రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

అన్ని ఉత్పత్తులకు బీఐఎస్‌ ధృవీకరణ పొందిన "హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌" ‍

Posted On: 19 SEP 2020 5:32PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే "హిందుస్థాన్‌ ఆర్గానిక్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌" ‍‍(హెచ్‌వోసీఎల్‌), తన అన్ని ఉత్పత్తులకు 'బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌' (బీఐఎస్‌) ధృవీకరణ పొందింది. రసాయనాల తయారీలో, ప్రారంభ సమయం నుంచే హెచ్‌వోసీఎల్‌ ఒక మార్గదర్శక సంస్థ. నాణ్యత దాని నినాదం.

    హెచ్‌వోసీఎల్‌ అన్ని ఉత్పత్తులు, ముఖ్యంగా నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఔషధ రంగంలో బహుళ ఆదరణ పొందాయి. ఈ సంస్థకు ఇప్పటికే ఐఎస్‌వో 9001, ఐఎస్‌వో 14001 ధృవీకరణ వచ్చింది. అత్యధిక నాణ్యతను కొనసాగిస్తున్న గుర్తుగా సంస్థ అన్ని ఉత్పత్తులకు ఇప్పుడు బీఐఎస్‌ గుర్తింపు దక్కింది.

లైసెన్స్‌ నం: CM/L6400101486,   IS 538 : 2000 ఫినాల్‌ (కార్బోలిక్‌ యాసిడ్‌) గ్రేడ్‌-A
లైసెన్స్‌ నం: CM/L6400101789,   IS 170 : 2004 అసిటోన్‌ 
లైసెన్స్‌ నం: CM/L6400101284,   IS 2080 : 1980 స్టెబిలైజ్‌డ్‌ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ గ్రేడ్‌-1

    రసాయనాల ఉత్పత్తి రంగంలో హెచ్‌వోసీఎల్‌ ఒక నాయకత్వ సంస్థ. కేరళలోని కోచిలో ఉత్పత్తి యూనిట్‌ ఉంది. ఔషధాలు, జిగురు, లామినేట్లు, రంగులు, రబ్బరు రసాయనాలు, పురుగుమందులు, వస్త్ర పరిశ్రమ వంటి ముఖ్యమైన పరిశ్రమలకు అవసరమైన ప్రాథమిక సేంద్రియ రసాయనాలను అందిస్తుంది. కొవిడ్‌ సమయంలో శానిటైజర్లను కూడా ఉత్పత్తి చేసింది.

    దేశీయంగా ప్రాథమిక రసాయనాల ఉత్పత్తి, స్వావలంబన, ముఖ్య రసాయనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా ఉండే తొలి ప్రయత్నంగా హెచ్‌వోసీఎల్‌ను 1960లో స్థాపించారు.

***



(Release ID: 1656781) Visitor Counter : 121


Read this release in: English , Hindi