సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప్రోత్స‌హిస్తున్న 'భార‌తీయ సంస్కృతి పోర్ట‌ల్': శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 19 SEP 2020 6:10PM by PIB Hyderabad

పుస్తకాలు, నృత్యం, సంగీతం, స్మారక చిహ్నాలు, శిల్పాలు, పురాతన వస్తువులు, భాషల రూపంలో విస్తారంగాను మరియు విభిన్నత‌తో కూడుకొని భార‌త‌దేశ‌పు సాంస్కృతిక వారసత్వం సమృద్ధిగా ఉంది. ఈ సాంస్కృతిక వారసత్వాలన్నింటినీ ఒకే ఈ-వేదిక‌పైకి తీసుకురావడానికి
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే 10.12.2019న 'భార‌తీయ సంస్కృతి పోర్ట‌ల్'‌ను ప్రారంభించింది. 'భారతీయ సంస్కృతి పోర్టల్‌'లో లభించేటి సమాచారాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థల నుండి సేకరించారు. బహుభాషా వాతావరణంలో ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న అన్ని జ్ఞాన వనరులకు స్థానిక, జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో విస్తృత ప్రజాప్రాప్తిని క‌లిగించ‌డం జ‌రిగింది.

ఈ క్రింది మార్గాల ద్వారా పోర్ట‌ల్‌లోని స‌మాచారం ప్రచారం చేయబడుతోంది:

పోర్టల్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో  ప్రత్యేక పేజీతో ప్ర‌జ‌ల‌కు చేరువ‌చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డ‌మైంది. అన్ని ఎంఓసీ సంస్థల వెబ్‌సైట్లలో అందించిన లింక్‌ల ద్వారాను.. మ‌రియు ఉమాంగ్ ప్లాట్‌ఫామ్‌లోని మొబైల్ ఫోన్ యాప్స్‌ల
ద్వారా కూడా పోర్ట‌ల్‌లోని స‌మాచారం ప్రచారం చేయబడుతోంది. 30,000 పాఠశాలలు మరియు కళాశాల‌లకు ప్రత్యక్ష ప్రమోషన్ ద్వారా ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డ‌మైంది. అరుదైన పుస్తకాలు, ఈ-పుస్తకాలు, పెయింటింగ్‌లు, చిత్రాలు, ఆడియో-క్లిప్‌లు, వీడియో-క్లిప్‌ల రూపంలోనూ వివిధ కంటెంట్ అంశాలను ప్రజలకు అందిస్తున్నారు. వాటిని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
1. అదృశ్యంగా ఉన్న‌ సాంస్కృతిక వారసత్వం
2. ఆహారం మరియు సంస్కృతి
3. ఫోటో ఆర్కైవ్‌లు
4. అరుదైన పుస్తకాలు
5. మాన్యుస్క్రిప్టులు
6. గెజిటీర్లు
7. భారత సంగీత పరికరాలు
8. ఆర్కైవ్‌లు
9. మ్యూజియం సేక‌ర‌ణ‌లు
10. చిత్రాలు
11. వీడియోలు
12. ఆడియోలు
13. కథలు
14. పెయింటింగ్‌లు
15. యునెస్కో
16. పరిశోధనా పత్రాలు
17. ఈ-పుస్తకాలు
18. నివేదికలు మరియు ప్రాసెసింగ్‌లు
19. ఇతర సేకరణలు
20. యూనియన్ కేటలాగ్‌లు
21. భారతీయ జాతీయ గ్రంథ పట్టిక
'భారతీయ సంస్కృతి పోర్టల్‌' వివిధ వర్గాల ద్వారా భారతదేశం యొక్క స్పష్టమైన మరియు అదృశ్యంగా ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప్రోత్సహిస్తోంది. వీటిలో మాన్యుస్క్రిప్ట్స్, మ్యూజియం కళాఖండాలు, పెయింటింగ్స్, ఆర్కైవల్ ఛాయాచిత్రాలు, ఆహారం మరియు సంస్కృతి, భారతదేశ సంగీత వాయిద్యాలు, ఆర్కైవల్ పత్రాలు, సామాజిక పద్ధతులు, ఆచారాలు మరియు పండుగలు, మౌఖిక సంప్రదాయాలు,వ్యక్తీకరణలు మరియు అరుదైన పుస్తకాలు మొదలైనవి ఉన్నాయి. ఈ వివరాలు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి మరియు సింధు లోయ నాగరికత నుండి నేటి వరకు అందించబడ్డాయి. భారతీయ సంస్కృతి పోర్టల్ ప్రస్తుతం  హిందీ మరియు ఇంగ్లీష్ రెండు భాషలలో అందుబాటులో ఉంది. సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేడు లోక్‌స‌భకు ఇచ్చిన లిఖిత‌పూర్వక సమాధానంలో ఈ స‌మాచారాన్ని తెలియ‌జేశారు.
                             

 *****


(Release ID: 1656791) Visitor Counter : 745


Read this release in: English , Marathi , Manipuri