మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కౌమారదశలోని బాలికలు,గర్భిణులు, బాలింతల ఎముకలు,కండరాల పుష్టిలో పౌష్టికాహారం పాత్ర పైన. అలాగే బాలలలో పాఠశాల స్థాయిలో ఇన్‌ఫెక్షన్ల నిరోధం, వాటి అదుపునకు సంబందించి మూడవ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఉత్సవాలలో భాగంగా వెబినార్ లు నిర్వహించడం జరిగింది
Posted On:
22 SEP 2020 5:26PM by PIB Hyderabad
మూడవ రాష్ట్రీయపోషణ్ మాహ్ ను సెప్టెంబర్ 2020లో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ పలు వెబినార్లు నిర్వహిస్తున్నది. ఈ వెబినార్ కౌమార దశలోని బాలికలు ,గర్భిణులు, బాలింతల ఎముకలు,కండరాల పుష్టి, ఆరోగ్యంలో పౌష్టికాహారం పాత్ర పైన దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ వెబినార్ సెప్టెంబర్ 15న జరిగింది. ఈ సీరిస్‌లో చివరిదిగా పిల్లలో పాఠశాల స్థాయిలో ఇన్ఫెక్షన్ల నిరోధానికి సంబంధించిన వెబినార్‌ను ఈరోజు నిర్వహించారు. ఈ వెబినార్‌కు మహిళ శిశు అభివృద్ధి విభాగం కార్యదర్శి శ్రీరామ్ మోహన్ మిశ్ర అధ్యక్షత వహించారు.
కౌమారదశలోని బాలికలు,గర్భిణులు, బాలింతల ఎముకలు,కండరాల ఆరోగ్యంలో పౌష్టికాహారం పాత్ర పైజరిగిన వెబినార్‌లో అతిథిగా మాట్లాడుతూ మేజర్ జనరల్ డాక్టర్ రమణ్ కుమార్ మర్వాహా,భారతీయ బాలలు, కౌమార దశలోని వారు, గర్భిణులు, బాలింతల ఎముకలు, కండరాలు బలంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇందుకు సంబంధించిన వివిధ పరిశోధనలను వారు ప్రస్తావించారు. ఎముకలలో పుష్టిలేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.9 మిలియన్ల మంది ఎముకలు విరిగే సమస్యకు కారణమౌతున్నదని చెప్పారు. ఆహారంలో తగినంత కాల్షియం ఉండేట్టు చూసుకోవడం, సూర్యరశ్మి సోకేలా జాగ్రత్తలు చేపట్టడం, బలవర్థకమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వంటి వాటిని మేజర్ జనరల్ డాక్టర్ మార్వాహ సూచించారు. పుష్టికరమైన ఎముకలకు ఇవి అవసరమని ఆయన తెలిపారు. గర్భిణులు,బాలింతలలో ఎముకల పటుత్వం గురించి రెండవ అతిథి డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణలో పౌష్టికాహార పాత్రపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన పరిశోధనల ఫలితాలను ప్రస్తావిస్తూ, మంచి ప్రొటీన్లు,కాల్షియం,జింక్ తదితరాలు, విటమిన్‌డి,ఇతర పౌష్టికార అనుబంధాలను బిడ్డ మొదటి వెయ్యిరోజులు వాడాలాని అది ఎముకలు,కండరాల బలానికి ఉపయోగపడతాయని చెప్పారు.
బాలలలో రకరకాల ఇన్‌ఫెక్షన్లు రాకుండా నియంత్రించేందుకు పాఠశాల స్థాయిలో తీసుకోవలసిన చర్ల గురించి సిఎంసి వెల్లూరుకు చెందిన ,డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ వివరించారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే 5 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలలో ఇలాంటి ఇన్‌ఫెక్షన్లురాకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి తెలిపారు. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ల వల్ల కోల్పోయిన వైకల్య సర్దుబాటు జీవిత సంవత్సరాల గురించి, మరణాల గురించి తెలియజేశారు. ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు నీళ్లనుంచి, ఆహారం నుంచి లేదా వ్యక్తులనుంచి వ్యక్తులకు సంక్రమిస్తాయని దీనివల్ల డయేరియా , డిసెంట్రీ వంటవి రావచ్చన్నారు. పరిశుభ్రమైన నీటిని సేవించడం, పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన పరిసరాలు, పుష్టికరమైన ఆహారం, తగిన వాక్సిన్లు, ఆరోగ్యవిద్యపై అవగాహన కల్పించడం,పరీక్షలు నిర్వహించడం, రెఫరల్ సదుపాయాలు వంటివి వీటిని నిరోధించేందుకు ఉపకరిస్తాయని అన్నారు. పాఠశాల ఆరోగ్య సేవలు పిల్లల శ్రేయస్సుపై దృష్టిపెట్టాలన్నారు.
భాగస్వామ్య మంత్రిత్వశాఖల ప్రతినిధులు, రాష్ట్రప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిథులు, అభివృద్ది భాగస్వాములు,పిఆర్ ఐ సభ్యులు, ఐసిడిఎస్ అధికారులు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధిప్రతినిధులు, ఈ రంగంలో నిపుణులు,
పౌష్టికాహార నిపుణులు, మంత్రిత్వశాఖ అధికారులు, ఇతరులు ఈ వెబినార్లలో పాల్గొన్నారు.
***
(Release ID: 1658025)