రైల్వే మంత్రిత్వ శాఖ

రైళ్ల వేగం పెంచేందుకు బ్లూప్రింట్

Posted On: 18 SEP 2020 5:25PM by PIB Hyderabad

 రైల్వే వ్యవస్థ పరిధిలోని వివిధ రైళ్ల సగటు వేగం పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. రైలు మార్గం స్వభావం, సిగ్నలింగ్ వ్యవస్థలు, రైళ్ల చలనశక్తి, వినియోగంలోని రైలు బోగీలు, ఇంజను, నెట్వర్క్ పరిస్థితి తదితర అంశాలపై రైళ్ల వేగం ఆధారపడి ఉంటుంది. కొన్ని అంతర్జాతీయ రైల్వే వ్యవస్థల్లో ప్రత్యేక రైళ్ల కోసమే కేటాయించిన హైస్పీడ్ రైల్వే లైన్లు ఉంటాయి. జపాన్ లోని షింకాన్సెన్, ఫ్రాన్స్ లోని టి.జి.వి. రైల్వే వ్యవస్థ, ఇలాంటి కోవకే చెందుతాయి. విదేశాల్లోని వివిధ రకాల రైల్వే వ్యవస్థల్లో తిరిగే అన్ని రకాల రైళ్ల సగటు ప్రయాణ వేగం వివరాలను ఇక్కడ వివరించ లేదు. భారతీయ రైల్వేలలో నానా రకాల రైలు వ్యవస్థలు ఉంటాయి. సరుకు రవాణా రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఉమ్మడి రైలు మార్గాలపైనే నడుస్తాయి. ఉన్నత స్థాయిలో సామర్థ్య  వినియోగంతో రైళ్లు నడుస్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్ల సగటు వేగం 70 కిలోమీటర్లకు మించి ఉంది. సూపర్ ఫాస్ట్ రైళ్ల సగటు వేగం 55కిలోమీటర్లకు పైగా, ఎక్స్ ప్రెస్ సర్వీసుల సగటు వేగం 50 కిలోమీటర్లకు పైగా , సరకు రవాణా రైళ్ల వేగం 24కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సరకు రవాణా రైళ్ల సగటు వేగం 46.71 కిలోమీటర్ల స్థాయికి పెరిగింది.

  రైళ్ల వేగాన్ని పెంచడానికి, గూడ్స్ రైళ్లతో పాటు, రైళ్లన్నీ సకాలంలో ప్రయాణించేలా చూడడానికి భారతీయ రైల్వేశాఖ పలు చర్యలు తీసుకుందిమౌలిక సదుపాయాల స్థాయిని పెంచడం, రైలు సర్వీసుల క్రమబద్ధీకరణకోసం  రైలు పెట్టెలు, ఇంజిన్ వంటి వాటిని అధునికకరించడం, తదితర చర్యలు తీసుకున్నారు. భారతీయ రైలు సర్వీసుల వేగం హెచ్చింపునకు రూపొందించిన నమూనా కార్యచరణ (బ్లూ ప్రింట్)లో కింది సిఫార్సులు ఉన్నాయి.

 

  1. ట్రంక్ రూట్లలో ట్రాక్ వేగాన్ని 130 కిలోమీటర్లకు పెంచడం
  2. స్వర్ణ చతుర్భుజి రూట్లలో రైళ్ల వేగాన్ని 160కిలోమీటర్లకు పెంచడం. దీనికి అనుగుణంగా, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ హౌరా సెక్టార్లలో 160 కిలోమీటర్ల వేగం ప్రాజెక్టులకు ఇప్పటికే ఆమోదం లభించింది.
  3. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (.సి.ఎఫ్.) రూపకల్పన చేసిన 110 కిలోమీటర్ల గరిష్ట ఆమోద వేగం ఇంజిన్ల తయారీని నిలిపివేయడం. 160 కిలోమీటర్ల గరిష్టవేగంతో కూడిన లింకే హాఫ్మన్ బుశ్చ్ (ఎల్.ఎఫ్.బి.) బోగీలను, ఇంజన్లను తయారు చేయడం.
  4. రైళ్లు ఢీకొనే పరిస్థితిని నివారించే  వ్యవస్థ (టి.సి..ఎస్.) తదితర ఏర్పాట్లతో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం.
  5. వేగాన్ని దెబ్బతీసే అడ్డంకుల తొలగింపును మరింత వేగవంతం చేయడం. లెవెల్ క్రాసింగ్ గేట్లను తొలగిస్తూ రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలు నిర్మించడం.
  6. సాంప్రదాయ రైళ్ల స్థానంలో మెయిన్ లైన్ ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (మెమూ-ఎం..ఎం.యు.)ను ప్రవేశపెట్టడం.
  7. రైళ్లకు, ప్రత్యేకించి సరకు రవాణా గూడ్సుకు సరైన విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని అమర్చడం.
  8. టైంటేబుల్ లో సామర్థ్యలోపాన్ని తొలగించేందుకు జీరో బేస్డ్ టైమ్ నిర్ధారణ వ్యవస్థ, నిర్వహణ, ట్రాఫిక్ అలవెన్సులను ఒకే రకంగా ఉండేలా చూడటం, రైళ్ల ప్రయాణాలను పెంచడం, సరకు రవాణా రైళ్లకు విడిగా ప్రత్యేక కారిడార్ ను ఏర్పాటు చేసి, సరకు రవాణా రైళ్ల వేగాన్ని పెంచడం.

  రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ రోజు రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వివరాలు తెలిపారు.

*****



(Release ID: 1656545) Visitor Counter : 146


Read this release in: English , Punjabi