గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లకు అర్హత పొందనున్న పట్టణ స్థానిక సంస్థలు
Posted On:
22 SEP 2020 5:52PM by PIB Hyderabad
ఆస్తి పన్ను కనిష్ఠ ధరలను రాష్ట్రాలు ప్రకటించవలసి ఉంటుంది
కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్ యు ఎ)చే 29.05.2020న పట్టణాభివృద్ధి మంత్రుల సమాలోచన బృందం ఏర్పాటు
పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు (యు ఎల్ బిలు) 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను ప్రోణ్డే అర్హత సంపాదిస్తాయని 15వ ఫైనాన్స్ కమిషన్ 2020-21 సంవత్సరపు నివేదికలో తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాలు కనీస ఆస్తి పన్ను ప్రకటించడంతో పాటు రాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తికి అనుగుణంగా ఆస్తిపన్ను వసూళ్ళలో పెరుగుదల కనిపించాలి. అంతేకాక ఎక్కువ రుణాలు పొందడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద రాష్ట్రాలకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 2% అదనంగా ఋణం పొందడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఆస్తి పన్ను మరియు నీరు, మురుగు నీరు, డ్రైనేజీ లకు యూజర్ చార్జీలు వసూలులో సంస్కరణల ఆధారంగా అదనపు రుణంలో 0.25% ఇస్తారు.
(i) ఎ) పట్టణ స్థానిక సంస్థలలో కనీస ఆస్తిపన్ను రేట్లను రాష్ట్రాలు ప్రకటిస్తాయి. సర్కిల్ రేట్ల (బహిరంగ మార్కెట్ విలువ మేరకు ఆస్తుల లావాదేవీలు జరుగుతాయి) ఆధారంగా వాటిని నిర్ణయిస్తారు. బి) నీటి సరఫరా, డ్రైనేజి మరియు మురుగునీరు ఏర్పాట్లపై ఆధారపడి కనీస యూజర్ చార్జీలను నిర్ణయిస్తారు అవి ప్రస్తుత ధరలు / గత ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తాయి.
(ii) పెరిగే ధరలకు అనుగుణంగా ఆస్తి పన్ను / యూజర్ చార్జీలను నియమితకాలిక పద్ధతిలో పెంచే వ్యవస్థను రాష్ట్రాలు ఏర్పాటుచేస్తాయి.
ఈ సంస్కరణలను రాష్ట్రాలు అవలంభించడం వల్ల ఆస్తి పన్ను వసూళ్లు పెరుగుతాయి అందువల్ల యు ఎల్ బిల రెవెన్యూ పెరుగుతుంది. ఆస్తి పన్ను సంస్కరణలను అమలు చేయడం కోసం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్ యు ఎ) 29.05.2020న కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన పట్టణాభివృద్ధి మంత్రుల సమాలోచన బృందం ఏర్పాటు చేసింది. గుజరాత్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, త్రిపుర మరియు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాంతీయ ప్రాతినిధ్యం కల్పించింది.
ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులు, అభ్యాసాలను అధ్యయనం చేసిన మంత్రిత్వ శాఖ ఆచరణలో ఉన్న మంచి పద్ధతులను సమాలోచన బృందం ముందుంచింది. బృందం అభిప్రాయాలను, ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకొని యు ఎల్ బిలలో సంస్కరణలు తేవడానికి దశలవారీగా, అంచెలంచెలుగా చేపట్టవలసిన చర్యల అమలు ప్రణాళికను సిఫార్సు చేస్తూ మంత్రిత్వ శాఖ పనిముట్లను (టూల్ కిట్) సిద్ధం చేస్తోంది. ఈ సిఫార్సుల లక్ష్యం యు ఎల్ బిలకు లభ్యమయ్యే వనరులను పెంచడమే.
కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్దీప్ సింగ్ పూరీ లోక్ సభకు మంగళవారం ఈ మేరకు లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 1658073)
Visitor Counter : 184