ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చిన్నారుల రోగ నిరోధక కార్యక్రమంపై మహమ్మారి ప్రభావం

Posted On: 20 SEP 2020 8:22PM by PIB Hyderabad

   కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి 2020 ఏప్రిల్ లో మొదలైన తొలి రోజుల్లో దేశంలో రోగనిరోధక సేవల వినియోగం కాస్త మందగించింది. అయితే, అనేక చర్యలు తీసుకోవడం వల్ల  తర్వాతి కాలంలో సేవలు బాగా మెరుగుపడ్డాయి.

  కోవిడ్-19 సంక్షోభ సమయంలో సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమాల వ్యవస్థ పునరుద్ధరణకోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింది చర్యలు తీసుకుంది.:

  రోగ నిరోధక కార్యక్రమాలతోపాటుగాప్రసూతి సేవలు, తల్లికి, నవజాత శిశువుకు, శిశువులకు అందించే సేవలు, కిశోర బాలల ఆరోగ్య, పౌష్టికాహార సేవలు (ఆర్.ఎం.ఎన్.సి..హెచ్+ఎన్ సేవలు) వంటివి కోవిడ్-19 వ్యాప్తి సమయంలో కూడా చేపట్టడానికి వీలుగా ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు రకాల మార్గదర్శక సూత్రాలను కేంద్రం జారీ చేసింది. రాష్ట్రాలు,,కేంద్ర పాలిత ప్రాంతాల అధికార యంత్రాగాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మార్గదర్శక సూత్రాలను మరింత విస్తృతంగా తెలియజెప్పడానికి సదరు మార్గదర్శక సూత్రాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో పొందుపరిచారు.

  రోగనిరోధక కార్యక్రమాల నిరాటంకంగా కొనసాగేలా చూసేందుకుగాను, కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కూడా కేంద్రం నిర్వహించింది.

  కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో వ్యాక్సీన్ సరఫరాపై ఏర్పడిన సంశయ పరిస్థితిని తొలగించేందుకు, మామూలుగా జరిగే రోగ నిరోధక కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సమాచార సామగ్రిని కేంద్రం రూపొందించి, దాన్ని రాష్ట్రాలతో, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకుంది. వ్యాక్సీన్ సరఫరా వ్యవస్థలో లోపం రాకుండా చూసేందుకు, ఇతర మౌలిక సదుపాయాలను సజావుగా సాగించేందుకు తగిన చర్యలను కూడా తీసుకుంది.

   ఆరోగ్య కార్యకలాపాల నిర్వహణా సమాచార వ్యవస్థ (హెచ్.ఎం..ఎస్.) అందించిన సమాచారం మేరకు  2020 ఏప్రిల్, జూన్ నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 37,49,939మంది బాలలకు, చిన్నారులకు పూర్తి స్థాయిలో రోగనిరోధక సేవలు అందాయి. గత ఏడాది ఇదే సమయంలో 46,75,437 మంది బాలలకు పూర్తి స్థాయి రోగనిరోధక సేవలు అందాయి.

   ప్రతి సారీ రోగ నిరోధక సేవలు అమలు జరిపిన అనంతరం,. సేవల లబ్ధిదారుల జాబితాను తయారు చేయడం జరుగుతోంది. ఎప్పటికప్పుడు జరిగే వ్యాధి నిరోధక వ్యాక్సీన్ కార్యక్రమంలో వ్యాక్సీన్  సేవలు అందని వారిని, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా వ్యాక్సీన్ అందని వారిని గుర్తించడమే లక్ష్యంగా జాబితా తయారీ జరుగుతూ వస్తోంది. .

  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో సమాచారం తెలియజేశారు.

***



(Release ID: 1657154) Visitor Counter : 205


Read this release in: English , Manipuri