండ‌ప్ ఇండియా అనే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు కనీసంగా ఒక‌ షెడ్యూల్డ్ కులానికి చెందిన లేదా షెడ్యూల్డ్ తెగల‌ వారికి రూ.10 ల‌క్షల ‌- రూ.కోటి వ‌ర‌కు రుణం అందించాల్సి ఉంటుంది.. వాణిజ్య సేవలు లేదా ఉత్పాదక రంగంలో గ్రీన్ ఫీల్డ్ ఎంటర్‌ప్రైజ‌స్‌ ఏర్పాటుకు గాను ఒక మ‌హిళా రుణ గ్ర‌హీత‌కు రుణం  
అందించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ) ద్వారా 'ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని' (పీఎంఈజీపీ) అమలు చేస్తోంది. ఇది వ్యవసాయేతర రంగానికి సూక్ష్మ సంస్థల స్థాపన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ప్రాజెక్టుల గరిష్ట వ్యయం త‌యారీ రంగంలో రూ.25 లక్షలు, సేవా రంగంలో రూ.10 లక్షలు.. పీఎంఈజీపీ కింద కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రయోజనం పొందవచ్చు.

కేంద్ర నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపకత శాఖ స‌హాయ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక‌ సమాధానంలో తెలిపారు.
                                   

*******



(Release ID: 1658331) Visitor Counter : 336


Read this release in: English , Marathi , Punjabi , Tamil