ఆర్థిక మంత్రిత్వ శాఖ
కార్పొరేట్ రుణగ్రహీతలకు వ్యక్తిగత హామీదారులపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌బీలకు ప్రభుత్వం సూచన
Posted On:
19 SEP 2020 8:14PM by PIB Hyderabad
'ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్-2016' ప్రకారం నిరర్థక కార్పొరేట్ రుణగ్రహీతలకు వ్యక్తి గత హామీదారులుగా ఉన్న వారికి వ్యతిరేకంగా 'నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్' (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా దరఖాస్తును దాఖలు చేయడానికి గాను రుణదాతలకు 'ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ (కార్పొరేట్ రుణగ్రహీతలకు వ్యక్తిగత హామీదారులుగా ఉన్న వారు దివాలా తీర్మానం ప్రక్రియ అధికారం కోసం దరఖాస్తు) నియమాలు-2019' అధికారం కల్పిస్తున్నాయి. ఈ రోజు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర
ఆర్థిక సేవల శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీలకు) 26.8.2020న ఒక అడ్వైజరీని (సలహావళి) జారీ చేసింది. ఇందులో.. కార్పొరేట్ రుణగ్రహీతలకు వ్యక్తిగత హామీదారులకు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీ ముందు వ్యక్తిగత దివాలా ప్రక్రియను ప్రారంభించాల్సిన ఆయా కేసుల పర్యవేక్షణకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిగణించవచ్చని అడ్వైజరీలో తెలిపింది. కార్పొరేట్ రుణగ్రహీతలకు వ్యక్తిగత హామీదారులకు సంబంధించి తదుపరి మరియు పర్యవసాన చర్యల కోసం అవసరమైన తగిన సమాచారాన్ని సమకూర్చుకోవడానికి సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటును కూడా పరిగణించవచ్చని ప్రభుత్వం పీఎస్‌బీ సంస్థలకు సూచించినట్టు మంత్రి తన రాతపూర్వక సమాధానంలో తెలియజేశారు.
****
(Release ID: 1656854)
Visitor Counter : 121