భారత ఎన్నికల సంఘం
కోవిడ్ 19 సమయంలో ఎన్నికల నిర్వహణలో సమస్యలు, సవాళ్లు, ప్రొటొకాల్స్ : దేశ అనుభవాలు పంచుకోవడం పై 21-09-2020 న అంతర్జాతీయ వెబినార్ నిర్వహించనున్న ఇసిఐ
Posted On:
20 SEP 2020 8:41PM by PIB Hyderabad
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 21 2020న, కోవిడ్ 19 సమయంలో ఎన్నికల నిర్వహణలో సమస్యలు, సవాళ్లు, ప్రొటొకాల్స్ ,దేశ అనుభవాలు పంచుకోవడం పై అంతర్జాతీయ వెబినార్ ను నిర్వహించనుంది. ప్రపంచ ఎన్నికల సంస్థల అసోసియేషన్ (ఎ-డబ్ల్యుబ) ఛైర్మన్ పదవిని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వెబినార్ నిర్వహిస్తున్నారు.
2. ప్రపంచ ఎన్నికల సంస్థల అసోసియేషన్ (ఎ-డబ్ల్యుఇబి) ప్రపంచవ్యాప్తంగా గల ఎన్నికల నిర్వహణ సంస్థలకు సంబంధించి అతిపెద్ద అసోసియేషన్. ప్రస్తుతం ఎ-డబ్ల్యుఇబి కి 115 ఎన్నికల సంస్థలు సభ్యులుగా, 16 ప్రాంతీయ అసోసియేషన్లు, ఆర్గనైజేషన్లు దాని అసోసియేట్ సభ్యులుగా ఉన్నాయి. 2011-12 నుంచి ఎ-డబ్ల్యుఇబి ఏర్పాటు ప్రక్రియలో ఇసిఐ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఇసిఐ 2019 సెప్టెంబర్ 3న ఎ- డబ్ల్యుఇబి కి సంబంధించిన 4వ జనరల్ అసెంబ్లీకి బెంగళూరులో ఆతిథ్యం ఇచ్చింది. అలాగే 2019-2021 సంవత్సరానికి ఎ-డబ్ల్యుఇబి చెయిర్‌గా బాధ్యతలు చేపట్టింది.
3. 2019 సెప్టెంబర్ 2న జరిగిన ఎ-డబ్ల్యుఇబి ఎక్సిక్యుటివ్ బొర్డు సమావేశం తీసుకున్న అసాధారణ నిర్ణయం ప్రకారం, భారతీయ ఎ-డబ్ల్యుఇబి సెంటర్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఎ- వెబ్ సభ్య దేశాల అధికారుల సామర్ధ్యం పెంపొందించడానికి ప్రపంచశ్రేణి డాక్యుమెంటేషన్, పరిశోధన, శిక్షణకు దీనిని నెలకొల్పారు.
ఈ కేంద్రానికి అవసరమైన అన్ని వనరులను ఇసిఐ సమకూర్చింది . భారత ప్రధాన ఎన్నికల కమిషనరల్ శ్రీ సునీల్ అరోరా నేతృత్వంలో ఎ-డబ్ల్యుఇబి ఛైర్ పర్సన్ హోదాలో భారతీయ ఎ-డబ్ల్యుఇబి సెంటర్ తరఫున ఎన్నో చర్యలు చేపట్టారు.
4. ఇండియా ఎ -డబ్ల్యుఇబి కేంద్రం ఏర్పాటు చేస్తున్న తొలి వెబినార్ ఇది.ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలకు చెందిన 120 మందికి పైగా ప్రతినిధులు( అంగోలా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బోస్నియా-హెర్జ్‌గోవినా, బోట్స్వానా, బ్రెజిల్, కాంబోడియా, కామెరూన్, కొలంబియా, డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,డొమినికా, ఎల్ సాల్వడార్, ఇథియోపియా, ఫిజి, జార్జియా, ఇండొనేసియా, జోర్డాన్, కజకిస్థాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కిర్గిజ్ రిపబ్లిక్, లైబీరియా, మలావి, మాల్దీవులు, మోల్దోవా, మొజాంబిక్, నైజీరియా, పాలస్తీనా, ఫిలిప్పీన్స్, రుమేనియా, రష్యా, సావో టోమ్, ప్రిన్సిపి, సొలోమన్ ఐలండ్, సియర్రా లియోన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సురినామ్, స్వీడన్ ,తైవాన్, టోంగా, టర్కీ , ఉజ్బెకిస్థాన్, జాంబియా) మరో 4 అంతర్జాతీయ సంస్థలు (అంతర్జాతీయ ఐడిఇఎ, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఎలక్టొరల్ సిస్టమ్స్ (ఐఎఫ్ఇఎస్), ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థలు (ఎ-డబ్ల్యుఇబి).యూరోపియన్ సెంటర్ ఫర్ ఎలక్షన్) లు వెబినార్‌లో పాల్గొననున్నాయి.
5. ఇండియా ఎ-డబ్ల్యుఇబి సెంటర్ ఏర్పడి స్వల్పకాలమే అయింది. అయినా ఇప్పటికే ఇది రెండు ఉపయోగకరమైన గ్రంధాలను తీసుకువచ్చింది. అందులో ఒకటి, దేశాలసమాచారం,సభ్య ఇఎంబిలు, ఎ-డబ్ల్యుఇబి భాగస్వామ్య సంస్థలు కాగా మరొకటి, కోవిడ్ -19 అంతర్జాతీయ ఎన్నికల అనుభవం. దీనిని వెబినార్‌లొ ఎ-డబ్ల్యుఇబి కమ్యూనిటి ప్రయోజనార్థం విడుదల చేస్తారు. ఈ కేంద్రం ఎన్నొ పబ్లికేషన్లను, డాక్యుమెంట్లు, అలాగే ప్రపంచశ్రేణి ప్రమాణాలు కలిగిన ఎ-డబ్ల్యుఇబి ఇండియా జనరల్ ఆఫ్ ఎలక్షన్స్ త్రైమాసిక పత్రికను తీసుకురానుంది. ఈ జర్నల్‌పై బ్రోచర్‌ను వెబినార్‌లో ఆవిష్కరించనున్నారు.
6. వెబినార్‌లొ పాల్గొంటున్న ఇఎంబిలు , సంస్థలు ప్రజెంటేషన్‌లు ఇవ్వనున్నాయి. మొదటి సెషన్‌కు శ్రీ సుశీల్ చంద్ర , గౌరవ ఎన్నికల కమిషనర్ అధ్యక్షత వహిస్తారు. ఫిజి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మంగోలియా, తైవాన్, ఇంటర్నేషనల్ ఐడియిఎ, ఎ-డబ్ల్యుఇబిలు ప్రజెంటేషన్‌లు ఇవ్వనున్నాయి. ఈ సందర్భంగా ఇఎంబిలు, సంస్థలు కోవిడ్ -19 సమయంలో ఎన్నికల నిర్వహణలో సవాళ్లు, అనుభవాలను తెలియజేయనున్నారు. సెషన్ 2కు గౌరవ ఎన్నికల కమిషనర్, శ్రీ రాజీవ్ కుమార్ అధ్యక్షత వహించనున్నారు. దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, ఇండియా ,మలావి, ఐఎఫ్ఇఎస్‌లు తమ ప్రెజంటేషన్‌లు ఇ్వ్వనున్నాయి.
7.2020 సెప్టెంబర్ 21న జరిగే అంతర్జాతీయ వెబినార్‌లొ చర్చలు ఈ సమావేశంలో పాల్గొనేవరందరికీ తమ తమ ఆలోచనలను పంచుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది. అలాగే ఎన్నికల నిర్వహణలో ఒకరి అనుభవాలనుంచి మరొకరు నేర్చుకోవడానికి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు వీలు కల్పించగలదు.
***
(Release ID: 1657340)
Visitor Counter : 234