ఆయుష్

ఆయుర్వేదంతో కేన్సర్ చికిత్సకు రూపకల్పన పరిశోధన ప్రోత్సాహానికి చర్యలు

Posted On: 18 SEP 2020 7:09PM by PIB Hyderabad

కేన్సర్ వ్యాధికి చికిత్సను రూపొందించే లక్ష్యంతో ఆయుర్వేదంలో పరిశోధనను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. స్వతంత్ర ప్రతిపత్తిగల  ఆయుర్వేద శాస్త్ర కేంద్ర పరిశోధన మండలి (సి.సి.ఆర్.ఎస్.)ని ఏర్పాటు చేసింది. ఆయుర్వేద ఆరోగ్య రక్షణ సేవల్లో పరిశోధన చేయడాానికి మండలికి తగిన అధికారాలు ఇచ్చారు.

  కేస్సర్ వ్యాధికి సంబంధించిన ఆయుర్వేదంలో పరిశోధనను సి.సి.ఆర్..ఎస్. చేపట్టింది. కేన్సర్ కు మందును రూపొందిస్తోంది. కింద పేర్కొన్న వివరాలతో సాగించే వైద్య చికిత్సా విధానాలపై ప్రమాణ పత్ర రచన కూడా చేస్తోంది.:-

  • కేన్సర్ రోగుల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఆయుష్ క్యుఒఎల్ 2సి ని రూపొందించడం
  • గర్భాశయ కేన్సర్ కు స్వతస్సిద్ధమైన చికిత్సగా కార్క్ టోల్ ను రూపొందించడం
  • ఆయుర్వేదం ద్వారా కేన్సర్ చికిత్సా పద్ధతులతో వ్యవస్థీకృతంగా సమగ్రమైన విధానాన్ని రూపొందించడం.
  • కేన్సర్ నిర్ముూలకాలుగా ఔషధ మొక్కలు  ఎలా పనిచేస్తాయన్నదానిపై పరీక్షలు జరపడం.
  • ఆయుర్వేద చికిత్స పద్ధతులు: వ్యవస్థీకృత సమీక్ష, గణాంక విశ్లేషణ; చికిత్సా విధానాన్ని పాటిస్తున్న వైద్యుల, సంస్థలనుంచి సమాచారాన్ని ప్రమాణ పత్రాలతో నమోదు చేయడం.

  కేన్సర్ పై ఆయుర్వేద పరిశోధనలో భాగంగా కేన్సర్ అధ్యయనంపై సమగ్ర కేంద్రం (సి...) ఏర్పాటు చేశారు. అఖిల భారత ఆయుర్వేద శాస్త్ర అధ్యయన సంస్థ (....), జాతీయ కేన్సర్ నిరోధక, పరిశోధన సంస్థ (ఎన్..సి.పి.ఆర్.-.సి.ఎం.ఆర్.) ఉమ్మడి సంస్థగా సి...స్థాపన జరిగింది. కేన్సర్ పై పరిశోధన పరస్పర సహకారంతో సాగించాలన్న లక్ష్యంతో సి...ని ఏర్పాటు చేశారు.

  ఇదే లక్ష్యాలు, ఉద్దేశాలతో అఖిల భారత ఆయుర్వేద వైద్యశాస్త్ర అధ్యయన సంస్థ (....) ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రోటరీ కేన్సర్ ఇన్సిట్యూట్ ఆసుపత్రి, ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (...ఎం.ఎస్.)లతో అవగాహనా ఒప్పందం కుదిరింది.

  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ లోక్ సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరాలు తెలియజేశారు

****

   

 


(Release ID: 1656549) Visitor Counter : 123


Read this release in: English , Marathi