బొగ్గు మంత్రిత్వ శాఖ

50 అంబులెన్సుల కొనుగోలుకు రూ. 5 కోట్ల విరాళం

Posted On: 18 SEP 2020 7:50PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరాడేందుకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ 50 అంబులెన్స్ ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి  రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఎన్ సి ఎల్ సిఎండి శ్రీ ప్రభాత్ కుమార్ సిన్హా, డైరెక్టర్ ( సిబ్బంది) శ్రీ బిమలేందు కుమార్ ఈ మేరకు చెక్కును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కు లక్నోలో అందజేశారు. " ఎన్ సి ఎల్ బొగ్గు కార్యకలాపాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలకూ అపరిమితమైన బొగ్గు అందజేస్తామని గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను. మా కార్పొరేట్  సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా  ఒక కార్పొరేట్ పౌరునిగా రాష్ట్ర అభివృద్ధిలో భాగమవుతాం." అని ఎన్ సి ఎమ్ సిఎండి శ్రీ సిన్హా చెప్పారు.

మినీ రత్న కంపెనీ అయిన్ ఎన్ సి ఎల్, కోల్ ఇండియా అనుబంధ సంస్థలు మూడింటిలో ఒకటి. కోల్ ఇండియా సంస్థ ఏటా 10 కోట్ల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ ఏటా 10 కోట్ల మెట్రిక్ టన్నులు అందజేస్తుంది. మొత్తం 10 బొగ్గు గనులు ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉండగా నాలుగు ఉత్తరప్రదేశ్ లోని సోనేభద్ర జిల్లాలో ఉన్నాయి. అవే కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 20% వాటా సొంతం చేసుకుంటాయి. కంపెనీ బొగ్గులో 57% ఉత్తరప్రదేశ్ లోని వినియోగదారులకు వెళుతుంది. మెజారిటీ వినియోగదారులు విద్యుత్ ప్లాంట్లే. కంపెనీ బొగ్గులో 14%  పైగా ఉత్తర ప్రదేశ్ థర్మల్ విద్యుత్కేంద్రానికి అందుతుంది.

ఎన్ సి ఎల్ సంస్థ ఉత్తర ప్రదేశ్ లో సిఎస్ ఆర్ కార్యకలాపాలకింద అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. గడిచిన ఐదేళ్లకాలంలో అనేక అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేసింది. వీటిలో ఎక్కువ భాగం సోలార్ విద్యుత్ ద్వారా 80  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, కాశీ లోని 13 ఘనరూప వ్యర్థాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించటం, బెనారస్  రైల్వే స్టేషన్ సమీపంలో ఎకో పార్క్ నిర్మాణం, 1800 ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ అందించటం, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు, రోడ్లనిర్మాణం, యువతకు నైపుణ్య శిక్షణ ఉన్నాయి.

 

***



(Release ID: 1656534) Visitor Counter : 155


Read this release in: Assamese , English , Urdu , Hindi