మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్‌ఈపీ కింద, గ్రామీణ ప్రాంతాల్లో బహుళాంశాల అభ్యాసన ఎంపికల నిబంధన
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2020 7:09PM by PIB Hyderabad
బహుళాంశాల ఎంపికల అంశాలపై, ఉపాధ్యాయుల సన్నద్ధత కూడా సమీకృత, బహుళాంశాల పద్ధతిలో జరుగుతుందని జాతీయ విద్యావిధానం-2020 స్పష్టం చేసింది. అన్ని బోధనాంశాలకు; ముఖ్యంగా కళలు, శారీరక విద్య, వృత్తి విద్య, భాషలు నేర్పించడానికి సరిపడేంతమంది ఉపాధ్యాయులు ఉండేలా భరోసా ఇచ్చేందుకు, పాఠశాల లేదా పాఠశాల సముదాయాల్లోకి ఉపాధ్యాయులను తీసుకోవచ్చని; రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు దత్తత తీసుకున్న పాఠశాలల సమూహాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను మార్పిడి చేసుకోవచ్చని కూడా పేర్కొంది.
ప్రస్తుత అంగన్‌వాడీ కార్యకర్తలు/టీచర్లలో.. ఉత్తమ నాణ్యత గల 'ప్రారంభ దశ బాలల సంరక్షణ, విద్య' (ఈసీసీఈ) టీచర్లను సిద్ధం చేయడానికి ఎన్‌ఈపీ-2020 వీలు కల్పిస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ వృద్ధి చేసిన పాఠ్యాంశాల ప్రకారం క్రమపద్ధతిలో వీరికి శిక్షణ అందుతుంది. ఇంటర్ లేదా అంతకుమించిన అర్హతలున్న అంగన్‌వాడీ కార్యకర్తలు/ఉపాధ్యాయులకు ఈసీసీఈలో ఆరు నెలల శిక్షణ ఉంటుంది. తక్కువ విద్యార్హతలున్నవారికి.. ప్రారంభ అక్షరాస్యత, సంఖ్యలు, ఈసీసీఈ సంబంధిత ఇతర అంశాలతో కూడిన ఏడాది డిప్లొమా కార్యక్రమంలో శిక్షణ ఉంటుంది.
స్మార్ట్ ఫోన్లు, డీటీహెచ్ ఛానెళ్లను ఉపయోగిస్తూ, డిజిటల్ లేదా దూరవిద్య పద్ధతిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు వారి ప్రస్తుత పనిని కాసేపు పక్కనబెట్టి, ఈసీసీఈ అర్హతలను పొందటానికి ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది.
అంగన్‌వాడీ కార్యకర్తలు/ఉపాధ్యాయుల శిక్షణకు పాఠశాల విద్య విభాగానికి చెందిన 'క్లస్టర్ వనరుల కేంద్రాలు' మార్గదర్శనం చేస్తాయి. నిరంతర అంచనా కోసం నెలకు కనీసం ఒక సంప్రదింపుల తరగతి ఉంటుంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 1658014)
సందర్శకుల సూచీ సంఖ్య : : 146