మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
21వ శతాబ్దపు విద్య యొక్క ఆశయాలు లక్ష్యాలను అనుసంధానిస్తూ కొత్త వ్యవస్థను రూపొందించనున్న ఎన్ఈపీ: విద్యా మంత్రి
Posted On:
22 SEP 2020 7:08PM by PIB Hyderabad
విద్యా మంత్రిత్వ శాఖ 'జాతీయ విద్యా విధానం 2020'ని (ఎన్ఈపీ-2020) ఈ ఏడాది జులై 29న (29.07.2020) ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్ సమ్మతి తరువాత ఈ విధానాన్ని ప్రకటించింది. విద్యా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ అయిన
https://www.mhrd.gov.in/sites/upload_files/mhrd/files/NEP_Final_English_0.pdfలో ఇది అందుబాటులో ఉంది. ఎన్ఈపీ-2020 విధానం ఈ 21వ శతాబ్దం యొక్క మొదటి విద్యా విధానం.. మరియు ఇది దేశంలో పెరుగుతున్న అనేక అభివృద్ధి అవసరాలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం విద్యా నిర్మాణం యొక్క అన్ని అంశాలను సవరించడానికి మరియు పునరుద్ధరించడాన్ని ప్రతిపాదించింది. ఈ విధానం 21వ శతాబ్దపు విద్య యొక్క ఆకాంక్షాత్మక లక్ష్యాలతో అనుసంధానించిన కొత్త వ్యవస్థను రూపొందించడానికి, దాని నియంత్రణ మరియు పాలనతో సహా సవరించడాన్ని ఇది ప్రతిపాదితం చేసింది. 21వ శతాబ్దపు విద్య ఆశయాలను లక్ష్యాలతో అనుసంధానించడంతో పాటు భారతదేశ సంప్రదాయాలు మరియు విలువలను నిర్మిస్తూనే సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యం (ఎస్‌డీజీ) నాలుగులో సూచించిన మేరకు పిల్లలందరికీ ఉచిత, సమానమైన మరియు నాణ్యమైన ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య నిర్ధారించేలా కొత్త విధానం రూపొందించడమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలితపు ప్రాంతాలతో సహా అన్ని భాగస్వామ్యపక్షాల వారితో వివరణాత్మక సంప్రదింపుల ప్రక్రియ తరువాత ఎన్ఈపీ -2020 ఖరారు చేయబడింది. ఈ మంత్రిత్వ శాఖ ఎన్ఈపీ 2020ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితపు ప్రాంతాల ప్రభుత్వాలకు పంపడంతో పాటు దానిని హృదయపూర్వకంగా అమలు చేయాలని కోరడమైంది.
కొత్త విధానంలో వివిధ థీమ్‌లపై ఉద్దేశపూర్వక మరియు ఇతరాలైన సలహాలను రూపొందించే లక్ష్యంతో ఎన్ఈపీ-2020 అమలు చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 25, 2020 వరకు ‘శిక్షక్ పర్వ్’ కూడా నిర్వహిస్తోంది. "ఉన్నత విద్యను మార్చడంలో జాతీయ విద్యా విధానం యొక్క పాత్ర" అనే అంశంపై విద్యా మంత్రిత్వ శాఖ గవర్నర్ల సమావేశాన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్ఈపీ 2020 విధనంపై భాగస్వామ్య పక్షాల నుంచి సానుకూల, అధిక ప్రతిస్పందనతో కూడిన విస్తృత ప్రతిస్పందన లభించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
*****
(Release ID: 1658016)
Visitor Counter : 127