భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

భారత ద్వీపకల్పంతోపాటు తూర్పు, ఈశాన్య భారతంలో 2020 సెప్టెంబరు 19-23 తేదీల మధ్య వర్షపాతం చురుగ్గా ఉంది; ఈశాన్య బంగాళాఖాతంలో రేపు అనగా... 2020 సెప్టెంబరు 20న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి;

అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో 22న అక్కడక్కడా అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉంది; అలాగే హిమాలయ ప్రాంతాలు, పశ్చిమబెంగాల్, సిక్కింలలోనూ 2020 సెప్టెంబర్ 22, 23తేదీల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉంది;

కర్ణాటక తీరప్రాంతంలోనూ 19, 21 తేదీలలో అక్కడక్కడా అతి భారీవర్షాలు కురిసే అవకాశాలు అధికం; 19, 20 తేదీల్లో దక్షిణ కర్ణాటక లోతట్టు ప్రాంతాలు, ఉత్తర కేరళ, ఘాట్ ప్రాంతాల్లోనూ; దక్షిణ కొంకణ్, గోవాలలో 2020 సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి

Posted On: 19 SEP 2020 6:38PM by PIB Hyderabad

భార‌త వాతావార‌ణ శాఖ‌, న్యూఢిల్లీ ప‌రిధిలోని జాతీయ వాతావ‌ర‌ణ అంచ‌నాల కేంద్రం/ప్రాంతీయ వాతావ‌ర‌ణ కేంద్రం రూపొందించిన ముంద‌స్తు అంచ‌నాల ప్ర‌కారం...

ఎ) వాతావరణ వ్యవస్థలు:

  • ఈశాన్య బంగాళాఖాతంలో రేపు.. అంటే- 2020 సెప్టెంబరు 20కల్లా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి 24 గంటల్లో ఇది వాయవ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమయ్యే అవకాశాలున్నాయి.
  • దీనికితోడు రాబోయే 3-4 రోజులలో పశ్చిమ తీరం వెంబడి దిగువ వాతావరణంలో బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉంది.
  • బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన బలమైన గాలులు సెప్టెంబరు 21నుంచి  ఈశాన్య భారతం, సమీప తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా వీచే అవకాశం ఉంది.

బి) ముందస్తు అంచనాలు - హెచ్చరికలు

  • ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతం, యానాం, తెలంగాణ, ఒడిషాలలో సెప్టెంబరు19-21 తేదీల మధ్య; సెప్టెంబర్ 20, 22 తేదీలలో గంగాతీర పశ్చిమ బెంగాల్‌లో అత్యంత విస్తృత నుంచి విస్తృత వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.

Multi-hazard weather warning for next 5 days

 

***



(Release ID: 1656853) Visitor Counter : 133


Read this release in: Kannada , English