మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళలపై హింస

Posted On: 18 SEP 2020 5:20PM by PIB Hyderabad

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2016 నుంచి 2018 సంవత్సరాల్లో మహిళలపై నేరాల గురించి సంవత్సరం వారీగా వివరాలు అనుబంధం -1 లో ఉన్నాయి.

మహిళల భద్రత, సురక్షితను నిర్ధారించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ విషయంలో చట్ట పరంగాను, వివిధ పథకాలు ప్రవేశపెట్టడం ద్వారాను చర్యలు తీసుకుంటోంది. 'క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2018', 'క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2013', 'కార్యాలయంలో మహిళల లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం మరియు పరిష్కార) చట్టం, 2013', ' గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2006 ',' మహిళల ఇండీసెంట్ రిప్రజంటేషన్   (నిషేధం) చట్టం, 1986 ',' వరకట్న నిషేధ చట్టం, 1961 ',' ది ఇమ్మొరల్ ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 'మొదలైనవి తీసుకురావడం జరిగింది. అలాగే పథకాల విషయంలో వన్ స్టాప్ సెంటర్స్, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఉమెన్ హెల్ప్‌లైన్, మహిళా పోలీస్ వాలంటీర్స్, స్వధార్, ఉజ్జవాలా మొదలైనవి.

ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2017-2019 మధ్య వరకట్న సంబంధిత సమస్యల కారణంగా మహిళలు చేసిన ఆత్మహత్యల డేటా అనుబంధం-2లో ఉంది. ‘పోలీస్’, ‘పబ్లిక్ ఆర్డర్’ భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలు. శాంతిభద్రతలు, పౌరుల ప్రాణ, ఆస్తి రక్షణ  బాధ్యతలు ప్రధానంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోనే ఉంటాయి. ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు. 

****


(Release ID: 1656535) Visitor Counter : 452


Read this release in: English , Punjabi